తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

11:42 PM (IST) May 31
అత్యంత ఉత్కంఠ రేకెత్తించిన మిస్ వరల్డ్ పోటీల్లో ఆసియా ఖండానికి చెందిన థాయిలాండ్ సుందరి ఓపల్ సుచాత విజేతగా నిలిచారు.ఆమె 16 ఏళ్ళ వయసులోనే క్యాన్సర్ కి గురై ఇప్పుడు మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
10:56 PM (IST) May 31
మిస్ వరల్డ్ 2025 పోటీలు ముగిశాయి. థాయిలాండ్ అందగత్తె ఓపల్ సుచాత చౌంగ్ శ్రీ మిస్ వరల్డ్ 2025 కిరీటం సొంతం చేసుకుంది. 108 మంది అందగత్తెలు పాల్గొన్న ఈ పోటీలో థాయిలాండ్ అమ్మాయి విన్నర్‌గా నిలవడం విశేషం.
10:07 PM (IST) May 31
ఈ సారి మిస్ వరల్డ్ పోటీలకు చాలా ప్రత్యేకత ఉంది. మూడో సారి ఇండియాలో, తొలిసారి హైదరాబాద్ లో జరిగిన ఈపోటీలో ఇండియా నుంచి పోటీ చేసిన నందిని గుప్తా టైటిల్ గెలిచుంటే ఇండియా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసేంది. కాని ఆ రికార్డ్ ను ఇండియా మిస్ అయ్యింది.
09:56 PM (IST) May 31
మిస్ వరల్డ్ 2025 పోటీల్లో థాయిలాండ్ సుందరి ఓపల్ సుచాత విజేతగా నిలిచింది.
09:14 PM (IST) May 31
మిస్ వరల్డ్ 2025 గ్రాండ్ ఫినాలేలో తెలుగు సెలబ్రిటీలు సందడి చేస్తున్నారు. ఇందులో చిరంజీవి, రానా, నమ్రత సందడి చేయడం విశేషం. సీఎం రేవంత్ రెడ్డి సతీసమేతంగా పాల్గొన్నారు.
08:56 PM (IST) May 31
టాప్ 8లో ఇండియాకి నిరాశ తప్పలేదు. ఆసియా- ఓషియానా నుంచి టాప్ 2గా ఫిలిప్పీన్స్, థాయిలాండ్ దేశాల అందగత్తెలు విజేతలుగా నిలిచి టాప్ 8లోకి ఎంట్రీ ఇచ్చారు.
08:00 PM (IST) May 31
మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కలిసి నటించిన `భైరవం` మూవీ శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రం మొదటి రోజు ఎంత వసూలు చేసిందంటే?
06:35 PM (IST) May 31
మహేష్ బాబు హీరోగా నటించిన `ఖలేజా` మూవీ శుక్రవారం రీ రిలీజ్ అయ్యింది. ఫస్ట్ డే కలెక్షన్లలో ఇది సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.
05:34 PM (IST) May 31
నటి కల్పిక వివాదంలో ఇరుక్కుంది. ఆమెకి పబ్ నిర్వాహకులకు మధ్య గొడవ జరిగింది. కేక్ విషయంలో జరిగిన గొడవ ఇప్పుడు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది.
04:55 PM (IST) May 31
04:46 PM (IST) May 31
భారత్ నుంచి తొలిసారి మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకున్న రీటా ఫరియా ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా? సినిమా అవకాశాలు కాదని ఆమె తన ప్యాషన్‌ని వెతుకుంటూ వెళ్లింది.
02:35 PM (IST) May 31
కాబోయే వియ్యంకుడితో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు అక్కినేని నాగార్జున దంపతులు. అఖిల్ పెళ్లికి రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు.
01:13 PM (IST) May 31
ఓ చిత్రంలో చిరంజీవి ప్రాణ స్నేహితుడిగా సూపర్ స్టార్ కృష్ణని నటింపజేయడానికి ప్రయత్నాలు జరిగాయి. కానీ ఆ కాంబినేషన్ ఎందుకు కుదరలేదు అనే ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
12:30 PM (IST) May 31
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సినిమాలతో పాటు వ్యక్తిగత జీవితం, ఫ్యామిలీకి కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. తాజాగా ఆయన కుటుంబంతో దిగిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కారణం – ఆయన కూతురు దియా స్కూల్ గ్రాడ్యుయేషన్ వేడుక.
12:07 PM (IST) May 31
నటుడు, దర్శకుడు అయిన ఆర్ నారాయణ మూర్తి మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. థియేటర్ల బంద్ వివాదంలో ఆయన పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనని తప్పుపట్టారు.
11:31 AM (IST) May 31
మిస్ వరల్డ్ 2025 గ్రాండ్ ఫినాలేకు ఏర్పాట్లు ఘనంగా జరిగాయి. ఈ ఈవెంట్ లో ప్రపంచ దేశాలకు చెందిన మోడల్స్ తో పాటు బాలీవుడ్ స్టార్స్ కూడా సందడి చేయబోతున్నారు.
11:01 AM (IST) May 31
శోభితా ధూళిపాల మే 31న తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమె నటించిన బెస్ట్ మూవీస్, నాగ చైతన్యతో పెళ్ళికి ముందు శోభిత నటిగా ఎలాంటి విజయాలు సాధించింది అనే ఆసక్తికర విషయాలు ఇప్పుడు చూద్దాం.
10:18 AM (IST) May 31
నందమూరి బాలకృష్ణ చేసిన ఓ పనికి.. సెట్ లోనే వెక్కి వెక్కి ఏడ్చింది ఓ హీరోయిన్. ఆ హీరోయిన్ ను బాలయ్య ఏమన్నారు. ఇంతకీ ఏడ్చిన ఆ స్టార్ హీరోయిన్ ఎవరు? ఆతరువాత బాలకృష్ణ ఏం చేశారో తెలుసా?
10:05 AM (IST) May 31
శ్రీలీల తాజాగా షేర్ చేసిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసి ఆమె నిశ్చితార్థం చేసుకున్నట్లు నెటిజన్లు భావిస్తున్నారు.
08:57 AM (IST) May 31
బాలనటుడిగా పలు చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్ దేవాదుల ఇప్పుడు హీరోగా `ఘటికాచలం` అనే చిత్రంలో నటించాడు. హర్రర్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ మూవీ ఆడియెన్స్ ని ఆకట్టుకుందా అనేది రివ్యూలో తెలుసుకుందాం.
08:45 AM (IST) May 31
తెలుగు సినిమా రంగాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన గద్దర్ ఫిల్మ్ అవార్డులపై సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. ఈ అవార్డుల విషయంలో టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు స్పందిస్తూ హర్షం వ్యక్తం చేశారు.
07:55 AM (IST) May 31
తెలుగు సినిమా సూపర్‌స్టార్ ఘట్టమనేని కృష్ణ. టాలీవుడ్ లో ఎన్నో రికార్డ్స్ ఆయన సొంతం. , అభిమానుల ఆరాధ్య దైవం, సూపర్ స్టార్ కృష్ణ గురించి చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాలు ఉన్నాయి. ఘట్టమనేని కృష్ణకు సబంధించిన ఓ 10 అద్భుతాల గురించి ఇప్పుడు చూద్దాం.