బైక్‌ని ఢీ కొట్టిన `గృహలక్ష్మి` నటి లహరి కారు.. గాయాలు..డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్ట్

Published : Dec 08, 2021, 11:17 AM IST
బైక్‌ని ఢీ కొట్టిన `గృహలక్ష్మి` నటి లహరి కారు.. గాయాలు..డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్ట్

సారాంశం

తెలుగు పాపులర్‌ సీరియల్‌ `గృహలక్ష్మి` ఫేమ్‌ లహరి కారు రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. మంగళవారం రాత్రి శంషాబాద్‌లో సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 

`గృహలక్ష్మి` తెలుగు సీరియల్‌ నటి లహరి(Serial Actress Lahari) రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆమె ప్రయాణిస్తున్న కారు, బైక్‌ని ఢీ కొట్టింది. ఈ ఘటన  రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. లహరి ప్రయాణిస్తున్న కారు, బైక్‌ పై వెళ్తున్న వ్యక్తిని వెనకాల నుంచి ఢీ కొట్టినట్టు తెలుస్తుంది. ఔటర్ రింగ్‌ రోడ్డుపై ప్రైవేట్‌ పెట్రోలింగ్‌ వాహనం నడిపే వ్యక్తి డ్యూటీ ముగించుకుని శంషాబాద్‌ వైపు బైక్‌పై వెళ్తుండగా, వెనకాల నుంచి మారుతి సియాజ్‌(TS 07 FA 9534) నెంబర్‌ గల కారు ఢీ కొట్టింది. దీంతో బైక్‌ పై వెళ్తున్న వ్యక్తి కిందపడిపోయాడు. ఆయనకు గాయాలయ్యాయి. 

ఇది గమనించిన స్థానికులు అక్కడికి చేరుకుని కారుని చుట్టుముట్టారు. కారుని డ్రైవ్‌ చేస్తున్న మహిళని కిందకి దిగాలంటూ వారించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. కారులో ఉన్న మహిళ నటి లహరిగా గుర్తించారు. ఆమెని చూసి అక్కడి వారంతా షాక్‌కి గురయ్యారు. ఆమె మద్యం మత్తులో యాక్సిడెంట్‌ చేసి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో నటి లహరిని పోలీస్‌ స్టేషన్‌కి తరలించారు. అయితే బ్రీత్‌ అనలైజర్‌ని పరీక్షించగా ఆమె మద్యం తీసుకోలేదని తేలింది. గాయపడిన వ్యక్తి కూడా పోలీసు ఫిర్యాదు చేయకపోవడంతో లహరిని విడిచిపెట్టారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Thanuja: కళ్యాణ్ పాడు చేసుకుంటున్నాడు, తనూజలో సడెన్ గా ఈ మార్పు దేనికోసం.. సూటిగా ప్రశ్నించిన అభిమాని
Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్