బిగ్‌ బాస్‌ను బ్యాన్‌ చేయాల్సిందే... పట్టు పడుతున్న ప్రముఖ పొలిటికల్ లీడర్....?

By Mahesh JujjuriFirst Published Dec 19, 2023, 12:51 PM IST
Highlights

బిగ్ బాస్ రియాల్టీ షో ను బ్యాన్ చేయాలన్న డిమాండ్ బాగా పెరుగుతూ వస్తోంది. ఎప్పటి నుంచో దీనిపై పోరాటాలు కూడా చేస్తున్నారు. తాజాగా పొలిటికల్ లీడర్స్ కూడా బిగ్ బాస్ పై మండిపడుతున్నారు. 

సక్సెస్ ఫుల్ గా బిగ్ బాస్ తెులగు సీజన్ 7ను కంప్లీట్ చేసుకున్నారు. ఈ సీజన్ విన్నర్ గా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ కప్పు గెలిచాడు. ఈసారి సీజన్ కు ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ గట్టిగా రాగా.. వివాదాలుకూడా అంతే  ఎక్కువగా జరిగాయి. ఈసారి బౌతిక దాడుల వరకూ వెళ్లాయి. గత ఆరు సీజన్లలో రెండు మూడు సీజన్లు ప్రశాంతంగా జరిగాయి. నాలుగో సీజన్ నుంచి వివాదాలు, దర్నాలులాంటివి ఎక్కువయ్యాయి. సీజన్ 5 టైమ్ లో నాగార్జున ఇంటి ముందు దర్నా కూడా చేశాయి కొన్ని సంఘాలు. సమాజాన్ని బ్రస్టు పట్టించేలా.. పిల్లల బుర్రలు కరాబు చేసేలా ఈ రియాల్టీ షో ఉంది అంటూ.. మండి పడ్డారు సోషల్ యాక్టివిస్ట్ లు. అటువంటి షోకు నాగార్జున యాంకరింగ్ చేయవద్దు అంటూ డిమాండ్ కూడా చేశారు. ఇక ఆ వేవ్స్ ఇప్పటి వరకూ కొనసాగుతూనే ఉన్నాయి. 

దావూద్ ఇబ్రహీం పిచ్చిగా ప్రేమించిన బాలీవుడ్ హీరోయిన్, ఇప్పుడేం చేస్తోందో తెలుసా..?

Latest Videos

అయితే ఈ షోను బ్యాన్ చేయాలి అనే డిమాండ్ బలపడే విధంగా బిగ్ బాస్ సీజన్ 7 తెలుగులో లో కొన్ని ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అందులో ముఖ్యంగా బౌతిక దాడు.. ప్రభుత్వ ఆస్తుల ద్వంసం లాంటివి బాగా ప్రభావంచూపించాయి. ఈసారి బిగ్ బాస్ లో గొడవలు బాగా అయ్యాయి. ఫ్యాన్స్ మధ్య కొట్లాటలు కూడా భారీగా జరిగాయి. హౌస్‌లో ప్లేయర్లు కొట్టుకుని కొరుక్కునే స్థాయికి వచ్చారు. అటు బయట కూడా వారి  అభిమానులు హద్దులు దాటారు. 105 రోజుల పాటు సాగిన రియాల్టీ షోలో విజేతగా పల్లవి ప్రశాంత్‌.. రన్నరప్‌గా అమర్‌దీప్‌ నిలిచాడు. ఇక్కడే అసలు  రాద్ధాంతం మొదలైంది. ప్రశాంత్‌-అమర్‌దీప్‌ అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి వాదులాటకు దిగారు.

బిగ్ బాస్ టైటిల్ తమదంటే.. తమదని.. అసలు అమర్ కు టైటిల్ దక్కాల్సిందని అమర్‌దీప్‌ అభిమానులు.. సత్తా ఉన్న వాడికే టైటిల్ దక్కిందని ప్రశాంత్ ఫ్యాన్స్‌ పోటా పోటీ స్లోగన్స్ ఇచ్చారు. దాంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారి.. గొడవకు దారితీసింది. అన్నపూర్ణ స్టూడియో సమీపంలో బిగ్ బాస్ స్టార్స్ గీతూరాయల్, అమర్ దీప్ ల కార్లు తో పాటు TSRTCకి చెందిన బస్సులపై దాడికి దిగారు. విధ్వంసం సృష్టించారు. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పీఎస్‌లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో పల్లవి ప్రశాంత్‌తో పాటు ఆయన ఫ్యాన్స్‌పై కేసులు నమోదు చేశారు. దాంతో  ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ కూడా మండి పడ్డారు ఆ విషయంలో. 

ఇక ఈ విషయంలో ఎప్పటి నుంచో కోపంగా ఉన్న సీపీఐ జాతీయ నేత నారాయణ స్పందించారు. అసలు బిగ్‌బాస్‌ షోని బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారాయన. ఇప్పుడు కాదు గత నాలుగు సీజన్ల నుంచి ఆయన బిగ్ బాస్ పై పోరాటం చేస్తూనే ఉన్నారు. ఓ సారి నాగార్జున ఇంటిని ముట్టడించడంతో పాటు.. దర్నాలు కూడా చేశారు. కాని బిగ్ బాస్ మేకర్స కాని. నాగార్జున కాని ఇవి ఏవీ పట్టించుకోలేదు. కొంత మంది ఈ విషయంలో కోర్ట్ కు కూడా వెళ్ళారు. 

కళ్లు చెదిరే కాస్ట్లీ శారీ లో అలియా భట్, సింపుల్ గా ఉన్నా ఖరీదు అన్ని లక్షలా..?

ఇక తాజా  పరిస్థుతులపై నారాయణ స్పందిస్తూ.. ఇలా అన్నారు.. అభిమానం పేరుతో ఏమైనా చేయొచ్చా..? హద్దులు మీరి బరితెగిస్తే చూస్తూ ఉండిపోవాలా? ప్రభుత్వ ఆస్తుల నష్టం దాకా వెళ్లారంటే వీళ్లని ఏమనాలి? ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా పోలీసులు కఠినంగా వ్యవహరించాలి. బిగ్ బాస్‌.. బిగ్గెస్ట్‌ రియాల్టీ షో… షో నిర్వాహకుల గొప్పలు సరే.. మరి అభిమానం పేరుతో వెర్రితలలు వేస్తోన్న వికృత పోకడల సంగతేంటి? బిగ్ బాస్ -7 విన్నర్ ప్రకటించిన కాసేపటికే.. అభిమానం హద్దులు దాటింది.. ఆర్టీసీ బస్సులపై దాడి చేసే దాకా వెళ్లింది. ఇదే బలుపు అంటూ మండి పడ్డారు. 

click me!