అపార్ట్మెంట్ లో విగతజీవిగా కనిపించిన నటుడు!

By team teluguFirst Published Sep 7, 2021, 9:38 AM IST
Highlights

బ్రోక్లిన్ అపార్ట్మెంట్ లో మైఖేల్ చలనం లేకుండా పడి ఉన్నట్లు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో మాకు ఎమర్జెన్సీ కాల్ అందిందని పోలీస్ అధికారి ఒకరు తెలియజేశారు. 

హాలీవుడ్ నటుడు మైఖేల్ కె విలియమ్ తన అపార్ట్మెంట్ తో విగతజీవిగా కనిపించారు.మైఖేల్ వయసు 54ఏళ్లు కాగా బ్రోక్లిన్ లోని తన అపార్ట్మెంట్ లో ఆయన మరణించినట్లు న్యూయార్క్ పోలీసులు వెల్లడించారు. హాలీవుడ్ ఫేమస్ టెలివిజన్ సిరీస్ 'ది వైర్' లో ఆయన ఒమర్ లిటిల్ అనే ఓ రోల్ చేయడం జరిగింది. 

బ్రోక్లిన్ అపార్ట్మెంట్ లో మైఖేల్ చలనం లేకుండా పడి ఉన్నట్లు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో మాకు ఎమర్జెన్సీ కాల్ అందిందని పోలీస్ అధికారి ఒకరు తెలియజేశారు. హెచ్ బి ఓ లో ప్రసారమైన లవ్ క్రాఫ్ట్ కంట్రీ సిరీస్ కి గాను ఎమ్మి 2021అవార్డ్స్ కి విల్లియమ్స్ నామినేట్ అయ్యారు. బోర్డు వాక్ ఎంపైర్ అనే సిరీస్ కూడా ఆయనకు ఫేమ్ తెచ్చిపెట్టింది. 


ఇక మైఖేల్ మరణంపై విచారణ కొనసాగుతుందని, న్యూయార్క్ మెడికల్ ఎగ్సామినర్ మరణానికి కారణం ఏమిటో తెలియజేస్తారని అధికారులు వెల్లడించారు. 

click me!