Naatu Naatu song promo: వీర నాటు ఊర నాటు... అంచనాలు పెంచేసిన ఆర్ ఆర్ ఆర్ సాంగ్ ప్రోమో

Published : Nov 09, 2021, 12:27 PM IST
Naatu Naatu song promo: వీర నాటు ఊర నాటు... అంచనాలు పెంచేసిన ఆర్ ఆర్ ఆర్ సాంగ్ ప్రోమో

సారాంశం

ఆర్ ఆర్ ఆర్ నుండి సెకండ్ సింగిల్ నాటు నాటు రేపు గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నేడు ఈ సాంగ్ ప్రోమో విడుదల చేశారు. ఫాస్ట్ లో బీట్ లో సాగిన నాటు నాటు సాంగ్ ప్రోమో అలరిస్తుంది. 

ఇద్దరు టాలీవుడ్ టాప్ డాన్సర్స్ ఒకే పాటలకు కలిసి డాన్స్ చేస్తే ఎలా ఉంటుంది. ఈ ఆలోచన రాజమౌళి (Rajamouli) నిజం చేసి చూపిస్తున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ ఓ ఊరమాస్ సాంగ్ కి వీర మాస్ స్టెప్స్ వేసి అలరించనున్నారు. ఆర్ ఆర్ ఆర్ మూవీలో ఈ అద్భుతం ఆవిష్కృతం కానుంది. నాటు నాటు... లిరికల్ వీడియో రేపు విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నేడు ఈ సాంగ్ ప్రోమో విడుదల చేసింది చిత్ర బృందం. 'నా పాట సూడు... నా పాట సూడు...నాటు నాటు నాటు....  వీర నాటు నాటు నాటు ... ఊర నాటు నాటు నాటు' అంటూ సాగిన 20 సెకెన్ల ప్రోమో బాగుంది. 


ఫాస్ట్ బీట్ లో పరుగులు పెడుతున్న ప్రోమో.. పూర్తి స్థాయి సాంగ్ పై అంచనాలు పెంచేసింది. ఇక వెండితెరపై ఈ పాటలకు ఎన్టీఆర్ (Ntr) , రామ్ చరణ్ కలిసి డాన్స్ చేస్తుంటే చూడాలన్న ఆత్రం కలుగుతుంది. కీరవాణి స్వరాలు సమకూర్చగా... సీనియర్ లిరిసిస్ట్ చంద్రబోస్ సాహిత్యం అందించారు. రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ కలిసి పాడడం జరిగింది. మొత్తంగా నాటు నాటు.. సాంగ్ అంచనాలకు తగ్గకుండా ఉంది. 

Also read Naatu Naatu song : బ్రిటీష్ కోటలో రామ్-భీమ్ ఆటా పాటా, మారువేశాల్లో బురిడీ? మైండ్ బ్లాకింగ్ డిటైల్స్!
ఇక నాటు నాటు సాంగ్ (Naatu naatu song) నేపథ్యంలో ఆసక్తికరంగా ఉంటుందని సమాచారం. బ్రిటీష్ కాన్సర్ట్ లో భీమ్, రామ్ ప్రదర్శన ఇచ్చే సందర్భంలో ఈ పాట రానుందట. బ్రిటీష్ వారంటే కత్తి దూసే రామ రాజు, భీమ్... వాళ్ళ పార్టీలో డాన్స్ వేయడం ఏమిటీ అనే సందేహం మనకు కలగవచ్చు. దీనికి సమాధానం... బ్రిటీష్ వాళ్ళను దెబ్బ తీసే క్రమంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ అనేక మారువేషాలు ధరిస్తారని, వాళ్ళను మోసం చేయడానికి అనేక ఎత్తులు, వ్యూహాలు రచిస్తారని సమాచారం. దానిలో భాగంగా బ్రిటీష్ ఎంపైర్ పై దాడి చేయడానికి వెళ్లిన ఎన్టీఆర్, రామ్ చరణ్ తమ ప్లాన్ లో భాగంగా ఇలా డాన్స్ చేసి ఉండవచ్చు. 

Also read RRR Big update: `నాటు నాటు` అంటోన్న ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌.. `ఆర్ఆర్ఆర్‌` సెకండ్‌ సింగిల్‌
అనేక ప్రత్యేకతల సమాహారంగా ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని రాజమౌళి (Rajamouli) తీర్చిద్దతున్నారు. ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్ సినిమాను బాగా ప్రేక్షకులలోకి తీసుకెళుతున్నాయి. పివిఆర్ సినిమాస్ తో టై అప్ అయిన ఆర్ ఆర్ ఆర్ టీం.. మూవీ ప్రోమోలు ఆ థియేటర్స్ లో ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే వెండితెరపై ఆర్ ఆర్ ఆర్ గ్లిమ్ప్స్ సందడి చేస్తుంది. 

Also read 
నిర్మాత డివివి దానయ్య భారీ బడ్జెట్ తో ఆర్ ఆర్ ఆర్ నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ హీరోయిన్ గా నటిస్తుండగా, మరో హీరోయిన్ గా బ్రిటీష్ నటి ఒలీవియా మోరిస్ నటిస్తున్నారు. హీరో అజయ్ దేవ్ గణ్ కీలక రోల్ చేస్తున్నారు. 2022 జనవరి 7న సంక్రాంతి కానుకగా, ఆర్ ఆర్ ఆర్ గ్రాండ్ గా విడుదల కానుంది. 

PREV
click me!

Recommended Stories

Sobhan Babu: కృష్ణ కోసమే నాకు అన్యాయం చేశారు, వాళ్ళ అంతు చూస్తా అంటూ కట్టలు తెంచుకున్న శోభన్ బాబు కోపం
Karthika Deepam 2 Today Episode: తప్పించుకున్న జ్యో- సుమిత్ర చావుకు ప్లాన్- దీపకు కూడా ఆపద రానుందా?