Bigg boss telugu 5: ఆ కారణంగా హౌస్ నుండి జస్వంత్ అవుట్... కుప్పకూలిపోయిన సిరి, షన్ను!

Published : Nov 09, 2021, 01:13 PM IST
Bigg boss telugu 5: ఆ కారణంగా హౌస్ నుండి జస్వంత్ అవుట్... కుప్పకూలిపోయిన సిరి, షన్ను!

సారాంశం

బిగ్ బాస్ హౌస్ లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. హౌస్ నుండి జెస్సీని  బిగ్ బాస్ బయటకు పంపివేశారు. దీనితో తన బెస్ట్ ఫ్రెండ్స్ షణ్ముఖ్, సిరి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.   

బిగ్ బాస్ సీజన్ 5 (Bigg boss telugu 5) స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో ఒకరిగా ఉన్నారు జస్వంత్. ఈ మేల్ మోడల్ మొదటివారం నుండి తన మార్క్ గేమ్ కనబరుస్తున్నారు. టాస్క్ లలో శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తాడు. ఈ తొమ్మిది వారాల్లో ఓ సారి కెప్టెన్ కూడా అయ్యాడు. షణ్ముఖ్, సిరిలతో చాలా సన్నిహితంగా ఉండే జెస్సీ, మిగతా ఇంటి సభ్యులతో కూడా మంచి రిలేషన్ కలిగి ఉన్నాడు. సున్నిత మనస్కుడిగా జస్వంత్ కి పేరుంది. 


ఓ వారం రోజులుగా జస్వంత్ (Jaswanth) అనారోగ్యంతో బాధపడుతున్నాడు. శని, ఆదివారాలలో నాగార్జున ఎపిసోడ్స్ లో కూడా అతడు డల్ గా కనిపించాడు. అందుకే  జస్వంత్ ని కేవలం సంచాలకుడిగా నియమించి, గేమ్స్ నుండి మినహాయింపు ఇచ్చాడు నాగార్జున (Nagarjuna). కాగా జస్వంత్ ఆరోగ్యం ఇంకా కుదుట పడలేదు. ఈ నేపథ్యంలో అతన్ని హౌస్ నుండి బయటికి పంపడమే ఉత్తమం అని బిగ్ బాస్ భావించారు. జస్వంత్ ని సీక్రెట్ రూమ్ కి పిలిచిన బిగ్ బాస్.. ఈ విషయం అతనికి వెల్లడించడం జరిగింది. బిగ్ బాస్ నిర్ణయాన్ని అంగీకరించిన జస్వంత్.. రూమ్ నుండి బయటికి వచ్చి, కంటెస్టెంట్స్ తో దగ్గర ఎమోషనల్ అయ్యాడు. హౌస్ నుండి వెళ్ళిపోతున్నట్లు తెలియజేశాడు. 

Also read Bigg Boss Telugu 5: షణ్ముఖ్‌, సిరిలపై మానస్‌ షాకింగ్‌ కామెంట్‌.. ఈ వారం నామినేట్‌ అయ్యింది వీళ్లే

ఈ పరిణామం కంటెస్టెంట్స్ ని షాక్ కి గురిచేసింది. ముఖ్యంగా జస్వంత్ క్లోజ్ ఫ్రెండ్స్ సిరి,  షణ్ముఖ్ (Shanumukh) వేదనకు గురయ్యారు. ముగ్గురు కన్నీటి పర్యంతం అయ్యారు. హౌస్ మేట్స్ అందరికీ బై చెప్పిన జస్వంత్ మెయిన్ గేట్ నుండి, ఇంటి బయటకు వచ్చేశాడు. ఈ వారం ఎలిమినేషన్స్ లో కూడా జస్వంత్ లేడు. అంటే మరో రెండు వారాలు జస్వంత్ కచ్చితంగా హౌస్ లో ఉండే అవకాశం ఉండగా, అనోహ్యంగా అనారోగ్యం బారినపడి, బయటికి రావాల్సి వచ్చింది. 

Also read సింగర్ శ్రీరామచంద్ర ప్రైవేట్ చాట్ లీక్ చేసిన శ్రీరెడ్డి...చాట్ లో అలాంటి ఫోటోలు కావాలన్న బిగ్ బాస్ కంటెస్టెంట్
జస్వంత్ నిష్క్రమణతో హౌస్ లో మొత్తం తొమ్మిది మంది మిగిలారు. ఈ వారం విశ్వ ఎలిమినేటైన విషయం తెలిసిందే. ఇక నిన్న జరిగిన నామినేషన్స్ ప్రక్రియలో రవి, మానస్, సన్నీ, కాజల్, సిరి నామినేట్ అయ్యారు. ఈ ఐదుగురిలో ఒకరు వచ్చే వారం ఎలిమినేట్ కానున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Sobhan Babu: కృష్ణ కోసమే నాకు అన్యాయం చేశారు, వాళ్ళ అంతు చూస్తా అంటూ కట్టలు తెంచుకున్న శోభన్ బాబు కోపం
Karthika Deepam 2 Today Episode: తప్పించుకున్న జ్యో- సుమిత్ర చావుకు ప్లాన్- దీపకు కూడా ఆపద రానుందా?