రేణుదేశాయ్.. రీలాంచ్!

Published : Dec 27, 2018, 02:21 PM ISTUpdated : Dec 27, 2018, 02:35 PM IST
రేణుదేశాయ్.. రీలాంచ్!

సారాంశం

పవన్ కళ్యాణ్ సరసన 'బద్రి' సినిమాలో నటించి తెలుగువారికి దగ్గరైంది రేణుదేశాయ్. ఆ తరువాత 'జానీ' సినిమాలో దర్శనమిచ్చింది. టాలీవుడ్ లో ఆమె ఫిలిం కెరీర్ చెప్పుకోదగ్గ విధంగా ఏంలేనప్పటికీ పవన్ కళ్యాణ్ ని పెళ్లి చేసుకొని పాపులారిటీ దక్కించుకుంది.

సినిమాలకు దూరమైన ఈ నటి అప్పుడప్పుడు తన కవితలతో అభిమానులను పలకరించేది. పవన్ కి దూరమైన తరువాత మరో పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతోంది రేణుదేశాయ్. ప్రొఫెషనల్ గా కూడా సెటిల్ అవ్వాలని చూస్తోంది.

ఈ క్రమంలో ఓ యాడ్ లో నటించడానికి అంగీకరించింది. కళామందిర్ కళ్యాణ్ 'కాంచీపురం వరమహలక్ష్మి సిల్క్స్' కి రేణుదేశాయ్ ని బ్రాండ్ గా ఎంపిక చేసుకొని ఆమెతో ఇటీవల ఓ యాడ్ ఫిల్మ్ ని చిత్రీకరించారు. 

రేణుదేశాయ్ మొదటి బ్రాండ్ ఎండోర్స్ ఇదేనని చెప్పాలి. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరి భవిష్యత్తుల్లో ఇంకెన్ని యాడ్స్ లో నటిస్తుందో చూడాలి!

PREV
click me!

Recommended Stories

Tanuja: కళ్యాణ్‌ పడాల, పవన్‌ సాయి, ఎంఎం విషయంలో దారుణంగా ట్రోల్స్.. గట్టిగా ఇచ్చిపడేసిన తనూజ
Ramayana Trailer: రామాయణం ట్రైలర్ వాయిదా, కన్ఫర్మ్ చేసిన నిర్మాత .. కారణం ఇదే!