`దసరా`లో జీవి ప్రకాష్‌ ఎలా మిస్‌ అయ్యాడు? ఇండియాలోనే ఫస్ట్ టైమ్‌ ఆ జోనర్‌లో `కింగ్‌స్టన్‌`

Published : Mar 03, 2025, 07:00 PM IST
`దసరా`లో జీవి ప్రకాష్‌ ఎలా మిస్‌ అయ్యాడు? ఇండియాలోనే ఫస్ట్ టైమ్‌ ఆ జోనర్‌లో `కింగ్‌స్టన్‌`

సారాంశం

మ్యూజిక్‌ డైరెక్టర్‌ కమ్‌ హీరో జీవీ ప్రకాష్‌ హీరోగా నటిస్తున్న మూవీ `కింగ్‌ స్టన్‌`.     ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా జీవీ ప్రకాష్‌ `దసరా` ఆఫర్‌ గురించి వెల్లడించారు.   

సెన్సేషన్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ జీవీ ప్రకాష్‌.. మ్యూజిక్‌ చేస్తూ హీరోగా మూవీస్‌ చేస్తున్నారు. అటు మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ఇప్పటికే సక్సెస్‌ అయ్యారు. తనకంటూ సెపరేట్‌ గుర్తింపుని సొంతం చేసుకున్నారు. హీరోగానూ నిలబడే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే పలు విజయాలు అందుకున్నారు. కానీ తన రేంజ్‌ హిట్‌ పడలేదు.

ఈక్రమంలో తాజాగా ఆయన `కింగ్‌ స్టన్‌` అనే మూవీలో హీరోగా నటిస్తున్నారు. ఈ మూవీ ఈ నెల 7న విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఆసక్తికర విషయాన్నిపంచుకున్నారు జీవీ ప్రకాష్‌. `దసరా`లో తాను నటించాల్సి ఉందని తెలిపారు.

`దసరా`లో నటించే ఆఫర్‌పై జీవీ ప్రకాష్‌ క్లారిటీ..

తెలుగులో సినిమాలు చేయడం గురించి చెబుతూ, `నాని హీరోగా నటించిన `దసరా` మూవీలో జీవీ ప్రకాష్‌ కి ఆఫర్‌ వచ్చిందట. నానికి ఫ్రెండ్‌ పాత్ర కోసం తననే అడిగారట. వారం రోజుల్లోనే షూటింగ్‌ ఉందని చెప్పడంతో తనకు డేట్స్ అడ్జెస్ట్ కాలేదని, దీంతో ఆ మూవీని వదులుకున్నట్టు తెలిపారు. తాను తెలుగులో సినిమాలు చేయడానికి సిద్ధమే అని, మంచి స్క్రిప్ట్స్ వస్తే నటిస్తానని తెలిపారు జీవీ ప్రకాష్‌. 

ఇండియాలో ఫస్ట్ సీ అడ్వెంచర్స్ థ్రిల్లర్‌ `కింగ్‌ స్టన్‌`

ఇక ఆయన హీరోగా నటించిన `కింగ్‌స్టన్‌` మూవీ గురించి చెబుతూ, ఆసక్తికర విషయాలు వెల్లడించారు. సముద్ర తీరం పక్కన ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరిలో జాలరి పాత్ర చేశాను. సాధారణంగా జాలర్లు అందరూ సముద్రంలో వేటాడడానికి వెళతారు. అయితే ఆ ఊరి ప్రజలు ఎవరూ సముద్రంలోకి వెళ్లరు. ఆ ఊరికి ఒక శాపం ఉంటుంది. అది ఏమిటి? అనేది సినిమాలో చూడాలి.

శాపాన్ని ఎదిరించాలని హీరో సముద్రంలోకి వెళ్తాడు.‌ అక్కడ ఏం జరిగిందనేది సినిమా. ఇండియాలో ఫస్ట్ సీ‌ అడ్వెంచర్స్ థ్రిల్లర్ సినిమా ఇది. సముద్రంలోకి వెళ్ళిన తర్వాత హీరోలకు జాంబీలు ఎదురవుతారు. అలాగే ఆత్మలు కూడా ఉంటాయి. ప్రేక్షకులకు ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది.

