ప్రభాస్‌ సినిమాలో క్రేజీ కాస్టింగ్‌.. షూటింగ్‌ అప్‌డేట్‌..

Published : Dec 18, 2023, 08:43 PM IST
ప్రభాస్‌  సినిమాలో క్రేజీ కాస్టింగ్‌.. షూటింగ్‌ అప్‌డేట్‌..

సారాంశం

ప్రభాస్‌ ప్రస్తుతం మారుతి సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ కి సంబంధించిన షూటింగ్‌ అప్‌ డేట్‌ బయటకు వచ్చింది. అయితే ఇందులో కాస్టింగ్‌ అదిరిపోయేలా ఉంది. 

రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ఓ వైపు సినిమాలను విడుదల చేస్తున్నారు. మరోవైపు తన సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంటున్నాడు. ఆయన నటించిన `సలార్‌` మరో నాలుగు రోజుల్లో రిలీజ్‌ కానుంది. కానీ ఆయన సైలెంట్‌గా వేరే సినిమా షూటింగ్‌లో ఉండటం విశేషం. ప్రభాస్‌.. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న `కల్కి` చిత్రంలో నటిస్తున్నారు. అలాగే మారుతితో సినిమా చేస్తున్నారు. మొన్నటి వరకు నాగ్‌ అశ్విన్‌ మూవీలో పాల్గొన్నారు. 

గ్యాప్‌ తీసుకుని `సలార్‌` టీమ్‌తో రాజమౌళి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తాజాగా `సలార్‌` ట్రైలర్‌ని విడుదల చేశారు. ఈ ట్రైలర్‌ సినిమాపై తేవాల్సిన హైప్‌ తీసుకొచ్చింది. దీంతో ఆయన తన పనిలో తాను బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ప్రభాస్‌ మారుతి సినిమాలో పాల్గొంటున్నారు. ఇది ఆర్‌ ఎఫ్‌సీలో షూటింగ్‌ జరుపుకుంటోందని తెలుస్తుంది. ఇందులో బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ నటిస్తున్నట్టు సమాచారం. అంతేకాదు `ఇస్మార్ట్ శంకర్‌` బ్యూటీ నిధి అగర్వాల్‌ కూడా నటిస్తుంది. 

ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రభాస్‌తోపాటు సంజయ్‌ దత్‌, నిధి అగర్వాల్‌లపై కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట దర్శకుడు మారుతి. ఆర్‌ఎఫ్‌సీలో కీలక షెడ్యూల్‌ జరుగుతుందని సమాచారం. ఇక ఈ మూవీకి `రాజా డీలక్స్` అనే టైటిల్‌ వినిపిస్తుంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇందులో మలయాళ భామ మాళవిక మోహనన్‌ మెయిన్‌ హీరోయిన్‌గా చేస్తుందని సమాచారం. అయితే ఈ మూవీకి సంబంధించిన అన్ని విషయాలను రహస్యంగా ఉంచుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు చెబితే సినిమాపై బజ్‌ తగ్గిపోతుందనే ఉద్దేశ్యంతో అంతా సీక్రెట్‌గా చేస్తున్నట్టు సమాచారం. 

ఇక ఇందులో ప్రభాస్‌ పాత్ర చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుందని, `బాహుబలి`కి ముందు ప్రభాస్‌ని ఇందులో చూడొచ్చని, ఆయన పాత్ర చాలా ఫన్నీగా ఉంటుందని తెలుస్తుంది. ఫ్యామిలీ అంశాలు, వినోదం, యాక్షన్‌  ఇలా కమర్షియల్‌ అంశాల మేళశింపుగా మారుతి ఈ మూవీని రూపొందిస్తున్నారని సమాచారం. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ దీన్ని నిర్మిస్తుంది.
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Actor Sreenivasan: ప్రముఖ నటుడు, దర్శకుడు శ్రీనివాసన్ కన్నుమూత.. 48 ఏళ్ల సినీ ప్రస్థానానికి ముగింపు
Bigg Boss Telugu 9: చివరి రోజు ఓటింగ్‌ తలక్రిందులు, పక్కా ప్లాన్‌ ప్రకారమే.. టాప్‌లో ఉన్నదెవరంటే?