సెర్బియా నటి సెక్సీ చూపులకు హార్థిక్ పాండ్య క్లీన్ బౌల్డ్.. త్వరలో పెళ్లి ?

By tirumala ANFirst Published Nov 10, 2019, 6:22 PM IST
Highlights

క్రికెటర్ హార్థిక్ పాండ్య ప్రస్తుతం టీమిండియాలో ఉన్న బెస్ట్ హిట్టర్స్ లో ఒకడు. మిడిలార్డర్ లో వచ్చి బౌలర్లపై విరుచుకుపడే హార్థిక్ కు యువతలో మంచి ఫాలోయింగ్ ఉంది. 

మైదానంలోకి అడుగుపెడితే సిక్సెర్లతో విరుచుకుపడే హార్థిక్ పాండ్య.. మైదానం బయట మాత్రం ప్లే బాయ్ లాగా మారిపోతున్నాడు. ఇప్పటికే పలువురు బాలీవుడ్ ముద్దు గుమ్మలతో హార్థిక్ ప్రేమాయణం సాగించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. 

బాలీవుడ్ ముద్దుగుమ్మలు కూడా ఈ యంగ్ ప్లేయర్ కి ఫిదా అయిపోతున్నారు. పలువురు నటీమణులతో హార్థిక్ పాండ్య రొమాంటిక్ డేట్స్ సాగించిన దృశ్యాలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. హార్థిక్ పాండ్యపై ప్రేమ వదంతులు రావడంతో.. అది కేవలం ఫ్రెండ్ షిప్ మాత్రమే అని గతంలో క్లారిటీ ఇచ్చాడు. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

1 or 2 ? 🤔

A post shared by 🎀Nataša Stanković🎀 (@natasastankovic__) on Oct 8, 2019 at 11:59pm PDT

తాజాగా హార్థిక్ పాండ్య ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికర ప్రచారం మొదలయింది. సెర్బియాకు చెందిన నటాషా స్టాన్ కోవిచ్ అనే మోడల్ బాలీవుడ్ లో కి ఐటెం గర్ల్ గా అడుగుపెట్టింది. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో కూడా నటించింది. ప్రస్తుతం నటాషా నాచ్ బయెలీ అనే షోలో పాల్గొంటోంది. 

నటాషా సొగసుకు హార్థిక్ ఫిదా అయినట్లు ఉన్నాడు. వీరిద్దరి మధ్య ప్రస్తుతం ఘాటు ఎఫైర్ సాగుతున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం హార్థిక్ పాండ్య నటాషాని తన ఇంటికి తీసుకెళ్లి కుటుంబ సభ్యులకు కూడా పరిచయం చేశాడట. దీనితో వీరిద్దరి మధ్య చాలా సీరియస్ గానే ప్రేమ వ్యవహారం సాగుతోందని.. నటాషా, హార్థిక్ త్వరలో పెళ్ళి పీటలు ఎక్కబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

To my best friend, the strongest and the most beautiful soul. This year has been a roller coaster ride for you. Many great things happen and some were not that great but definitely have made you stronger. You have been such an inspiration for all of us and I couldn’t be more proud of you for everything you have done for yourself and people around you, for everything you have gone through and still decided to stand tall and get out of it like a winner . Keep shining, smiling and getting stronger. You are on the right track. Stay focused. I’ll always have your back. Happy bday HP 🤴🏽❤️ God bless you @hardikpandya93 #happyface

A post shared by 🎀Nataša Stanković🎀 (@natasastankovic__) on Oct 10, 2019 at 10:53pm PDT

నాచ్ బయెలీ షోలో నటాషాని గెలిపించాలని కూడా హార్థిక్ అభిమానులని కోరాడు. సెర్బియాలో పుట్టి పెరిగిన నటాషా బాలీవుడ్ లో అవకాశాలు వస్తుండటంతో ముంబైలో సెటిల్ అయింది. 

హార్థిక్ పాండ్య గతంలో బాలీవుడ్ సుందరి ఎల్లి అవరంతో కూడా డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. 

click me!