డ్రగ్స్ కేసులో హీరోయిన్ రాగిణి ద్వివేదికి ఊరట... బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్ట్!

By team teluguFirst Published Jan 21, 2021, 12:32 PM IST
Highlights

కర్ణాటక హై కోర్ట్ తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్ట్ లో రాగిణి బెయిల్ కొరకు పిటీషన్ దాఖలు చేసుకోగా, అనుకూలంగా తీర్పు వెలువడింది. సుప్రీం కోర్ట్ రాగిణి ద్వివేదీకి బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనితో ఎట్టకేలకు రాగిణి ద్వివేది బయటికి రావడం జరిగింది . 

కన్నడ పరిశ్రమలో డ్రగ్స్ కేసు దుమారం రేపగా పలువురు ప్రముఖులు అరెస్ట్ కావడం జరిగింది. ముఖ్యంగా డ్రగ్స్ ఆరోపణలపై హీరోయిన్స్ రాగిణి ద్వివేది, సంజనా గల్రాని అరెస్ట్ కావడం సంచలనంగా మారింది. డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో వీరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆరోగ్య కారణాల రీత్యా సంజనా గల్రాని బెయిల్ పై విడుదలై బయటికి రావడం జరిగింది. అయితే రాగిణి ద్వివేదికి బెయిల్ మంజూరు కాకపోవడంతో ఆమె జైలు జీవితం గడుపుతున్నారు. 

కర్ణాటక హై కోర్ట్ తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్ట్ లో రాగిణి బెయిల్ కొరకు పిటీషన్ దాఖలు చేసుకోగా, అనుకూలంగా తీర్పు వెలువడింది. సుప్రీం కోర్ట్ రాగిణి ద్వివేదీకి బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనితో ఎట్టకేలకు రాగిణి ద్వివేది బయటికి రావడం జరిగింది . గత ఏడాది సెప్టెంబర్ నెలలో రాగిణి ద్వివేది డ్రగ్స్ ఆరోపణలపై అరెస్ట్ కావడం జరిగింది. రేవ్ పార్టీలకు డ్రగ్స్ సప్లై చేస్తుందన్న ఆరోపణలపై నార్కోటిక్ సైకోట్రోపిక్ సబ్స్టాన్స్ యాక్ట్ క్రింద ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. 

బెంగుళూరు క్రైమ్ బ్రాంచ్ అధికారులు ఆమె బెయిల్ పిటీషన్ కి వ్యతిరేకంగా కోర్టులో వాదనలు వినిపించారు. డ్రగ్స్ మాఫియాతో ఆమె సంబంధాలు నెరిపినట్లు తమ వద్ద బలమైన ఆధారాలు ఉన్నాయని,  ఆమె బయటికి వస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం కలదని క్రైమ్ బ్రాంచ్ అధికారులు కోర్టులో వెల్లడించారు. అధికారుల వాదనల నేపథ్యంలో పలుమార్లు రాగిణి బెయిల్ పిటీషన్ హై కోర్ట్ కొట్టి వేసింది. ఎట్టకేలకు రాగిణికి సుప్రీం కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది.

click me!