నేను మీ అడుగుజాడల్లో నడుస్తాను.. ఇర్ఫాన్‌ తనయుడి భావోద్వేగం

By Satish ReddyFirst Published Jul 15, 2020, 3:50 PM IST
Highlights

ఇర్ఫాన్‌ ఖాన్‌ మరణించిన దగ్గర నుంచి ఆయన పెద్ద కుమారుడు బాబిల్‌, సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తండ్రితో తన అనుబంధాన్ని పంచుకుంటున్నాడు. తాజాగా మరోసారి తన తండ్రిని గుర్తు చేసుకుంటూ ఓ భావోద్వేగా పోస్ట్‌ను షేర్  చేశాడు బాబిల్‌.

ఈ ఏడాది ఇండియన్ సినిమా ఎంతగానో నష్టపోయింది, లాక్‌ డౌన్‌ కారణంగా షూటింగ్ లేక, సినిమా రిలీజ్ లు లేక వేల కోట్ల నష్టాలు వాటిల్లాయి. అదే సమయంలో లెజెండరీ ఆర్టిస్ట్‌లుగా పేరున్న చాలా మంది నటులు ప్రాణాలు కోల్పోవటం కూడా ఇండస్ట్రీని కుదిపేసింది. ముఖ్యంగా బాలీవుడ్‌ కీర్తిని అంతర్జాతీయ స్థాయికి చేర్చిన ఇర్ఫాన్ ఖాన్‌ మృతితో పరిశ్రమ ఉలిక్కిపడింది. ఈ ఏడాది ఏప్రిల్ 29న కోకిల్ బెన్‌ హాస్పిటల్‌లో చికిత్సపొందుతూ మరణించాడు ఇర్ఫాన్‌.

ఇర్ఫాన్‌ ఖాన్‌ మరణించిన దగ్గర నుంచి ఆయన పెద్ద కుమారుడు బాబిల్‌, సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తండ్రితో తన అనుబంధాన్ని పంచుకుంటున్నాడు. తాజాగా మరోసారి తన తండ్రిని గుర్తు చేసుకుంటూ ఓ భావోద్వేగా పోస్ట్‌ను షేర్  చేశాడు బాబిల్‌. ఈ సందర్బంగా కొన్ని ఫ్యామిలీ ఫోటోలను కూడా షేర్ చేశాడు బాబిల్‌. అయితే తాజాగా తాను తండ్రి అడుగు జాడల్లో నడిచేందుకు సిద్ధమవుతున్నట్టుగా హింట్‌ ఇచ్చాడు బాబిల్‌.

ఇర్ఫాన్ ఖాన్ సుదీర్ఘ కాలం పాటు అరుదైన క్యాన్సర్‌తో పోరాడి మృతి చెందాడు. లండన్‌లో చాలా రోజులు పాటు చికిత్స పొందిన ఇర్ఫాన్‌ సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అభిమానులతో తన ఆరోగ్య పరిస్థితి గురించి షేర్ చేసుకుంటూనే ఉంటాడు. ఇర్పాన్‌ మృతితో ఒక్కసారిగా ఇండస్ట్రీతో పాటు యావత్‌ భారతం షాక్‌ అయ్యింది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

5 years too much, And now you’re a stranger 5 years in love, Pickin straws out the haystack Flicking through the picket pages Of the books I never read through. And that’s just one half of it The other half is you, Gleaming through the wicked winter moon, I wish I could fit in your shoes. You have gone so far away. And I’m always just a little too late. Plucking the strings of my sitar to soothe, These Monday morning blues And I carried on like the wayward son, In the wayward sun, but I found myself roaming the wastelands. I was high, when I witnessed my mother cry. I might never win. For, never will forget me, the unforgivable sin. Blood on her lips, crippled my heart. Pierced my soul like an adamant dart. Ma, my ma, tell me you love me too. Ma, my ma, I would give it all for you. (Yo bro, u know I love you more than life itself. ) @sikdarsutapa

A post shared by Babil Khan (@babil.i.k) on Jul 14, 2020 at 3:59pm PDT

click me!