వివాదాల్లోనూ దూసుకెళ్తూ.. రికార్డు కలెక్షన్లు రాబడుతున్న ‘కాంతార’.. నెల రోజుల్లో ఎంత వసూల్ చేసింది!

By team teluguFirst Published Oct 31, 2022, 5:02 PM IST
Highlights

కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన ‘కాంతార’ (Kantara) చిత్రం వసూళ్లలో అదరగొడుతోంది. ఇటీవల పలు వివాదాల్లో చిక్కుకున్నా కలెక్షన్లపై ఎలాంటి ప్రభావం చూపడం లేదు. మూడో వారం కూడా సక్సెస్ ఫుల్ గా వసూళ్లు రాబట్టింది.
 

కేజీఎఫ్‌ తర్వాత కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన సినిమాలు బాగా ఆకట్టుకుంటున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాలు సత్తా చాటుతున్నాయి. ఈ క్రమంలోనే కన్నడ నాట నుంచి రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమా కాంతార. ఈమూవీ  కన్నడ ఇండస్ట్రీ నుంచి విడుదలై టాక్‌ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. తెలుగు, హిందీలోనూ ఈ యాక్షన్ మిస్టరీ థ్రిల్లర్‌ అక్టోబర్ 15న గ్రాండ్ రిలీజ్ అయిన అద్భుతమైన రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. 

రీసెంట్ గా చిత్రంలో చెప్పబడిన దేవుళ్లు హిందూ దేవుళ్లకు కాదని కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే కాంతారా చిత్రంలో వినియోగించిన ‘వరాహ రూపం’ సాంగ్ కూడా ఓ కన్నడ మ్యూజిక్ బ్యాండ్ కు సంబంధించిందని ఆరోపణలు వచ్చాయి. ఈ వివాదం కాస్తా కోర్టుకు వరకూ వెళ్లడంతో ‘కాంతార’ టీంకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది.  ‘వరాహ రూపం’ సాంగ్ ను ప్రదర్శించకూడదని ఆదేశించినట్టు తెలుస్తోంది. ఇలా వివాదాల్లో చిక్కుకుంటున్నప్పటికీ సినిమాపై ఎలాంటి ప్రభావం చూపడం లేదు. 

కన్నడ బ్లాక్ బ్లాస్టర్ గా నిలిచిన ఈ చిత్రం తెలుగు, హిందీలో అద్భుతమైన రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటోంది. కేవలం రూ.16 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 250 కోట్లకు పైగా వసూళ్లు చేసినట్టు తెలిసింది. మరీ ముఖ్యంగా హిందీలో ఈ చిత్రం మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. రెండో వారం కంటే మూడో వారం ఎక్కువ కలెక్ట్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నారు. 

సెప్టెంబర్ 30న కన్నడలో రిలీజ్ అయిన ఈ చిత్రం..  తెలుగు, హిందీ, తదితర భాషల్లో మాత్రం అక్టోబర్ 15న విడుదలైంది. అప్పటి నుంచి కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద సండి చేస్తోంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ.272 కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్టు తెలుస్తోంది. ఇందులో కర్ణాటకలో రూ.140  కోట్లు, ఏపీ మరియు తెలంగాణలో రూ.40.60 కోట్లు, తమిళనాడులో రూ.5.7  కోట్లు, కేరళలో రూ.8.2 కోట్లు, నార్త్ ఇండియాలో రూ.51.2 కోట్లు, ఓవర్సీస్ లో రూ.26.30 కోట్లు కలెక్ట్ చేసి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఇంకా కలెక్షన్లు రాబడుతూ ఆల్ టైమ్ బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. ఈ చిత్రానికి రచన, దర్శకత్వంతో పాటు ప్రధాన పాత్రలో రిషబ్ శెట్టి నటించారు. హోంబాలే ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మించారు.

click me!