Kamal Haasan health update: కమల్‌ అభిమానులకు ఊరటనిచ్చే వార్త..ప్రియుడితో శృతి సెల్ఫీ

Published : Nov 27, 2021, 12:16 PM IST
Kamal Haasan health update: కమల్‌ అభిమానులకు ఊరటనిచ్చే వార్త..ప్రియుడితో శృతి సెల్ఫీ

సారాంశం

కమల్‌ని చెన్నైలోని శ్రీరామచంద్ర మెడికల్‌ సెంటర్‌కి తరలించి చికిత్స అందిస్తున్నారు. తాజాగా కమల్‌ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్‌ విడుదల చేశారు ఆసుపత్రి వైద్యులు.

కమల్‌ హాసన్‌ క్రమంగా కోలుకుంటున్నారు. ఆయన ఆరోగ్యం మెరుగు పడుతుందట. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. కమల్‌ హాసన్‌ ఇటీవల కరోనా వైరస్‌కి గురైన విషయం తెలిసిందే. అమెరికా చికాగోలో ఆయన `హౌస్‌ ఆఫ్‌ ఖద్దర్‌` అనే దుస్తుల షోరూమ్‌ని ప్రారంభించారు. అక్కడే కమల్‌ కరోనా వైరస్‌ బారిన పడినట్టు తెలుస్తుంది. ఆ కార్యక్రమం పూర్తి చేసుకుని చెన్నైకి తిరిగి వచ్చాక ఆయనకు దగ్గు రావడం ప్రారంభమైంది. దీంతో వైద్యులను సంప్రదించగా, కరోనాటెస్ట్ చేయించారు. ఆర్‌టీ పీసీఆర్‌ టెస్ట్ లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. 

దీంతో వెంటనే కమల్‌ని చెన్నైలోని శ్రీరామచంద్ర మెడికల్‌ సెంటర్‌కి తరలించి చికిత్స అందిస్తున్నారు. తాజాగా కమల్‌ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్‌ విడుదల చేశారు ఆసుపత్రి వైద్యులు. ఇందులో కమల్‌ ఆరోగ్యం కుదుట పడుతుందని, ఆయన బాగానే కోలుకుంటున్నారని, ప్రస్తుతం కమల్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పారు. దీంతో కమల్‌ అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. త్వరగా కోలుకుని పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకుంటున్నారు అభిమానులు. 

మరోవైపు ఆయన పెద్ద కూతురు శృతి హాసన్‌ షూటింగ్‌ పనులు పూర్తి చేసుకుని చెన్నైకి చేరుకున్నట్టు సమాచారం. కమల్‌ చికిత్స తీసుకుంటున్న ఆసుపత్రి చేరుకుని ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారట. అయితే ఈ సందర్భంగా తన చెల్లి అక్షరని కూడా కలిశారు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే శృతితోపాటు ఆమె ప్రియుడు శాంతను హజారిక సైతం ఆమెతోనే చెన్నైకి చేరుకున్నాడని, కమల్‌ని పరామర్శించినట్టు తెలుస్తుంది. తాజాగా శృతి.. తన చెల్లి అక్షర, ప్రియుడు శాంతనుతో కలిసి దిగిన సెల్ఫీని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. నాకిష్టమైన మనుషులు అంటూ పేర్కొంది శృతి. కమల్‌కి కరోనా సోకడంతో తమిళంలో ప్రసారమవుతున్న `బిగ్‌బాస్‌ 5`షోకి ఈ వారం హోస్ట్ గా చేస్తుంది శృతి.

ఇదిలా ఉంటే కమల్‌ హాసన్‌ ఇప్పుడు `విక్రమ్‌` సినిమాలో నటిస్తున్నారు. లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో విజయ్‌ సేతుపతి, ఫహద్‌ ఫాజిల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాజ్‌కమల్‌ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్‌ పతాకంపై కమల్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కాబోతుంది. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచింది. 

also read: Bigg boss season 5: బిగ్ బాస్ హోస్ట్ గా శృతి హాసన్!

also read: Kamal haasan: కమల్ కి రజినీ ఫోన్...!

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Venkatesh Top 10 Movies: తప్పక చూడాల్సిన వెంకటేష్‌ టాప్‌ 10 మూవీస్‌.. ఇలాంటి రికార్డు ఉన్న ఒకే ఒక్క హీరో
Illu Illalu Pillalu Today 13 డిసెంబర్ ఎపిసోడ్ : రామరాజు ముందు నోరు విప్పిన చందు, అమూల్య బలి, భర్తను బకరా చేసిన వల్లి