Samantha: కష్టాల్లో తోడున్నావు నిజమైన ఫ్రెండ్ నువ్వే... సమంత ఎమోషనల్ పోస్ట్

Published : Nov 09, 2021, 11:38 AM ISTUpdated : Nov 09, 2021, 11:39 AM IST
Samantha: కష్టాల్లో తోడున్నావు నిజమైన ఫ్రెండ్ నువ్వే... సమంత ఎమోషనల్ పోస్ట్

సారాంశం

సమంత (Samantha) డాక్టర్ మంజుల అనగాని బర్త్ డే పార్టీకి హాజరయ్యారు. ఈ పార్టీకి సమంత సన్నిహితురాలు లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి కూడా పాల్గొన్నారు.

సమంత విడాకులతో ఏర్పడిన ఒంటరి తనాన్ని స్నేహాలతో  దూరం చేసుకుంటున్నారు. తన బెస్ట్ ఫ్రెండ్స్ తో ఆమె ఎక్కువ సమయం గడుపుతున్నారు. దీనిలో భాగంగా విందులు వినోదాలు, విహారాలలో పాల్గొంటున్నారు. తాజాగా సమంత (Samantha) డాక్టర్ మంజుల అనగాని బర్త్ డే పార్టీకి హాజరయ్యారు. ఈ పార్టీకి సమంత సన్నిహితురాలు లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ బర్త్ డే పార్టీలో ఫ్రెండ్స్ తో కలిసి ఆహ్లాదంగా గడిపినట్లు తెలుస్తుంది. 


మంజుల అనగాని (Manjula anagani) బర్త్ డే వేడుకలో ఫ్రెండ్స్ తో దిగిన ఫోటో షేర్ చేసిన సమంత కొన్ని ఆసక్తికర కామెంట్స్  చేశారు. మంజులను ఉద్దేశిస్తూ.. నీలాంటి ఫ్రెండ్ కలిగి ఉండడం నా అదృష్టం అన్నారు. కష్టాల్లో ఉన్నప్పుడే నిజమైన ఫ్రెండ్స్ ఎవరో తెలుస్తుంది. నీకంటే నిజమైన ఫ్రెండ్స్ నాకు మరొకరు లేరు. నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో.. నీకు బాగా తెలుసని భావిస్తున్నాను. హ్యాపీ బర్త్ డే... అంటూ కామెంట్ చేశారు. 


సమంత మనసుకు ఇంత దగ్గరైన ఈ మంజుల డాక్టర్ ఎవరనే కుతూహలం అందరిలో పెరిగిపోయింది. ప్రముఖ గైనకాలజిస్ట్ అయిన డాక్టర్ మంజుల అనగాని ప్రద్మశ్రీ అవార్డు గ్రహీత. మల్టీటాలెంటెడ్ అయిన మంజుల వైద్యంతో పాటు పలు రంగాల్లో రాణిస్తున్నారు. చిత్ర పరిశ్రమకు చెందిన అనేక మంది తారలతో ఆమెకు పరిచయాలు ఉన్నాయి. మంజులతో చాలా కాలంగా సమంతకు పరిచయం ఉంది. సమంత కామెంట్ ని బట్టి చూస్తే.. విడాకుల విషయంలో సమంతకు మంజుల మోరల్ సపోర్ట్ ఇచ్చినట్లు అర్థం అవుతుంది. 


నాగ చైతన్య (Naga chaitanya తో విడాకుల తర్వాత సమంత డిమాండ్ మరింతగా పెరగడం విశేషం. లెక్కకు మించిన ఆఫర్స్ ఆమె ఖాతాలో వచ్చి చేరుతున్నాయి. రెమ్యూనరేషన్ కూడా భారీగా పెంచేశారని వార్తలు వస్తున్నాయి. ఇక సమంత దర్శకుడు గుణశేఖర్ తో చేసిన శాకుంతలం మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. మైథలాజికల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన శాకుంతలం మూవీ పాన్ ఇండియా లెవల్ లో విడుదల కానుంది. 

Also read Samantha: సమంతకి అరుదైన గౌరవం.. `ఇఫీ`లో స్పీకర్‌గా.. తొలి దక్షిణాది నటి

కాగా  52వ ఇఫీ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు Samanthaకి ఆహ్వానం పంపింది `ఐఎఫ్‌ఎఫ్‌ఐ`. సమంతని స్పీకర్‌గా పాల్గొనాల్సి ఉందని ఇఫీ ఆహ్వానించింది. ఆ మేరకు సమంతని ఎంపిక చేశారు ఇఫీ నిర్వహకులు. అయితే ఈ ఇఫీ(Iffi) ఈవెంట్‌లో స్పీకర్‌గా ఆహ్వానం అందుకున్న తొలి దక్షిణాది నటిగా సమంతకి ఆహ్వానం రావడం విశేషం. ఇది ఆమెకి దక్కిన అరుదైన గౌరవమని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇందులో వ్యాఖ్యాతగా సమంతతోపాటు మనోజ్‌ భాజ్‌పాయ్‌ కూడా ఎంపికయ్యారు. వీరితోపాటు  ప్రముఖ దర్శకుడు అరుణా రాజే, నటుడు జాన్ ఎడతత్తిల్, దర్శకుడు వివేక్ అగ్నిహోత్రిలకు కూడా ఆహ్వానం అందింది. 

Also read విడాకులపై పూనమ్ కౌర్ సంచలన ట్వీట్, అంతలోనే డిలీట్... సమంత గురించేనా!

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Crazy Kalyanam Release Date: రెండు వారాల ముందే అనుపమా పరమేశ్వరన్‌ `క్రేజీ కల్యాణం`.. రిలీజ్‌ డేట్‌ ఇదే
Kajal Aggarwal Mysore Palace: మైసూర్ ప్యాలెస్‌లో కాజల్ సందడి.. అది చూసి చందమామ సర్‌ప్రైజ్‌