పాత బంగారం:సినిమాల ప్రభావం సామాన్యులపై...గొల్లపూడి విశ్లేషణ

By tirumala ANFirst Published Oct 24, 2019, 8:29 PM IST
Highlights

సినిమా లో మంచి కన్నా చెడు జనాలను బాగా ఆకర్షిస్తుందని కొందరంటారు. మరికొందరు అలాంటిదేమీ ఉండదని సినిమా సినిమాలాగే చూస్తారని, అది జీవితంపై ఏ ప్రభావం కలిగించదని చెప్తారు. ఈ వాద  ప్రతివాదాలు చాలా కాలంగా జరుగుతున్నాయి. 

సినిమా లో మంచి కన్నా చెడు జనాలను బాగా ఆకర్షిస్తుందని కొందరంటారు. మరికొందరు అలాంటిదేమీ ఉండదని సినిమా సినిమాలాగే చూస్తారని, అది జీవితంపై ఏ ప్రభావం కలిగించదని చెప్తారు. ఈ వాద  ప్రతివాదాలు చాలా కాలంగా జరుగుతున్నాయి. ఈ విషయమై రచయితగా,నటుడుగా ఎన్నో సంవత్సరాలు వెండి తెరను ఏలిన గొల్లపూడి మారుతీరావుగారు తన అభిప్రాయాన్ని చెప్పారు.  రేపటి కన్నీళ్లు పేరుతో ...విజయ చిత్ర  1984 జనవరి సంచికలో  వివరించారు. ఆయన ఏమన్నారో చూద్దాం.

గొల్లపూడి మాటల్లో..."శుభముహూర్తం అనే సినిమాలో ఆత్మహత్య చేసుకోవాలని ఉబలాటపడుతున్న ఓ ఆడపిల్లకి నా పాత్ర అతి ఉదారంగా విషం మాత్రలు ఇస్తుంది.  తీరా ఆమెకి బతికాలన్న ఆశ కలిగాక అవి నిద్ర మాత్రలు వేసుకుంటాను. అప్పుడో చిన్న డైలాగు ఉంటుంది. ఇవి విటమిన్ మాత్రలమ్మా ఇవి వేసుకునే నా బుగ్గలింతగా పెంచుకున్నాను...." అని.

సినిమా రిలీజయాక ఓ అభిమాని చాలా ప్రాధేయపడుతూ ఉత్తరం రాశాడు. ఈ మధ్య టైఫాయిడ్ వచ్చి నా ముఖం మరీ పీక్కుపోయింది. బుగ్గలు పెరగటానికి మీరు వేసుకున్న మాత్రలేమిటో దయచేసి వ్రాయండి. ఎలా వేసుకోవాలో తెలియచెయ్యండి. ఆతృతగా ఎదురుచూస్తాను అంటూ సాగింది. వెనువెంటనే మరో ఉత్తరం వచ్చింది. నాకు ఆశ్చర్యం, నవ్వు , ఆలోచన తీసుకొచ్చాయి.

సినిమా ఎక్కువమంది నవ్విస్తుంది. కానీ కొద్దిమందినయినా నమ్మిస్తుంది. నేను శంబల్పూరులో ఉన్న రోజుల్లో మా పొరుగున ఫస్టుక్లాసు మేజిస్ట్రేట్ మహాపాత్రో అని ఒకాయన ఉండేవాడు. ఆయనకి దక్షిణాది కూరలన్నా , సాంబారన్నా  చాలా ఇష్టం. తద్వారా దక్షిణాది మనుషులంటే అభిమానం. నాకో మంచి మిత్రుడయ్యాడు. ఓ రోజు కోర్టు నుంచి సరాసరి మా ఇంటికే వచ్చాడు.  రావ్ బాబూ...ఇవాళ విచిత్రమైన కేసు నా కోర్టుకు వచ్చింది. అంటూ ఆ రోజుల్లో దుష్మన్ అనే హిందీ చిత్రం రిలీజైంది. అందులో హీరో తాగి లారీ నడుపుతూ ఒకరిని చంపుతాడు. కోర్టు అతన్ని జైలుకు పంపటానికి బదులు ఆ కుటుంబ భాధ్యత అప్పగిస్తుంది. ఈ సినిమా చూసిన ఓ డ్రైవర్ అలాగే తప్పతాగి లారీ నడిపాడు. ఇక్కడ నలుగురిని చంపాడు. మహాపాత్రో అతినికి శిక్ష వేశాడు.  సినిమాల్లో చూపించే మంచి చాలా మందికి ముచ్చట కలిగించవచ్చు. కానీ చెడు ఎక్కువ మందిని ఆకర్షిస్తుంది.

సినిమా కథ అయినా చివర్లో మంచి జయించినా, చెడుని చూపించినంతగా మంచిని చూపించకపోతే చివరలో మంచికు దక్కిన జయం ప్రేక్షకుల మనస్సులో ఉండదు. చెడులో ఉన్న ఆకర్షణ ప్రేక్షకులకు నచ్చుతుంది. తిరుగుబాటు, థిక్కరించే నిర్లక్ష్యం ఎప్పుడూ అందంగా ఉంటాయి. బార్లలో విస్కీ తాగటం, ప్రక్కింటి అమ్మాయిని లేవ తీసుకుని పోవటం ఎప్పుూడ కొత్తగా ,గొప్పగా అనిపిస్తాయి.

ప్రేక్షకులకు నచ్చే వెయ్యి ఆకర్షణల వెనుక , ప్రేక్షకులు మెచ్చే ఒక చిన్న ఆదర్శం బలహీనంగా, నిస్సహాయింగా కనిపిస్తుంది. అయితే వాళ్లని ఆకర్షించేది ఎక్కువగా చూపించటం వల్ల డబ్బు వస్తుంది. వాళ్లకు అవసరమయ్యే ది చూపించటం వల్ల నష్టమూ రావచ్చు. వీధినా పడచ్చు. ఈ అవసరాన్ని తీర్చి, మనం రిస్క్ తీసుకోవటం ఎందుకు. అందరూ పాలు పోసే కడవలో మన వంతు నీళ్లు పోసినా ఫరవాలేదు అనుకుంటే ఆఖరికి మిగిలేవి నీళ్లే అన్నారాయన.

click me!