Salaar : దిమ్మతిరిగిపోయే రెస్పాన్స్ భయ్యా.. సలార్ న్యూ ట్రైలర్ తర్వాత.. యూఎస్ఏలో పెరిగిన బుకింగ్స్

Published : Dec 19, 2023, 11:41 AM IST
Salaar : దిమ్మతిరిగిపోయే రెస్పాన్స్ భయ్యా.. సలార్ న్యూ ట్రైలర్ తర్వాత.. యూఎస్ఏలో పెరిగిన బుకింగ్స్

సారాంశం

సలార్ రిలీజ్ ట్రైలర్ (Salaar Release Trailer) తర్వాత యూఎస్ఏలో పరిస్థితి వేరేలా ఉంది. ఊహించని విధంగా అడ్వాన్స్ బుకింగ్స్ పెరిగాయి. 24 గంటల్లోనే మాసీ రెస్పాన్స్ దక్కడం మున్ముందు బాక్సాఫీస్ లెక్కలపై ఆసక్తిని పెంచింది. 

Salaar రెండో ట్రైలర్ విడుదల తర్వాత బుకింగ్స్ బాగా పెరిగాయని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. రిలీజ్ కు ముందే Salaar Cease Fire బుకింగ్స్ పరంగా యూఏఎస్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే వచ్చిన ట్రైలర్, టీజర్ కంటే నిన్న విడుదలైన ‘సలార్ రిలీజ్ ట్రైలర్’కు భారీ రెస్పాన్స్ దక్కుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఆడియెన్స్, సినీ ప్రేమికులు సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా యూఏఎస్ లో బుకింగ్స్ ఆశ్చర్యపరుస్తున్నాయి. 

USA BoxOffice వద్ద  సలార్ అడ్వాన్స్ సేల్స్ లో మైల్ స్టోన్ ను రీచ్ అయ్యింది. మొన్నటి వరకు 870కే డాలర్ల కలెషన్లను సొంతం చేసుకుంది ఈ భారీ యాక్షన్  ఫిల్మ్. ఇక న్యూ ట్రైలర్ వచ్చిన తర్వాత సేల్ పెరిగినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం 1.2 కోట్ల వరకు ప్రీసేల్ చేసిందని తెలుస్తోంది. రిలీజ్ కు ముందే ఇలా ఉంటే... ఇక డైనోసార్ థియేటర్లలో గర్జిస్తే ఇంకెలా ఉంటుందనేది ఊహకే వదిలేస్తున్నారు. ఇండస్ట్రీలో బెంచ్ మార్క్ ను క్రియేట్ చేయడం ఖాయమంటున్నారు. 

కేవలం తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెటే రూ.400 కోట్ల వరకు ఉండటం ఆసక్తికరంగా మారింది. ఇలా లెక్కన అన్ని ఏరియాల నుంచి నెక్ట్స్ లెవల్ రెస్పాన్స్ ఉందని తెలుస్తోంది. ఇక రెండు రోజుల్లో ‘సలార్’ యూఏఎస్ లో ప్రీమియర్ ప్రదర్శనకు సిద్ధంగా ఉంది. ట్రైలర్ లో ప్రభాస్ యాక్షన్ సీన్లకు ఫిదా అవుతున్నారు. ఆడియెన్స్ కూడా బిగ్ స్క్రీన్ పై ఇగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రభాస్ (Prabhas)  - ప్రశాంత్ నీల్ కాంబోలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మించారు. శృతి హాసన్ హీరోయిన్. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి, శ్రియా రెడ్డి కీలకపాత్ర పోషిస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Actor Sreenivasan: ప్రముఖ నటుడు, దర్శకుడు శ్రీనివాసన్ కన్నుమూత.. 48 ఏళ్ల సినీ ప్రస్థానానికి ముగింపు
Bigg Boss Telugu 9: చివరి రోజు ఓటింగ్‌ తలక్రిందులు, పక్కా ప్లాన్‌ ప్రకారమే.. టాప్‌లో ఉన్నదెవరంటే?