చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ నటుడు ఆత్మహత్య..

Published : Jun 27, 2022, 04:58 PM IST
చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ నటుడు ఆత్మహత్య..

సారాంశం

చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మలయాళ నటుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం సృష్టిస్తుంది.

చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. తాజాగా మరో నటుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇటీవల సినీ, టీవీ నటులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. వరుసగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం ఆందోళనకి గురి చేస్తుంది. ఒడియానటి రష్మి రేఖ ఓజా ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తాజాగా మలయాళ నటుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

నివిన్‌ పౌలీ హీరోగా నటించిన `యాక్షన్‌ హీరో బీజు` చిత్రంతో విలక్షన్‌గా నటించిన ఎన్‌డీ ప్రసాద్‌ (ND Prasad) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొచ్చిలోని కలస్సేరి ప్రాంతంలో తన ఇంట్లో ఉరేసుకుని రెండు రోజుల క్రితం(జూన్‌ 25) బలవన్మరణానికి పాల్పడ్డాడు. మానసిక ఒత్తిడి, కుటుంబ సమస్యలే కారణమని ప్రాథమికంగా పోలీసులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఎన్‌డీ ప్రసాద్‌ గతంలో పలు నేరాల్లో నిందితుడుగానూ ఉన్నాడు. 

గతంలో డ్రగ్స్ తో పట్టుపడటంతోపాటు పలు కేసుల్లో అభియోగాలు ఎదుర్కొన్నాడు. అలాగే గతేడాది ఎర్నాకుళం ఎక్సైజ్‌ సర్కిల్‌ అధికారులు నిర్వహించిన దాడిలో 15 గ్రాముల గంజాయి, 2.5గ్రాముల హాష్‌  ఆయిల్‌, 0.1 గ్రాముల బుప్రెనార్ఫిన్‌, కొడవలితో పట్టబడినట్టు సమాచారం. దీంతోపాటు సినిమాల్లోకి రాకముందు పలు పోలీస్‌ స్టేషన్లలో ఆయనపై కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 

ఎన్‌డీ ప్రసాద్‌.. 2016లో నివిన్‌ పౌలీ హీరోగా నటించిన `యాక్షన్‌ హీరో బిజు` చిత్రంలో విలన్‌గా నటించారు. తనదైన స్టయిల్‌లో విలనిజం చూపించి మెప్పించారు. దీంతోపాటు `ఇబా`, `కిర్మాణి` వంటి సినిమాలు చేశారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

2025 Top 5 Heroes: 1000 కోట్లతో టాప్‌లో ఉన్న నటుడు ఇతనే.. రిషబ్‌, మోహన్‌ లాల్‌, విక్కీ, అక్షయ్‌లకు ఝలక్‌
Bigg Boss Telugu 9 Winner Fix: బిగ్‌ బాస్‌ విన్నర్‌ ముందే ఫిక్స్.. అదే జరిగితే సరికొత్త హిస్టరీకి శ్రీకారం