దసరా ఉత్సవాలు.. జోగులాంబ ఆలయాన్ని దర్శించుకున్న కలెక్టర్ దంపతులు

By telugu teamFirst Published Oct 5, 2019, 9:53 AM IST
Highlights

ప్రతి సంవత్సరం సాంప్రదాయ బద్దంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున కర్నూలు జిల్లా కలెక్టర్ సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది... అయితే ఈ సంవత్సరం జిల్లా కలెక్టర్గా ఉన్న జి. వీరపాండియన్, వారి ధర్మపత్ని ఆండాళ్ శ్రీ జోగులాంబ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. 

దసరా శరన్నవరాత్రుల సందర్భాన్ని పురస్కరించుకొని శుక్రవారం కర్నూలు జిల్లా కలెక్టర్ దంపతులు అలంపూర్ జోగులాంబ అమ్మవారి కి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. అలంపూర్ మండలం దేవస్థానం ఆలయం ద్వారం వద్ద  కలెక్టరు దంపతులకు మంగళ వాయిద్యాలతో అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. 

అనంతరం బాలబ్రహ్మహేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం సాంప్రదాయ బద్దంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున కర్నూలు జిల్లా కలెక్టర్ సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది... అయితే ఈ సంవత్సరం జిల్లా కలెక్టర్గా ఉన్న జి. వీరపాండియన్, వారి ధర్మపత్ని ఆండాళ్ శ్రీ జోగులాంబ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. 

అమ్మవారికి కుంకుమార్చన, అష్టోత్తర పూజాది కార్యక్రమాలు నిర్వహించి పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. కర్నూలు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమీషనర్, కర్నూలు తాసీల్ధార్ తదితరులు పాల్గొన్నారు.
 

click me!