శంకరమ్మ చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చుతూ హుజార్ నగర్ శాసనసభ టీఆర్ఎస్ అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి పేరునే తెలంగాణ సిఎం కేసీఆర్ ఖరారు చేశారు. మంత్రి జగదీష్ రెడ్డి, ఇతర నేతలతో చర్చించి ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారు.
హైదరాబాద్: హుజూర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి పేరును తెలంగాణ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఖరారు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సైదిరెడ్డి టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి, స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు.
హుజూర్ నగర్ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలయిన నేపథ్యంలో జిల్లాకు చెందిన మంత్రి జగదీష్ రెడ్డి, ఇతర ముఖ్య నాయకులతో కేసీఆర్ శనివారం మాట్లాడారు. తిరిగి సైదిరెడ్డినే అభ్యర్థిగా నిలబెట్టాలని సిఎం నిర్ణయించారు.
undefined
తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మ తనకు టికెట్ ఇవ్వాలని చేసిన విజ్ఞప్తిని కేసీఆర్ తోసిపుచ్చారు. సాధారణ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయిన నేపథ్యంలో తిరిగి సైదిరెడ్డిని నిలబెడితే గెలుపు అవకాశాలుంటాయని కేసీఆర్ భావిస్తున్నారు.
కాంగ్రెసు తరపున తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి పేరు దాదాపుగా ఖరారైంది. కాంగ్రెసు ముగ్గురి పేర్లను ప్రతిపాదించినప్పటికీ అధిష్టానం పద్మావతి అభ్యర్థిత్వానికే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
కాగా, కాంగ్రెసు టికెట్ కోసం చామల కిరణ్ రెడ్డి ఇప్పటికీ ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెసు వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆయన పేరును ప్రతిపాదించారు.
సంబంధిత వార్తలు
హుజుర్ నగర్ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల : అక్టోబర్ 21న పోలింగ్
హుజూర్ నగర్ ఉప ఎన్నిక: మళ్లీ తెర మీదికి కాసోజు శంకరమ్మ
జగదీష్ రెడ్డి వ్యాఖ్య: రేవంత్ రెడ్డితో మాట్లాడించింది ఉత్తమ్ కుమార్ రెడ్డే
హుజూర్ నగర్ అభ్యర్థి: అన్న మాటను కాదన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
ఈ మధ్యే వచ్చినోళ్ల సలహాలు అక్కర్లేదు: రేవంత్‌పై కోమటిరెడ్డి వ్యాఖ్యలు
హుజూర్ నగర్ ఉప ఎన్నిక: కాంగ్రెసు అభ్యర్థి పద్మావతి, ఉత్తమ్ ప్రకటన
హుజూర్ నగర్ ఉప ఎన్నిక: ఉత్తమ్ పద్మావతికి రేవంత్ రెడ్డి నిరసన సెగ
నాలుగు రాష్ట్రాల్లో ఉపఎన్నికలకు నోటిఫికేషన్: లిస్ట్‌లో లేని హుజూర్‌నగర్