Sachin Arjun Tendulkar: సచిన్ టెండూల్కర్ పరిచయం అక్కర్లేని పేరు.. గాడ్ ఆఫ్ క్రికెట్.. ! క్రికెట్ ప్రపంచంలో ఊహించని రికార్డుల మోత మోగిస్తూ సూపర్ హిట్ షోతో అదరగొట్టాడు. కానీ, సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ మాత్రం అట్టర్ ప్లాప్ షో చూపిస్తున్నాడు.
Sachin Tendulkar - Arjun Tendulkar: సచిన్ టెండూల్కర్.. క్రీడా ప్రపంచంలో ఈ పేరు తెలియని వారు ఉండరు ! క్రికెట్ చరిత్రను తిరగరాస్తూ పరుగుల వరద పారించాడు. సెంచరీల మోత మోగించాడు. ఎంతటి బలమైన జట్టు అయినా, ఎలాంటి బౌలర్ అయినా ఉతికిపారేస్తూ అద్భుతమైన ఆటతో ముందుకు సాగుతూ గాడ్ ఆఫ్ క్రికెట్ గా పేరుసంపాదించాడు. 16 వయస్సులోనే క్రికెట్ లోకి అడుగుపెట్టి ఎన్నో రికార్డులు సృష్టించాడు. అత్యధిక మ్యాచ్ లు ఆడిన ప్లేయర్ గానే కాకుండా అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్ గా, అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా, ఒక క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక సెంచరీలు సాధించిన ప్లేయర్ ఇలా చెప్పుకుంటూ పోతే సచిన్ టెండూల్కర్ సాధించిన రికార్డులు చిట్టా చాలా పెద్దది అవుతుంది.
ఈ నేపథ్యంలోనే సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ పై కూడా క్రికెట్ ప్రపంచంలో భారీ అంచనాలు ఉన్నాయి. తండ్రికి తగ్గ తనయుడుగా క్రికెట్ లో రాణిస్తాడని భావిస్తున్నారు. కానీ, క్రికెట్ లో తండ్రి సూపర్ హిట్ అయితే కొడుకు అట్టర్ ఫ్లాప్ అవుతున్నాడు. సచిన్ టెండూల్కర్ రికార్డుల మోత మోగిస్తే అర్జున్ టెండూల్కర్ మాత్రం అట్టర్ ఫ్లాప్ షో కనబరుస్తున్నాడు. ఇదివరకు ఐపీఎల్ లో ఆడిన అర్జు్న్ పెద్దగా రాణించలేకపోయాడు. ప్రస్తుతం రంజీ ట్రోఫీలో అడుతున్న అర్జున్ ఇక్కడ కూడా పెద్దగా రాణించలేకపోతున్నాడు.
undefined
WI vs AUS: ఇదేం వన్డే గురూ.. 6.5 ఓవర్లలోనే మ్యాచ్ ముగించారు.. !
ఎలైట్ గ్రూప్ సీలో తమిళనాడుతో ముగిసిన మ్యాచ్‌లో అర్జున్ మరోసారి నిరాశపరిచాడు. బ్యాటింగ్, బౌలింగ్ లోనూ దారుణంగా విఫలమయ్యాడు. బ్యాటింగ్ లో తొలి ఇన్నింగ్స్ లో 1 పరుగు, సెకండ్ ఇన్నింగ్స్ లో 8 పరుగులు మాత్రమే చేశాడు. అలాగే, 12 ఓవర్లు బౌలింగ్ చేసి ఒక్క వికెట్ కూడా తీసుకోలేక పోయాడు. రంజీ 2024 సీజన్ లో ఇప్పటివకు 5 మ్యాచ్ లను ఆడిన అర్జున్న టెండూల్కర్ బౌలింగ్ లో కేవలం 4 వికెట్లు మాత్రమే తీశాడు. బ్యాటింగ్‌లో 2 హాఫ్ సెంచరీలు మాత్రమే చేశాడు. టీమ్ లో చోటు దక్కడం కష్టంగా మారడంతో ముంబై నుంచి గతేడాది గోవా జట్టుకు మారాడు అర్జున్. ఐపీఎల్ లో కూడా చోటు దక్కడం కష్టమే అయినా సచిన్ టెండూల్కర్ కొడుకు అని ముంబై జట్టు అతన్ని జట్టులో ఉంచుకుంది. ఇక ప్రస్తుత ప్రదర్శనపై క్రికెట్ వర్గాల్లో కూడా హాట్ టాపిక్ గానే ఉన్నాడు అర్జున్ టెండూల్కర్. తండ్రి సూపర్ హిట్.. కొడుకు అట్టర్ ఫ్లాప్ అంటూ చర్చించుకుంటున్నారు.
భారత్ చేతిలో ఓటమి.. దుబాయ్ బయలుదేరిన ఇంగ్లాండ్ టీమ్ !