Zaheer Khan: విశాఖలో టీమిండియా ప్రదర్శనపై మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ అసంతృప్తిని వ్యక్తం చేశాడు. బ్యాటింగ్ కు అనుకూలించే పిచ్ పై భారత్ బ్యాటింగ్ ప్రదర్శన గొప్పగా లేదని పేర్కొన్నాడు. అయితే, టీమిండియా గెలుపునకు సమిష్టి కృషి అవసరాన్ని నొక్కి చెప్పారు.
India vs England - Zaheer Khan : హైదరాబాద్ లో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ చేతిలో ఓడిన భారత్.. విశాఖలో జరిగిన రెండో టెస్టులో పుంజుకుని విజయం సాధించింది. 106 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ను చిత్తు చేసింది. ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ను 1-1తో సమం చేసింది. అయితే, వైజాగ్ స్టేడియంలో భారత బ్యాటింగ్ ప్రదర్శనపై మాజీ క్రికెటర్లు, విశ్లేషకుల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. భారత బ్యాటింగ్ ప్రదర్శనపై టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ ఆందోళన వ్యక్తం చేశాడు. చెప్పుకొదగ్గ గొప్పగా మన బ్యాటర్స్ అందరూ రాణించకపోవడమేంటని ప్రశ్నించారు.
విశాఖపట్నంలో ఇంగ్లాండ్ తో జరిగిన రెండో టెస్టులో శుభ్ మన్ గిల్, యశస్వి జైస్వాల్ మినహా భారత బ్యాటర్స్ ఎవరూ కూడా పెద్దగా రాణించలేకపోయారు. తొలి రెండు రోజులు బ్యాటింగ్ మరింత అనుకూలంగా ఉన్న పిచ్ పరిస్థితులను ఒక్క జైస్వాల్ మాత్రమే ఉపయోగించుకున్నాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తన కెరీర్ లో తొలి డబులు సెంచరీ (209) సాధించాడు. ఇక రెండో టెస్టు సెకండ్ ఇన్నింగ్స్ లో శుభ్ మన్ గిల్ సెంచరీ కొట్టాడు. చాలా కాలం తర్వాత తన బ్యాట్ తో విమర్శకుల నోళ్లు మూయించాడు. మొత్తంగా టీమిండియా విజయం సాధించింది కానీ, బ్యాటింగ్ అనుకూలించే పిచ్ పై మనవాళ్లు రాణించకపోయారని ఎత్తిచూపారు.
Sachin Arjun Tendulkar: తండ్రి సూపర్ హిట్.. కొడుకు అట్టర్ ఫ్లాప్ !
రెండో టెస్టు ముగిసిన తర్వాత జహీర్ ఖాన్ భారత్ బ్యాటింగ్ ప్రదర్శనను గురించి మాట్లాడుతూ.. అసంతృప్తిని వ్యక్తం చేశారు. సిరీస్ ను భారత్ గెలవాలంటే దూకుడు, పోరాటం, ఆత్మవిశ్వాసం అవసరమని నొక్కి చెప్పాడు. ''ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శనలను రోహిత్ బయటకు తీసుకురాగలిగాడని నేను అనుకుంటున్నాను. అయితే, జట్టును చూసినప్పుడు కొన్ని ఆందోళనలు వస్తున్నాయి. ముఖ్యంగా బ్యాటింగ్.. పిచ్ అనుకూలించే స్టేడియంలో రాణించలేకపోయారు.. ఇంతకుముందు ఇక్కడ భారత్ బ్యాటింగ్ లో మంచి ప్రదర్శనలు ఇచ్చింది. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ ను పరిశీలిస్తే ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే చేసి 300 పరుగులకు చేరువైంది. సమిష్టి కృషి అదే చేయగలదు. యశస్వి జైస్వాల్, శుభ్ బన్ గిల్ ఇద్దరు మాత్రమే భారత్ తరఫున అద్భుతమైన ఇన్నింగ్స్ లను ఆడారు. అయితే, బ్యాటింగ్ లో మిగతా ప్లేయర్లు కూడా చేయాల్సింది చాలా ఉందని'' జహీర్ ఖాన్ పేర్కొన్నాడు.
బౌలింగ్ విభాగంలో రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా వంటి ఆటగాళ్లు బంతితో అద్భుత స్పెల్స్ చేశారని జహీర్ ఖాన్ పేర్కొన్నాడు. బంతితో భారత్ విజయంలో కెప్టెన్ గా రోహిత్ పాత్ర ఎంతో ఉందని చెప్పాడు. అలాగే, బౌలింగ్ లోనూ జస్ప్రీత్ బుమ్రా ప్రతిభ ఉందని జహీర్ కొనియాడాడు. ఈ రకమైన ఉపరితలంపై, మీ స్పిన్నర్లు కొన్నిసార్లు ఒత్తిడిలో ఉన్నారని మీరు భావిస్తుంటారు.. కాబట్టి బౌలర్లకు ఇతర ప్లేయర్ల నుంచి సహాయం అవసరం. కాబట్టి, ఈ అంశాలన్నింటినీ నియంత్రించడానికి ఇక్కడ కెప్టెన్ చొరవను కొడియాడారు జహీర్ ఖాన్. రోహిత్ శర్మ బ్యాట్ తో రాణిస్తే ఫలితాలు మరింత అనుకూలంగా మారుతాయని పేర్కొన్నాడు.
భారత హాకీ స్టార్ ప్లేయర్, అర్జున అవార్డు గ్రహీత వరుణ్ కుమార్‌పై లైంగిక దాడి కేసు..