త్రిష కారణంగా విజయ్ దేవరకొండకి అవమానం!

Published : Oct 06, 2018, 04:25 PM IST
త్రిష కారణంగా విజయ్ దేవరకొండకి అవమానం!

సారాంశం

విజయ్ దేవరకొండ నటించిన 'నోటా' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకి ఆశించిన రెస్పాన్స్ రాలేదు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల ఓ డబ్బింగ్ సినిమా చూస్తోన్న ఫీలింగ్ కలుగుతుందని ఈ సినిమాపై కామెంట్స్ చేస్తున్నారు.

విజయ్ దేవరకొండ నటించిన 'నోటా' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకి ఆశించిన రెస్పాన్స్ రాలేదు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల ఓ డబ్బింగ్ సినిమా చూస్తోన్న ఫీలింగ్ కలుగుతుందని ఈ సినిమాపై కామెంట్స్ చేస్తున్నారు.

సినిమా చాలా స్లోగా సాగిందని, విజయ్ ఇలాంటి కథ ఎన్నుకొని తప్పు చేశాడంటూ విమర్శిస్తున్నారు. కోలీవుడ్ లో మొదటిసారి నటించిన సినిమా కావడంతో విజయ్ దేవరకొండ ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. సినిమా కోసం తమిళం కూడా నేర్చుకున్నాడు. కానీ ఏది వర్కవుట్ కాలేదు.

'నోటా'తో పాటు విడుదైన '96' సినిమాకి తమిళ ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. త్రిష, విజయ్ సేతుపతి కలిసి నటించిన ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. 'నోటా'కి తక్కువ రేటింగ్స్ ఇచ్చిన విశ్లేషకులు '96'కి మాత్రం మంచి రివ్యూలు ఇస్తున్నారు.

దీంతో పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న '96' ముందు 'నోటా' తేలిపోయింది. టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్ లో కూడా ఈ సినిమా ఫ్లాప్ ముద్రను వేసుకుంది!

ఇవి కూడా చదవండి..

'నోటా' ఫస్ట్ డే కలెక్షన్స్!

టాటా...( ‘నోటా‌’ మూవీ రివ్యూ )

'నోటా' ట్విట్టర్ టాక్.. అభిమానుల పెదవి విరుపులు!

కేటీఆర్ లుక్స్ ని మక్కీ మక్కీ దింపా: నోటా సినిమాపై విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ 'నోటా' టార్గెట్ ఎంతంటే..?

రష్మిక బ్రేకప్ పై విజయ్ దేవరకొండకి ఊహించని ప్రశ్న!

టాలీవుడ్ వారసత్వంపై విజయ్ దేవరకొండ కామెంట్స్!

 

PREV
click me!

Recommended Stories

NTR and Vijay: ఆగిపోయిన ఎన్టీఆర్‌, విజయ్‌ దేవరకొండ చిత్రాలు.. బెడిసికొడుతున్న రాజమౌళి స్ట్రాటజీ
Ram Charan: కెరీర్ లో 2 సార్లు కాస్ట్లీ మిస్టేక్స్ చేసిన రాంచరణ్.. చిరంజీవి కూడా ఏం చేయలేకపోయారా ?