ట్రీట్మెంట్ కోసం అనుష్క ఆస్ట్రియా వెళ్లిందట!

Published : Oct 10, 2018, 08:44 AM ISTUpdated : Oct 10, 2018, 08:47 AM IST
ట్రీట్మెంట్ కోసం అనుష్క ఆస్ట్రియా వెళ్లిందట!

సారాంశం

ఒక సినిమా కోసం బరువు పెరగడం.. ఆ తరువాత బరువు తగ్గించుకోవడం నానా ఇబ్బందులు పడుతున్నారు మన స్టార్లు. దక్షినాది స్టార్ హీరోయిన్ అనుష్క కూడా 'సైజ్ జీరో' సినిమా కోసం బరువు తగ్గి ఆ తరువాత తగ్గడానికి చాలా కష్టపడింది.

ఒక సినిమా కోసం బరువు పెరగడం.. ఆ తరువాత బరువు తగ్గించుకోవడం నానా ఇబ్బందులు పడుతున్నారు మన స్టార్లు. దక్షినాది స్టార్ హీరోయిన్ అనుష్క కూడా 'సైజ్ జీరో' సినిమా కోసం బరువు తగ్గి ఆ తరువాత తగ్గడానికి చాలా కష్టపడింది. అందుకే బాహుబలి2, సింగం౩ వంటి సినిమాలలో లావుగా కనిపించిందనే విమర్శలు వినిపించాయి.

ఆమె ఆఖరిగా నటించింది 'భాగమతి' సినిమాలో.. ఈ సినిమా తరువాత అనుష్క ఇప్పటివరకు మరే సినిమా సైన్ చేయలేదు. బరువు తగ్గడం కోసం అమ్మడు డైటింగ్, వర్కవుట్లు చేసింది. దీనికారణంగా ఆమెకి బ్యాక్ పెయిన్ వచ్చిందట. వెన్ను నొప్పితో బాధపడుతున్న ఆమె కేరళలో స్పా థెరపీ తీసుకుంద‌నిఅప్పట్లో వార్తలు వినిపించాయి.

ఆ కారణంగానే ఆమె 'సాహో' సినిమా ఛాన్స్ మిస్ అయిందని అంటారు. అనుష్క బరువు తగ్గేందుకు దేశవ్యాప్తంగా ఎన్నో హెల్త్ సెంటర్స్ తిరిగి ప్రయత్నాలు చేసిందట. ఏది వర్కవుట్ కాలేదని తెలుస్తోంది.

సహజసిద్ధమైన పద్దతుల ద్వారానే బరువు తగ్గాలని భావిస్తోన్న అనుష్కకి కొందరు ఆస్ట్రియా వెళ్లమని సలహా ఇచ్చారట. అక్కడ బరువు తగ్గించుకోవడానికి సహజసిద్ధమైన వైద్యం ఉంటుందని సూచించడంతో ఇటీవల అనుష్క ఆస్ట్రియా వెళ్లినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి.. 

అనుష్క సినిమాలకు గుడ్ బై చెప్పనుందా..?

PREV
click me!

Recommended Stories

Suriya 46 Movie: సూర్య 46కి, గజినీకి సంబంధం ఏంటి? అంచనాలు పెంచేసిన నిర్మాత సమాధానం
2025 లో రియల్ లైఫ్ స్టోరీలతో వచ్చిన 6 సినిమాలు.. కొన్ని హిట్లు, కొన్ని వివాదాలు