అందుకు బోలెడు బడ్జెట్,శ్రమ, టెక్నికల్ ఎలిమెంట్స్ అవసరం. అన్ని చేసినా ప్రేక్షకుడిని కన్విన్స్ చేయలేకపోతే చతికిల పడతాయి.అయితే హీరోలుకు ఇప్పుడు డిఫరెంట్ జానర్స్ టచ్ చేయాలని ఆసక్తి పెరుగుతోంది.
ప్రపంచ సినీ ప్రేక్షకులు నచ్చే మెచ్చే జోనర్‌లలో ఒకటి 'టైమ్ ట్రావెల్' జోనర్. కాలంతో పాటు ప్రయాణం చేసే కథలు చాలా అరుదుగానే వస్తుంటాయి. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సినిమాలు చేయడం మనకు తక్కువ. ఎందుకంటే అందుకు బోలెడు బడ్జెట్,శ్రమ, టెక్నికల్ ఎలిమెంట్స్ అవసరం. అన్ని చేసినా ప్రేక్షకుడిని కన్విన్స్ చేయలేకపోతే చతికిల పడతాయి.అయితే హీరోలుకు ఇప్పుడు డిఫరెంట్ జానర్స్ టచ్ చేయాలని ఆసక్తి పెరుగుతోంది. ఆ క్రమంలోనే ఇప్పుడు అల్లు అర్జున్ సైతం అలాంటి కాన్సెప్టుకు సై చెప్పే అవకాసం ఉందని సమాచారం. రీసెంట్ గా తమిళ్ లో సూపర్ హిట్ అయిన ''మనాడు'' సినిమా రీమేక్ పై అల్లు అర్జున్ ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది.
కోలీవుడ్ స్టార్ హీరో శింబు నటించిన లేటెస్ట్ మూవీ ''మానాడు''. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వి.హౌస్ పతాకంపై సురేష్ కామాక్షి భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. టైమ్ లూప్ వంటి సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ పొలిటికల్ యాక్టన్ థ్రిల్లర్.. విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా మంచి వసూళ్లు రాబట్టింది. అయితే ఇప్పుడు ఈ మూవీ హక్కుల కోసం శ్రేష్ట్ మూవీస్ - సురేష్ ప్రొడక్షన్స్ - సితార ఎంటర్టైన్మెంట్స్ వంటి సంస్థలు పోటీ పడ్డాయి. అయితే ఈ చిత్రం రైట్స్ ని అల్లు అరవింద్ సొంతం చేసుకున్నారని సమాచారం.
వాస్తవానికి ఈ చిత్రాన్ని ''ది లూప్'' పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందించడానికి ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా అల్లు అరవింద్ - బన్నీ వాసు ఈ చిత్రాన్ని గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు సన్నాహాలు జరిగాయి. 'ది లూప్' ప్రచార చిత్రాలు - ట్రైలర్ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. హీరో శింబు కూడా తెలుగు మీద దృష్టి పెట్టి ఇక్కడి మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. లాస్ట్ మినిట్ లో ఈ సినిమా విడుదల వాయిదా పడింది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఇతర భాషల్లో రిలీజ్ చేయకపోతున్నామని నిర్మాతలు తెలిపారు. కానీ ఇప్పుడు అల్లు అరవింద్ 'మనాడు' రీమేక్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
Also read Pushpa:‘పుష్ప’ లీక్, ఈ సీన్లు ఉంటాయని అసలు ఊహించరు
కాగా ''మనాడు'' సినిమాలో శింబు సరసన కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా నటించింది. ఎస్.జె సూర్య - భారతీరాజా - ఎస్.ఏ.చంద్రశేఖర్ - ప్రేమ్ జీ - కరుణాకరన్ - మహేంద్రన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. రిచర్డ్ నాథన్ సినిమాటోగ్రఫీ అందించగా.. ఉమేష్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. ప్రవీణ్ కెఎల్ ఎడిటింగ్ వర్క్ చేశారు. చివరికి ఈ టైం లూప్ పొలిటికల్ యాక్టన్ థ్రిల్లర్ ఏ విధంగా తెలుగు ఆడియన్స్ ముందుకు వస్తుందో చూడాలి.
Also read అల్లు అర్జున్ వలె చిరు, పవన్ చేయగలరా... మెగా ఫ్యామిలీలో వర్మ చిచ్చు