ఓటు హక్కు వినియోగించుకున్న అల్లు అర్జున్, నాగార్జున, అమల!

Published : Dec 07, 2018, 08:29 AM ISTUpdated : Dec 07, 2018, 09:22 AM IST
ఓటు హక్కు వినియోగించుకున్న అల్లు అర్జున్, నాగార్జున, అమల!

సారాంశం

తెలంగాణా ఎన్నికల నేపధ్యంలో సెలబ్రిటీలు 'ఓటు మీ హక్కు' అనే సందేశం ఇవ్వడం కోసం ఈరోజు తెల్లవారుజామునే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. 

తెలంగాణా ఎన్నికల నేపధ్యంలో సెలబ్రిటీలు 'ఓటు మీ హక్కు' అనే సందేశం ఇవ్వడం కోసం ఈరోజు తెల్లవారుజామునే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ముందుగా నాగార్జున తన భార్య అమలతో కలిసి జూబ్లీహిల్స్ పోలింగ్ కేంద్రానికి చేరుకొని ఓటు వేశారు.

వారు వచ్చిన కొద్దిసేపటికే అల్లు అర్జున్ కూడా అక్కడకి చేరుకొని తన ఓటు హక్కుని వినియోగించుకున్నాడు.రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదొక మంచి పరిణామమమే చెప్పాలి.సెలబ్రిటీలు ఓటు హక్కు వినియోగించుకోవడం వలన వారి అభిమానులు కూడా స్ఫూర్తి పొంది ఎన్నికల దినం సెలవు దినం కాదని భావించి ఓటు హక్కుని వినియోగించుకునే అవకాశాలు ఉన్నాయి. 

శుక్రవారం ఉదయం ఏడుగంటలకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ మొదలైన సంగతి తెలిసిందే. 119 నియోజకవర్గాల్లోని 32,185 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సిబ్బంది ఓటింగ్‌ను ప్రారంభించారు. మావోయిస్టు ప్రాబల్యం ఉన్న 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరగనుండగా.. మిగిలిన ప్రాంతాల్లో షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ఎన్నికల సంఘం ప్రకటించింది.

ఓటువేసి ప్రజాస్వామ్యాన్ని బలపరచాలి.. హరీష్ రావు

భూపాలపల్లిలో మొరాయిస్తున్న ఈవీఎంలు.. ప్రారంభంకాని పోలింగ్

ఓటు హక్కు వినియోగించుకున్న హరీష్ రావు

తెలంగాణ ఎన్నికలు: ప్రారంభమైన పోలింగ్

ఓటేసిన మంత్రులు తుమ్మల, జగదీశ్ రెడ్డి

 

PREV
click me!

Recommended Stories

Balakrishna Wife Background: బాలకృష్ణ భార్య వసుంధర దేవి బ్యాక్‌ గ్రౌండ్‌ తెలిస్తే మతిపోతుంది.. పుట్టుకతోనే ఇంత రిచ్చా?
Jayasudha: జయసుధను ఆంటీ అనిపిలిచే ఏకైక టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా? మహేష్ ఏమని పలకరిస్తాడంటే?