అడ్వాన్స్ బుకింగ్స్ తో షాకిస్తున్న 2.0!

Published : Nov 27, 2018, 03:01 PM ISTUpdated : Nov 27, 2018, 03:52 PM IST
అడ్వాన్స్ బుకింగ్స్ తో షాకిస్తున్న 2.0!

సారాంశం

సినిమా మీద కాస్త అంచనాలు ఉన్నా అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్ లో ఉంటాయి. ఇక అంచనాలను తలదన్నేలా భారీ బడ్జెట్ సినిమాలు అంతకు మించి అన్నట్లు ఉంటాయి. ఇప్పుడు శంకర్ 2.0 హవా కూడా అలానే నడుస్తోంది. 

సినిమా మీద కాస్త అంచనాలు ఉన్నా అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్ లో ఉంటాయి. ఇక అంచనాలను తలదన్నేలా భారీ బడ్జెట్ సినిమాలు అంతకు మించి అన్నట్లు ఉంటాయి. ఇప్పుడు శంకర్ 2.0 హవా కూడా అలానే నడుస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా అత్యధిక స్క్రీన్స్ లలో రిలీజ్ కానున్న సినిమాగా 2.0 సినిమా ఇప్పటికే ఒక రికార్డ్ అందుకుంది. 

అయితే దాదాపు వరల్డ్ వైడ్ గా సినిమా మొదటి రోజు హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రికార్డు సృష్టించనుంది. తెలుగు హిందీ తమిళ్ మూడు భాషల్లో రిలీజ్ కానున్న ఈ విజువల్ వండర్ 3డి లో తెరకెక్కిన సంగతి తెలిసిందే. అయితే సినిమాకు హైప్ లేదని కొన్ని భిన్నాభిప్రాయాలు కూడా వస్తున్నాయి. ఇక ఇప్పుడు విమర్శలకు షాకిచ్చేలా అడ్వాన్స్ బుకింగ్స్ నమోదవవుతున్నాయి. 

తెలుగులో అయితే తమిళ్ లో కంటే ఎక్కువ స్క్రీన్స్ లలో 2.0 సందడి చేయనుంది. ఓవర్సీస్ లో కూడా భారీగా రిలీజ్ చేస్తున్నారు. తెలుగులో అయితే బిసి సెంటర్ల నుంచి మల్టిప్లెక్స్ ల వరకు అన్ని థియేటర్స్ లలో హౌస్ ఫుల్ బోర్డు లు దర్శనమిస్తున్నాయి. గురువారం సినిమా రిలీజ్ కానుండగా టాక్ ను బట్టి వీకెండ్ లో బయ్యర్స్ ఎమౌంట్ ను రికవర్ చేసుకునే అవకాశం ఉందని టాక్ వస్తోంది. ఏదేమైనా సినిమా అంచనాలను కొంచెం తాకినా గ్రాస్ కలెక్షన్స్ ఈజీగా సెంచారి కొట్టేస్తాయని తెలుస్తోంది. మరి రజినీకాంత్ - శంకర్ కాంబినేషన్ ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాలి. 

సంబంధిత వార్తలు 

యూఎస్ రిలీజ్: బాహుబలి ని కొట్టేసిన 2.0!

'2.0' రిజల్ట్ పై సందేహాలా..?

రోబో 2.0లో అదిరిపోయే స్టంట్స్ చేసిన ఎమీ జాక్సన్ (వీడియో)

2.0 ఆలస్యానికి అసలు కారణం చెప్పిన శంకర్!

2.O లో మళ్ళీ ఆ సీన్స్ ఉండవు..కొత్త విషయాలేన్నో.. : శంకర్

తెలుగు 2.0 ప్రమోషన్స్ కోసం డబ్బు వృధా చేస్తున్నారు: రజినీకాంత్

రోబో సీక్వెల్స్: శంకర్ కొరిక గట్టిగానే ఉంది.. కానీ?

PREV
click me!

Recommended Stories

Balakrishna Favourite : బాలయ్య కు బాగా ఇష్టమైన హీరో, హీరోయిన్లు ఎవరో తెలుసా? ఆ ఇద్దరే ఎందుకు ?
Prabhas: 2025 లో ఒక్క మూవీ లేని హీరో, కానీ చేతిలో 4000 కోట్ల బిజినెస్.. ఆ రెండు సినిమాలపైనే అందరి గురి ?