ఆ హీరోతో డేటింగ్ చేస్తోన్న పవన్ హీరోయిన్!

Published : Sep 19, 2019, 09:10 AM ISTUpdated : Sep 19, 2019, 09:25 AM IST
ఆ హీరోతో డేటింగ్ చేస్తోన్న పవన్ హీరోయిన్!

సారాంశం

కృతికర్భందా బాలీవుడ్ నటుడు పులకిత్ సామ్రాట్ తో డేటింగ్ లో ఉన్నారని బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. గతేడాది విడుదలైన 'వీరే కి వెడ్డింగ్' సినిమాలో ఈ ఇద్దరూ కలిసి నటించారు.   

తెలుగులో పవన్ కళ్యాణ్ నటించిన 'తీన్మార్' సినిమా హీరోయిన్ గా నటించిన కృతికర్భందా లుక్స్ పరంగా నటన పరంగా ఆకట్టుకుంది. ఆ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ అమ్మడుకి తెలుగులో అవకాశాలు వచ్చాయి. కానీ ఆమె నటించిన 'ఒంగోలు గిత్త' కూడా ఫ్లాప్ అవ్వడంతో తెలుగులో అవకాశాలు లేకుండా పోయాయి. చివరకి రామ్ చరణ్ కి అక్కడ పాత్రలో నటించాల్సి వచ్చింది.

దీంతో బాలీవుడ్ కి షిఫ్ట్ అయిన ఈ బ్యూటీ అక్కడ అడపాదడపా చిత్రాల్లో నటిస్తూ నెట్టుకోస్తుంది. అయితే ఈమె బాలీవుడ్ నటుడు పులకిత్ సామ్రాట్ తో డేటింగ్ లో ఉన్నారని  బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. గతేడాది విడుదలైన 'వీరే కి వెడ్డింగ్' సినిమాలో ఈ ఇద్దరూ కలిసి నటించారు.

ప్రస్తుతం వీరిద్దరూ కలిసి 'పాగల్ పంటీ' అనే సినిమాలో నటిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. కృతి కర్భందా గత కొన్ని నెలలు పులకిత్ సామ్రాట్ తో డేటింగ్ లో ఉన్నారట. కృతి కోసం పులకిత్ దక్షిణాది వంటకాలను తినడానికి ఇష్టం చూపిస్తున్నారట. ప్రస్తుతం 'పాగల్ పంటీ' షూటింగ్ లో భాగంగా ముంబైలో వీరిద్దరి మీద ఓ పాట చిత్రీకరణ జరుగుతోంది.

షూటింగ్ సమయంలో పులకిత్ తరచూ కృతికి పువ్వులు, చాక్లెట్లు పంపిస్తున్నారని బాలీవుడ్ సమాచారం. దీనికి సంబంధించి వారిద్దరి నుండి ఎటువంటి అధికార ప్రకటన లేదు. పులకిత్ కి నాలుగేళ్ల క్రితం శ్వేతా రోహిరాతో వివాహమైంది. కానీ కొన్ని వ్యక్తిగత కారణాల వలన వీరిద్దరూ 2016లో విడాకులు తీసుకున్నారు. ఆ సమయంలో పులకిత్.. యామీ గౌతమ్ తో డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడేమో కృతితో సన్నిహితంగా మెలుగుతున్నాడు. 

 

PREV
click me!

Recommended Stories

Jr NTR: చిరంజీవి తర్వాత ఎన్టీఆర్ ని టార్గెట్ చేశారా ?..సంచలన నిర్ణయం, తారక్ పేరుతో ఎవరైనా అలా చేస్తే చుక్కలే
Illu Illalu Pillalu Today Episode Dec 9: అమూల్యతో పెళ్లికి విశ్వక్ కన్నింగ్ ప్లాన్, వల్లిని నిలదీసిన రామరాజు