ముమైత్ ఖాన్ గురించి సంచలన విషయాలు వెల్లడించిన డ్రైవర్

By telugu teamFirst Published Sep 30, 2020, 6:26 PM IST
Highlights

సినీ నటి ముమైత్ ఖాన్ గురించి కారు డ్రైవర్ రాజు సంచలన విషయాలు వెల్లడించాడు. కారులో మద్యం, సిగరెట్లు తాగిందని, వద్దని చెప్పినందుకు తనను బూతులు తిట్టిందని రాజు చెప్పాడు.

హైదరాబాద్: సినీ నటి ముమైత్ ఖాన్ మీద డ్రైవర్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ముమైత్ ఖాన్ రూ.30 వేలకు గోవా ట్రిప్ మాట్లాడుకుందని, మూడు రోజుల కోసం గోవాకు కారును తీసుకుని వెళ్లిందని అతను చెప్పాడు. అయితే ఐదు రోజుల పాటు గోవాలో తిప్పిందని చెప్పాడు.

డీజిల్ ఖర్చులు అడిగితే ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కారులో మద్యం, సిగరెట్లు తాగుతూ అసభ్యంగా ప్రవర్తించిందని రాజు ఆరోపించాడు. అలా చేయవద్దని చెప్పితే తనను బూతులు తిట్టిందని, ముమైత్ ఖాన్ వద్ద పనిచేసిన డ్రైవర్లు కూడా తనకు ఫోన్ చేసి తమ బాధలు చెప్పుకున్నారని ఆయన అన్నాడు.

రోజు కూలీ చేసుకునే తన పట్ల ఇలా వ్యవహరిస్తుందని అనుకోలేదని చెప్పాడు. గోవా నుంచి వచ్చిన వెంటనే 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపాడు. తమ డ్రైవర్ల సంఘంతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పాడు. తనకు రావాల్సి రూ.15 వేలు ఇస్తుందో, లేదో తెలియదని అన్నాడు.

ముమైత్ ఖాన్ మీద డ్రైవర్ రాజు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమను ముమైత్ ఖాన్ మోసం చేసిందని అతను మంగళవారం మీడియాతో చెప్పుకున్న విషయం తెలిసిందే. టోల్ గేట్ కు, డ్రైవర్ వసతికి డబ్బులు కూడా ఇవ్వలేదని ఆయన చెప్పాడు. 

సోషల్ మీడియాలో టోల్ గేట్ దగ్గర కట్టిన డబ్బులకు సంబంధించిన రిసీట్స్ ను, ముమైత్ ఖాన్ తో కలిసి దిగిన ఫొటోలను, ఆమెతో చేసిన వాట్సప్ చాట్ ను రాజు షేర్ చేశాడు. అయితే, ముమైత్ ఖాన్ మాత్రం ఇప్పటి వరకు దానిపై స్పందించలేదు.

click me!