Aryan khan: తండ్రిపై అర్యాన్‌ ఖాన్‌ స్నేహితుడి ఫ్రస్టేషన్‌.. నవ్వుకున్న తండ్రి.. వీడియో వైరల్‌

By Aithagoni RajuFirst Published Nov 27, 2021, 9:36 AM IST
Highlights

డ్రగ్స్ తీసుకుంటున్నట్టు ఎలాంటి ఆధారాలు నిరూపితం కాకపోవడంతో ఇటీవల ముంబయి కోర్ట్ అర్యాన్‌ ఖాన్‌, ఫ్రెండ్‌ అర్బాజ్‌ మర్చంట్‌, మున్మున్‌ దమేచాలకు బెయిల్‌ మంజూరు చేసింది. 

బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారూఖ్‌ ఖాన్‌(Shah Rukh Khan) తనయుడు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అర్యాన్‌ ఖాన్‌(Aryan Khan)తోపాటు అతని ఫ్రెండ్‌ అర్బాజ్‌ మర్చంట్‌(Arbaaz Merchant), మున్మున్‌ దమేచా లను పోలీస్‌లు అరెస్ట్ చేశారు. క్రూయిజ్‌ షిప్‌లో వీరు పార్టీ చేసుకుంటున్న సమయంలో డ్రగ్స్ తీసుకుంటున్నారని ఆరోపిస్తూ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే వీరు డ్రగ్స్ తీసుకుంటున్నట్టు ఎలాంటి ఆధారాలు నిరూపితం కాకపోవడంతో ఇటీవల ముంబయి కోర్ట్ Aryan Khan, ఫ్రెండ్‌ అర్బాజ్‌ మర్చంట్‌, మున్మున్‌ దమేచాలకు బెయిల్‌ మంజూరు చేసింది. అయితే కోర్ట్ ఆదేశాల మేరకు ఈ ముగ్గురు ముంబయిలోని ఎన్‌సీబీ కార్యాలయంలో ప్రతివారం సంతకాలు చేయాల్సి ఉంటుంది. 

అలా శుక్రవారం అర్యాన్‌ ఖాన్‌, ఫ్రెండ్‌ అర్బాజ్‌ మర్చంట్‌ సంతకాలు చేసేందుకు ఎన్‌సీబీ ఆఫీస్‌కి వచ్చారు. సంతకాలు చేసి అర్యాన్‌ ఖాన్‌ సైలెంట్‌గా వెళ్లిపోయాడు. కానీ ఆ తర్వాత ఎన్‌సీబీ కార్యాలయం నుంచి అర్బాజ్‌ మర్చంట్‌ వస్తున్నారు. ఫోటోగ్రాఫర్లు ఫోటోల కోసం రిక్వెస్ట్ చేస్తుండగా, అర్బాజ్‌ పట్టించుకోకుండా వెళ్లిపోతున్నారు. గేట్‌ బయట ఉన్న అర్బాజ్‌ తండ్రి అస్లామ్‌ మాత్రం ఆయన్ని వెనక్కి లాగి ఫోటోలకు పోజులివ్వాలని కోరారు. దీంతో అర్బాజ్‌ చిరాకు పడ్డాడు. ఇది ఆపండి డాడీ అంటూ అసహనం వ్యక్తం చేశాడు. రెండు సార్లు కొడుకుని ఫోటోల కోసం లాగే ప్రయత్నం చేయగా, ఫ్రస్టేషన్‌తో వెళ్లిపోయాడు అర్బాజ్‌. దీంతో కొడుకులోని ఫ్రస్టేషన్‌ చూసి అస్లామ్‌ నవ్వుకోవడం హైలైట్‌గా నిలిచింది. 

ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. బెయిల్‌ వచ్చింది, దీంతో హాయిగా ఇంటికెళ్లిపోతున్నావు. బెయిల్‌ కోసం ఆ తండ్రి ఎంత స్ట్రగుల్‌ అయ్యాడో ఊహించావా? ఒకవేళ బెయిల్‌ రాకపోతే ఇంకా ఇలాంటివి చాలా చూడాల్సి వచ్చేది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తుండటం విశేషం. ఇదే సమయంలో తన కుమారుడు అర్బాజ్‌ మర్చంట్‌పై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని తేల్చి చెప్పారు అస్లామ్‌ మర్చంట్‌. ముంబయి కోర్ట్ సైతం అర్యాన్‌ ఖాన్‌, అర్బాజ్‌ మర్చంట్‌, మున్మున్‌ దమేచా లు మాదక ద్రవ్యాలను తీసుకుంటున్నట్టు ఎలాంటి ఆధారాలు లేవని గత వారం కోర్ట్ బెయిల్‌ మంజూరు చేసింది. కాకపోతే షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది.

click me!