సినిమా కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. నాలుగు రోజుల పాటు అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్ కోసం ట్రైనింగ్ తీసుకున్నా. ఒకసారి నీటిలోకి వెళ్ళిన తర్వాత మూడు నిమిషాలు పైకి రావడానికి ఉండదు. శ్వాసను ఎలా ఆపాలి? అనే దాంతోపాటు యాక్షన్ కోసం ట్రైనింగ్ తీసుకున్నాను. ఒకసారి నీటిలో ఉన్నప్పుడు వన్ మోర్ టేక్ అనేవారు.

అప్పుడు ఇంకా ఇబ్బందిగా ఉండేది. షిప్ మీద యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ చేసేటప్పుడు తడి తడిగా ఉంటుంది కనుక జారిపోయేది. ఒక్కోసారి ఒక్క షాట్ చేసిన తర్వాత వేలు లేదా కాళ్ళ మీద గాయాలు అయ్యేవి. బ్యాండేజ్ కట్టుకుని మళ్లీ షూటింగ్ చేసేవాడిని. అయితే యాక్షన్ సీక్వెన్స్ అన్ని బాగా వచ్చాయి. 

టెక్నికల్ పరంగా ఇండియాలో ఇప్పటివరకు ఇటువంటి సినిమా రాలేదు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ నీరవ్ షా మూడు రోజుల పాటు టెస్ట్ షూటింగ్ చేశారు. ఆ తర్వాత గోకుల్ బినోయ్ సినిమా ‌మొత్తం చేశారు. ఒక బోటు మీద ఆర్టిస్టులు ఉంటే మరొక బోటు మీద కెమెరా ఉండేది. అలాగే కొన్ని మీనియేచర్ సెట్స్ కూడా వేశాం. సినిమా విడుదలైన తర్వాత హాలీవుడ్ సైతం ఆశ్చర్యపోతుంది. వీళ్ళు ఈ సినిమా ఎలా చేశారని తప్పకుండా అడుగుతారు.

నేను హీరోగా నటించే సినిమాలు కంటే బయట సినిమాలకు మంచి మ్యూజిక్ ఇస్తానని అందరూ చెబుతారు. కథను బట్టి సంగీతం ఇస్తున్నా. నా సినిమాల కోసం అంటూ స్పెషల్ వర్క్ ఏమీ చేయను. ఈ సినిమా కోసం కొత్త తరహా సౌండ్ కొన్ని వినిపించే ప్రయత్నం చేశా. `హ్యారీ పాటర్`, `పైరేట్స్ ఆఫ్ ద కరేబియన్` వంటి ఫాంటసీ సీ ఫిలిమ్స్ హాలీవుడ్ ప్రొడ్యూస్ చేసింది. ఇది మన సినిమా కాబట్టి ఆ మ్యూజిక్ రిఫరెన్స్ ఏమీ లేకుండా మన సౌండ్ వినిపించాం. 

హీరోగా ఇంకా సినిమాలు చేయాల్సి ఉంది.. అప్పుడే నేనేంటో తెలుస్తుందిః జీవీ ప్రకాష్‌

హీరోగా 25 సినిమాలు... సంగీత దర్శకుడిగా 100 సినిమాలు... ఒకేసారి ఈ మైలురాయి చేరుకోవడం సంతోషంగా ఉంది. 'ప్రేమ కథా చిత్రం' తమిళ రీమేక్ 'డార్లింగ్'తో హీరోగా పరిచయం అయ్యా. అప్పటినుంచి సినిమాలు చేస్తూ ఉన్నా. తమిళంలో మంచి మంచి విజయాలు వచ్చాయి.

