నాకు ప్రధానమంత్రి ఆఫీస్ నుండి కాల్ వచ్చింది.. కౌశల్!

By Udayavani DhuliFirst Published Oct 10, 2018, 9:22 AM IST
Highlights

బిగ్ బాస్ సీజన్2 విజేతగా నిలిచాడు కౌశల్. రెండు తెలుగు రాష్ట్రాలలో అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇప్పటికే అతడికి డాక్టరేట్ అవార్డుతో పాటు, అతడి పేరుని గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో నమోదు చేయబోతున్నారని తెలుస్తోంది. 

బిగ్ బాస్ సీజన్2 విజేతగా నిలిచాడు కౌశల్. రెండు తెలుగు రాష్ట్రాలలో అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇప్పటికే అతడికి డాక్టరేట్ అవార్డుతో పాటు, అతడి పేరుని గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో నమోదు చేయబోతున్నారని తెలుస్తోంది. డాక్టరేట్ ఎందుకు ఇస్తున్నారనే విషయాలపై కౌశల్ త్వరలోనే స్పందిస్తానన్నారు.

ఇప్పటివరకు ఏ టీవీ రియాలిటీ షోలోని ఎవరికీ రానన్ని ఓట్లు తనకి రావాడంతో గిన్నీస్ బుక్ నిర్వాహకుల నుండి తనకి కాల్ వచ్చిందని కౌశల్ అన్నారు. అఫీషియల్ గా ఎన్ని ఓట్లు వచ్చాయనే విషయంపై స్టార్ మా యాజమాన్యాన్ని ప్రశ్నించినట్లు త్వరలోనే వారు దీనిపై ఓ నివేదిక ఇవ్వబోతున్నట్లు కౌశల్ అన్నారు.

దాదాపు 40 కోట్ల ఓట్లు వచ్చాయని అంటున్నారు. ఇక అతడికి ప్రధానమంత్రి ఆఫీస్ నుండి కాల్ వచ్చిందని చెప్పి షాక్ ఇచ్చాడు. బిగ్ బాస్ హౌస్ విజేతగా నిలిచిన తరువాత అతడికి కంగ్రాట్స్ చెబుతూ పీఎమ్ ఆఫీస్ నుండి ఓ వ్యక్తి ఫోన్ చేశారట.

కౌశల్ షూటింగ్ లో ఉండడంతో అతడు తండ్రి ఫోన్ తీసి మాట్లాడినట్లు వెల్లడించాడు. మొత్తానికి కౌశల్ క్రేజ్ అన్ని చోట్లకి పాకిందనే చెప్పాలి!

ఇవి కూడా చదవండి.. 

ఏం చేశాడని కౌశల్ కి డాక్టరేట్..?

అలాంటి పాత్రల్లో నటించాలనుంది.. కౌశల్ వ్యాఖ్యలు!

తేజస్వి చాలా సార్లు బూతులు తిట్టింది.. కౌశల్ ఆవేదన!

హౌస్ మేట్స్ పై కౌశల్ సంచనల కామెంట్స్!

కౌశల్ గెలిచినా.. గీతాదే పైచేయి!

బోయపాటి సినిమాపై బిగ్ బాస్ విన్నర్ కౌశల్ కామెంట్స్!

కౌశల్ కి అరుదైన గౌరవం.. ఆయన మాటల్లోనే!

కౌశల్ ఆర్మీ ఎఫెక్ట్.. హీరోయిన్ కి అవమానం!

click me!