హుజూర్ నగర్ అసెంబ్లీ సీటు టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ఆంధ్ర వ్యక్తి అని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు. హుజూర్ నగర్ లో ఆంధ్ర పోలీసులతో కాంగ్రెసును ఓడించాలని చూస్తున్నారని ఆయన అన్నారు.
సూర్యాపేట: హుజూర్ నగర్ శానససభ స్థానం తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ఆంధ్రకు చెందినవారా? తెలంగాణ పిసిసి అధ్యక్షుడు, హుజూర్ నగర్ నుంచి కాంగ్రెసు తరఫున పోటీ చేయనున్న పద్మావతి భర్త ఉత్తమ్ కుమార్ రెడ్డి అవునంటున్నారు.
టీఆర్ఎస్ హుజూర్ నగర్ టికెట్ ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తికి ఇచ్చారని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఉప ఎన్నికల్లో తమ పార్టీ 30 వేల మెజారిటీతో గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో జరిగిన ప్రతీ అభివృద్ధి కాంగ్రెసు హయాంలో జరిగిందేనని ఆయన అన్నారు.
undefined
హుజూర్ నగర్ అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమిటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన పోలీసు అధికారులతో టీఆర్ఎస్ రాజకీయాలు చేస్తోందని ఆయన విమర్శించారు.
రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తానని కేసీఆర్ ఆరేళ్ల పాలనలో భ్రష్టు పట్టించారని ఆయన విమర్శించారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీని గెలిపించి కేసీఆర్ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడాలని ఆయన ప్రజలను కోరారు. ఉప ఎన్నిక రాష్ట్రానికి మార్గదర్శకం కావాలని ఆయన అన్నారు. కాంగ్రెసుకు ఓటేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు.
సంబందిత వార్తలు
హుజూర్ నగర్ ఉప ఎన్నిక: జానా రెడ్డి కొడుక్కి బీజేపీ గాలం
హుజూర్ నగర్ ఉప ఎన్నిక: టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డే
హుజుర్ నగర్ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల : అక్టోబర్ 21న పోలింగ్
హుజూర్ నగర్ ఉప ఎన్నిక: మళ్లీ తెర మీదికి కాసోజు శంకరమ్మ
జగదీష్ రెడ్డి వ్యాఖ్య: రేవంత్ రెడ్డితో మాట్లాడించింది ఉత్తమ్ కుమార్ రెడ్డే
హుజూర్ నగర్ అభ్యర్థి: అన్న మాటను కాదన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
ఈ మధ్యే వచ్చినోళ్ల సలహాలు అక్కర్లేదు: రేవంత్‌పై కోమటిరెడ్డి వ్యాఖ్యలు
హుజూర్ నగర్ ఉప ఎన్నిక: కాంగ్రెసు అభ్యర్థి పద్మావతి, ఉత్తమ్ ప్రకటన
హుజూర్ నగర్ ఉప ఎన్నిక: ఉత్తమ్ పద్మావతికి రేవంత్ రెడ్డి నిరసన సెగ