ఒక షెడ్యూల్ ప్రకారం పని చేసుకుంటా.‌ యాక్టింగ్, మ్యూజిక్ ఈ రెండిటికి ప్రొపర్ టైం కేటాయిస్తా. ఒకసారి షెడ్యూల్ మిస్ అయినా ప్లాన్ బి ఉంటుంది. సో... ప్రాబ్లం ఏమీ లేదు. దీపావళికి తెలుగులో 'లక్కీ భాస్కర్', తమిళంలో 'అమరన్' సినిమాలు విడుదల అయ్యాయి. ఆ రెండిటికి నేనే సంగీతం అందించా.‌ ఆ రెండు చిత్రాలకు నాకు మంచి పేరు వచ్చింది.

మంచి కథ దొరికితే ఇతర హీరోలతో కూడా సినిమాలు ప్రొడ్యూస్ చేయడానికి రెడీ. కింగ్ స్టన్‌ తర్వాత సెల్వ రాఘవన్ గారి దర్శకత్వంలో ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నా. ఆ కథ చదివిన తర్వాత నాకు విపరీతంగా నచ్చింది. నేను ప్రొడ్యూస్ చేయవచ్చా అని ఆయనను అడిగా. నేను హీరోగా నటించే సినిమాలు మాత్రమే ప్రొడ్యూస్ చేయాలని రూల్ ఏమీ పెట్టుకోలేదు. 

read more:ట్రైన్‌లోనే ఫస్ట్ నైట్‌ చేసుకున్న ఏకైక హీరో ఎవరో తెలుసా? రాఘవేంద్రరావు మామూలోడు కాదు, ఎంత పనిచేశాడు!

'బాహుబలి' ప్రేక్షకులను ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్లింది. అలాగే 'కాంతార' సినిమా ప్రేక్షకులను స్పిరిచువల్ వరల్డ్ లోకి‌ తీసుకు వెళ్లింది. మా 'కింగ్స్టన్' సినిమా కూడా ప్రేక్షకులను ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకు వెళ్తుంది.

హాలీవుడ్ దర్శక నిర్మాతలు వాళ్ల కథలను చెబుతున్నారు. మేం 'కింగ్స్టన్' ద్వారా మన అమ్మమ్మలు, బామ్మలు చెప్పిన కథలను తెరపైకి తీసుకు వస్తున్నాం. ఇది కచ్చితంగా మన ఆడియెన్స్ ఓ కొత్త అనుభూతిని అందిస్తుందని గట్టిగా చెప్పగలను` అని తెలిపారు జీవీ ప్రకాష్‌. 

సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ హీరోగా, దివ్య భారతి హీరోయిన్‌గా నటించిన `కింగ్‌ స్టన్‌` మూవీని జి స్టూడియోస్ సంస్థతో కలిసి ప్యారలల్ యూనివర్స్ పిక్చర్స్ పతాకం మీద జీవీ ప్రకాష్‌ నిర్మించారు. నిర్మాతగా జీవి ప్రకాష్ కుమార్ తొలి చిత్రమిది.

గంగా ఎంటర్టైన్మెంట్స్ అధినేత మహేశ్వర్ రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. కమల్‌ ప్రకాష్‌ దర్శకుడు. తెలుగు, తమిళ భాషల్లో ఈ శుక్రవారం మార్చి 7వ తేదీన విడుదల కానుంది. 

read more: సాయి పల్లవి బెస్ట్ డాన్సర్‌ అవ్వడానికి కారణం అయిన స్టార్‌ హీరో ఎవరో తెలుసా? ఆ కోరిక తీరిపోయిందట!

also read: Suman Life Turn: సుమన్‌కి సెకండ్‌ లైఫ్‌ ఇచ్చిన సూపర్‌ స్టార్‌ ఎవరో తెలుసా? ఆయన నిర్ణయంతో అందగాడి లైఫ్‌ టర్న్
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Nagarjuna తో పోటీకి దిగి.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అల్లరి నరేష్, ఇంతకీ ఆమూవీ ఏదో తెలుసా?
Savitri: మహానటి జీవితం నాశనం కావడానికి జెమినీ గణేషన్‌, పొలిటీషియన్‌ మాత్రమే కాదు, ఆ మూడో వ్యక్తి ఇతడేనా?