2018: హీరో ఆఫ్ ది ఇయర్.. మెగాపవర్ స్టార్!

Published : Dec 27, 2018, 02:56 PM IST
2018: హీరో ఆఫ్ ది ఇయర్.. మెగాపవర్ స్టార్!

సారాంశం

ఈ ఏడాదిలో చాలా మంది నటులు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను అందుకున్నారు. కానీ హీరో ఆఫ్ ది ఇయర్ ఫీట్ ని మాత్రం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ దక్కించుకున్నాడనే చెప్పాలి. 

ఈ ఏడాదిలో చాలా మంది నటులు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను అందుకున్నారు. కానీ హీరో ఆఫ్ ది ఇయర్ ఫీట్ ని మాత్రం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ దక్కించుకున్నాడనే చెప్పాలి. సుకుమార్ రూపొందించిన 'రంగస్థలం' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు రామ్ చరణ్.

ఈ సినిమాలో 'చిట్టిబాబు' అనే చెవిటివాడి పాత్రకు ఓకే చెప్పి రామ్ చరణ్ పెద్ద సాహసమే చేశాడు. స్టార్ హీరో, పెద్ద ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్.. చెవిటి క్యారెక్టర్ ఏంటి..? అంటూ మొదట్లో సినిమాపై కాస్త సందేహాలు ఉండేవి. 

కానీ ఎప్పుడైతే ఈ సినిమా టీజర్ ని విడుదల చేశారో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసి బ్లాక్ బస్టర్ హిట్ అందించారు. అధ్బుతమైన నటనతో తన టాలెంట్ ఏంటో అందరికీ నిరూపించాడు. అప్పటివరకు చరణ్ హవభావాలపై విమర్శలు చేసిన వారికి 'రంగస్థలం' సినిమా ఓ సమాధానంగా నిలిచింది.

'నాన్ బాహుబలి' రికార్డ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా దాదాపు రూ.125 కోట్ల షేర్ ని రాబట్టింది. ఈ సినిమాతో నెంబర్ 1 రేసులోకి దూసుకొచ్చాడు రామ్ చరణ్. ప్రస్తుతం చరణ్ బోయపాటి దర్శకత్వంలో 'వినయ విధేయ రామ' సినిమాలో నటిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.  

2018: ఈ ఏడాది ఫ్లాప్ హీరో కిరీటం ఇతడికే..

2018: ఈ ఏడాది చెత్త సినిమాలు ఇవే..

2018: చిన్న చిత్రాలు.. కోట్లలో లాభాలు!

2018 లో కనిపించని హీరోలు వీళ్లే..!

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode:కాశీతో స్వప్నగొడవ-ఇంట్లో నుంచి పొమ్మన్న కావేరి-దీపపై నిందేసిన కాంచన
బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్, మోక్షజ్ఞ సినిమాకు న్యూ ఇయర్ లో మోక్షం, డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు?