"గౌతమ్ నంద" సెన్సార్ పూర్తి, జులై చివరి వారంలో విడుదల

First Published Jul 21, 2017, 9:11 PM IST
Highlights
  • గోపీ చంద్, సంపత్ నంది ల గౌతమ్ నంద సెన్సార్ పూర్తి
  • యు/ఎ సర్టిఫికెట్ దక్కించుకున్న ఈ మూవీ
  • జులై 28న విడుదల చేయాలని ఏర్పాట్లు చేస్తున్న నిర్మాత

గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ "గౌతమ్ నంద". రొటీన్ యాక్షన్ సినిమాలకు భిన్నంగా వైవిధ్యమైన కథనంతో తెరకెక్కిన ఈ చిత్రంలో హన్సిక-కేతరీన్ కథానాయికలు. శ్రీబాలాజీ సినీ మీడియా సంస్థలో జె.భగవాన్-జె.పుల్లారావులు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం నేడు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని "యు/ఎ" సర్టిఫికెట్ అందుకొంది. 2.30 గంటల నిడివి గల "గౌతమ్ నంద" ఆద్యంతం ఆకట్టుకుంటుందని చిత్ర బృందం ఆశిస్తున్నారు. 

 

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ... ‘‘గోపీచంద్‌ పాత్రను సంపత్‌ నంది చాలా స్టైలిష్‌గా, పవర్‌ఫుల్‌గా తెరకెక్కించాడు. కథ–కథనాలే ఈ చిత్రానికి బలం. రెండు పాటలు మినహా సినిమా పూర్తయింది. మా బ్యానర్‌ నుండి వస్తున్న బెస్ట్‌ సినిమాగా ‘గౌతమ్‌ నంద’ నిలుస్తుంది. సినిమా విడుదల జులై 28’’ అన్నారు. ఈ చిత్రానికి  స్క్రిప్ట్‌ కో–ఆర్డినేటర్‌: సుధాకర్‌ పవులూరి, సంగీతం: తమన్, కెమెరా: ఎస్‌. సౌందర్‌ రాజన్, కళ: బ్రహ్మ కడలి, ఫైట్స్‌: రామ్‌–లక్ష్మణ్‌.

click me!