కర్నూల్ లో ఉద్రిక్తత...హైకోర్టు కోసం విద్యార్థి,యువజన సంఘాల ఆందోళన

By Arun Kumar PFirst Published Oct 22, 2019, 10:49 PM IST
Highlights

కర్నూల్ లో ఆంధ్ర ప్రదేశ్ ను ఏర్పాటుచేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బిజెపి చేపడుతున్న గాంధీ సంకల్ప యాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.  

కర్నూల్ నగరంలోని మౌర్య ఇన్ హొటల్ దగ్గర ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. బిజెపి చేపడుతున్న గాంధీ సంకల్ప యాత్రలో పాల్గొనేందుకు కర్నూలుకు వచ్చిన బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డిని అడ్డుకునేందుకు విద్యార్థి,యువజన సంఘాల నేతలు ప్రయత్నించారు. కర్నూల్ కు హైకోర్టును తరలించాలన్న డిమాండ్ కు బిజెపి మద్దతు కోరుతూ వారు ఈ నిరసన చేపట్టారు.

బిజెపి నాయకులు బసచేసిన మౌర్య ఇన్ హోటల్ లోకి చొచ్చుకు వెళ్లేందుకు విద్యార్థి,యువజన సంఘాలు ప్రయత్నించాయి. అయితే ముందస్తు సమాచారంతో  అక్కడికి చేరుకున్న పోలీసులు వారి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులుకు విద్యార్థి నేతలకు మధ్య వాదోపవాదాలు, తోపులాటలు జరిగాయి. బీజేపీ నేత బయటికి రావాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

కర్నూలులో హైకోర్టు, రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వారు ఈ ఆందోళన చేశారు. ఇందుకు కేంద్రంలో అధికారంలో వున్న బిజెపి చర్యలు తీసుకోవాలని వారు కోరారు. లేదంటే రాష్ట్రంలో బిజెపి చేపట్టే అన్ని కార్యక్రమాలను అడ్డుకుంటామని హెచ్చరించారు.

 రాయలసీమలో హైకోర్టు, రాజధాని ఏర్పాటు చేయాలని పెద్దఎత్తున ఆందోళనలు సాగుతున్నా బిజెపి నాయకులు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు.  అని ప్రశ్నించారు. రాయలసీమపై ఎంతో ప్రేమ ఉన్నట్లుగా రాయలసీమ డిక్లరేషన్ ఎందుకు చేసారనీ నిలదీశారు. రాయలసీమ ప్రజలను మోసం చేయడానికే డిక్లరేషన్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

 అయితే  దీనిపై బిజెపి నేత విష్ణువర్ధన్ రెడ్డి స్పందిస్తూ... తమది జాతీయ పార్టీ అని గుర్తుంచుకోవాలని సూచించారు. అందువల్ల పార్టీ అధిష్టానానికి సమాచారం అందించిన తర్వాత దీనిపై స్పందిస్తామన్నారు. ఇలా మీడియాతో మాట్లాడిన ఆయన ఆందోళన చేస్తున్న విద్యార్థులను కలవకుండానే వెళ్లిపోయారు.

దీంతో మరింత ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థి యువజన నాయకులు హోటల్లోకి చొచ్చుకుని వెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. 

వీడియో

"

click me!