'ది ప్యారడైజ్' టీజర్ రివ్యూ, 10 కేజీఎఫ్ లు కూడా సరిపోవు.. వణుకు పుట్టిస్తున్న నాని లుక్

Published : Mar 03, 2025, 01:16 PM IST
'ది ప్యారడైజ్' టీజర్ రివ్యూ, 10 కేజీఎఫ్ లు కూడా సరిపోవు.. వణుకు పుట్టిస్తున్న నాని లుక్

సారాంశం

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ది ప్యారడైజ్. దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని రెండోసారి నటిస్తున్న చిత్రం ఇది. దసరా తర్వాత అంతకి మించేలా మరో చిత్రాన్ని ప్లాన్ చేస్తారని తెలుసు. కానీ ఇంతలా సునామీ సృష్టించబోయే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు ఎవరూ ఊహించలేదు.

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ది ప్యారడైజ్. దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని రెండోసారి నటిస్తున్న చిత్రం ఇది. దసరా తర్వాత అంతకి మించేలా మరో చిత్రాన్ని ప్లాన్ చేస్తారని తెలుసు. కానీ ఇంతలా సునామీ సృష్టించబోయే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు ఎవరూ ఊహించలేదు. తాజాగా రా స్టేట్మెంట్ పేరుతో ప్యారడైజ్ గ్లింప్స్ విడుదలయ్యింది. 

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నాని ప్యారడైజ్ 

యూట్యూబ్, సోషల్ మీడియా తగలబడిపోయేలా ఈ టీజర్ ఉంది. సినిమా టోన్, నాని క్యారెక్టర్ ని పరిచయం చేస్తూ విడుదల చేసిన ఈ గ్లింప్స్ నెవర్ బిఫోర్ అనిపించే విధంగా ఉంది. అణగదొక్కబడిన ప్రజల ఆవేదనని ఈ స్థాయిలో బోల్డ్ గా, ఒళ్ళు గగుర్పొడిచే విజువల్స్, డైలాగ్స్ తో చూపించబోతున్నారు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. అణచివేత శృతి మించితే జనంలోనుంచి తిరగబడే నాయకుడు ఎంత క్రూరం గా మారుతాడో శ్రీకాంత్ ఓదెల చూపించబోతున్నారు. ఈ చిత్రం సికింద్రాబాద్ నేపథ్యంలో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 

సర్ప్రైజ్ చేసిన శ్రీకాంత్ ఓదెల 

సినిమా నేపథ్యాన్ని వివరించేలా లేడి వాయిస్ ఓవర్ వినిపిస్తుంది. తీవ్రమైన స్వరం, అక్రోధన నుంచి వచ్చే బూతు డైలాగులు, విజువల్స్ మరో ప్రపంచంలోకి తీసుకెళుతున్నాయి. నేచురల్ స్టార్ నానికి ఎలివేషన్ ఇస్తూ ఒక బూతు మాట వాడరు. అదే మాటని నాని తన చేతిపై టాటూ వేయించుకుని ఉన్నారు. ఈ చిత్రం కోసం డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఎంతలా కాంప్రమైజ్ కాకుండా, భయపడకుండా తెరకెక్కిస్తున్నారో నానికి ఇచ్చిన ఎలివేషన్ బట్టి అర్థం చేసుకోవచ్చు. 

టీజర్ మొత్తం లేడీ వాయిస్ ఓవర్ వినిపిస్తూ ఉంటుంది. అనిరుద్ అందించిన సంగీతం, సినిమాటోగ్రాఫర్ జికె విష్ణు విజువల్ ప్రేక్షకులని ట్రాన్స్ లోకి తీసుకెళుతున్నాయి. 'చరిత్రలో అందరూ చిలకలు పావురాల గురించి రాసిండ్రు కానీ అదే జాతిలో పుట్టిన కాకుల గురించి రాయలేదు. ఇది కడుపు మండిన కాకుల కథ.. జమానా జమానా కెళ్ళి నడిచే శవాల కథ అంటూ అణచివేతకు గురైన ప్రజలని కాకులతో పోల్చారు. 

వణుకు పుట్టిస్తున్న నాని లుక్ 

అమ్మరొమ్ములో పాలు లేక రక్తం పోసి పెంచిన ఒక జాతి కథ. టీజర్ సగం గడిచిన తర్వాత నాని ఎంట్రీ ఉంటుంది. నాని లుక్ ని అసలు ఊహించలేం. మాన్స్టర్ అన్నట్లుగా నాని లుక్ ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంది. చేతిపై టాటూ, రెండు జడలు, బాడీ ట్రాన్స్ఫర్ మేషన్ నెక్స్ట్ లెవల్ లో ఉన్నాయి. ఈ చిత్రం కోసం నాని తన డెడికేషన్ లెవల్స్ ని తారా స్థాయికి తీసుకెళ్లారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 26న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. గ్లింప్స్ చూస్తుంటే పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించే చిత్రంలా కనిపిస్తోంది. 10 కెజిఎఫ్ లు కూడా దీనికి సరిపోయేలా లేవు అంటూ ఫ్యాన్స్ ఆల్రెడీ కామెంట్స్ పెడుతున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

NTR and Vijay: ఆగిపోయిన ఎన్టీఆర్‌, విజయ్‌ దేవరకొండ చిత్రాలు.. బెడిసికొడుతున్న రాజమౌళి స్ట్రాటజీ
Ram Charan: కెరీర్ లో 2 సార్లు కాస్ట్లీ మిస్టేక్స్ చేసిన రాంచరణ్.. చిరంజీవి కూడా ఏం చేయలేకపోయారా ?