నేను వెళ్లలేను బిగ్‌బాస్‌ నన్ను పంపించకండంటూ వేడుకున్న గీతూ.. కన్నీటి పర్యంతం మధ్య ఎలిమినేషన్‌

By Aithagoni RajuFirst Published Nov 6, 2022, 10:22 PM IST
Highlights

తానూ ఎలిమినేట్‌ అని తెలియగానే షాక్‌ అయ్యింది గీతూ. అయ్యో అయ్యయ్యో అంటూ తాను ఎవరితోనూ మాట్లాడనంటూ వెళ్లిపోయింది. 

 బిగ్‌ బాస్‌ 6తెలుగులో సోలో ఈ వారం ఎలిమినేషన్‌ ఆద్యంతం కన్నీటి పెట్టించింది. గుండె బరువెక్కించేలా ఉంది. తొమ్మిదో వారంలో గీతూ ఎలిమినేట్‌ అయ్యింది. ఊహించినట్టుగానే అత్యంత బలమైన కంటెస్టెంట్‌ ఎలిమినేట్‌ అయ్యారు. ఆమె ఎలిమినేట్‌ అయిన రిజల్ట్ తో గీతూ కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో ఇంటి సభ్యులు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. రేవంత్‌, ఫైమా, ఆదిరెడ్డి, శ్రీహాన్‌ వంటి వారంతా కన్నీళ్లు పెట్టుకున్నారు. 

తానూ ఎలిమినేట్‌ అని తెలియగానే షాక్‌ అయ్యింది గీతూ. అయ్యో అయ్యయ్యో అంటూ తాను ఎవరితోనూ మాట్లాడనంటూ వెళ్లిపోయింది. ఆమె హౌజ్‌లో తనకి ఇష్టమైన ప్లేస్‌లలో కాసేపు కూర్చొని ఆ మెమరీస్‌ని గుర్తు చేసుకున్నారు. హౌజ్‌ని కాసేపు ఆస్వాధించారు. గార్డెన్‌ ఏరియాలో కింద పడుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. తాను ఎలిమినేట్‌ అవుతానని, బిగ్‌ బాస్‌ షోని వీడతానని అస్సలు ఊహించలేదంటూ ఎమోషనల్ అయ్యారు. 

ఇక హౌజ్‌ని వీడే ముందుకూడా కన్నీళ్లు పెట్టుకుంది గీతూ. భావోద్వేగంతో కూడిన వ్యాఖ్యలు చేశారు. బయట మనుషులు ఇలా ఉంటారని తెలియదు నాకు అని, తనని అందరూ వెన్నుపోటు పొడిచిన వాళ్లే అని, కానీ హౌజ్‌ లోకి వచ్చాక మనుషులంటే ఏంటో తెలిసిందన్నారు. ఫ్రెండ్‌ ఇలా ఉంటారని తెలిసిందని, దీన్ని తాను చాలా మిస్‌ అవుతున్నానని, అసలు ఊహించలేదంటూ ఆమె కన్నీరు మున్నీరయ్యారు. 

బిగ్‌ బాస్‌ తనకు మరో లైఫ్‌ ఇచ్చిందని, బిగ్‌బాస్‌ని ఎప్పటికీ మర్చిపోలేనని, లైఫ్‌ లాంగ్‌ గుర్తుపెట్టుకుంటానని చెప్పింది. ఆమెని పట్టుకుని రేవంత్‌, ఆదిరెడ్డి, ఫైమాలు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇకబయటకు వెళ్లేముందు గేట్‌ వద్ద నాకు పోవాలని లేదు బిగ్‌బాస్‌, దయజేసి తనని పంపించకండి బిగ్‌ బాస్‌, తాను వెళ్లలేనని వాపోయింది, ఇది అందరు ఇంటి సభ్యుల చేత కన్నీళ్లు పెట్టించింది. మరోవైపు స్టేజ్‌పైకి వచ్చిన గీతూ జర్నీని చూస్తూ గీతూ మరోసారి కన్నీరు మున్నీరయ్యింది. తనని చూసి ఎంతో మంది స్ఫూర్తిగా నిలవాలని అనుకున్నానని కానీ అంతలోనే ఇలా జరిగిందని వాపోయింది గీతూ. ఇది నాగార్జునని సైతం భావోద్వేగానికి గురి కావడం విశేషం. 
 

click me!