భార‌త హాకీ స్టార్ ప్లేయ‌ర్, అర్జున అవార్డు గ్రహీత వ‌రుణ్ కుమార్‌పై లైంగిక దాడి కేసు..

By Mahesh Rajamoni  |  First Published Feb 6, 2024, 8:37 PM IST

Hockey Player Varun Kumar Rape Case: భారత హాకీ జట్టు స్టార్ ప్లేయర్ వ‌రుణ్ కుమార్ పై పోక్సో చట్టం కింద‌ లైంగిక‌దాడి కేసు నమోదైంది. 2018 సంవత్సరంలో అర్జున అవార్డును అందుకున్న ఈ స్టార్ ప్లేయ‌ర్ లైంగిక దాడికి పాల్ప‌డ్డాడ‌ని ఒక‌ యువ‌తి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు న‌మోదైంది.
 


Hockey Player Varun Kumar Rape Case: భారత హాకీ స్టార్ ప్లేయ‌ర్, అర్జున అవార్డు గ్ర‌హీత‌ వరుణ్ కుమార్ పై లైంగిక‌దాడి కేసు న‌మోదైంది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఒక యువ‌తి ఫిర్యాదు చేసింది. ఈ క్ర‌మంలోనే బెంగ‌ళూరు పోలీసులు వరుణ్ కుమార్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు పోలీసులు మంగళవారం సంబంధిత వివ‌రాలు వెల్లడించారు. ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించిన జట్టులో వరుణ్ సభ్యుడిగా ఉన్నాడు.

వ‌రుణ్ కుమార్ పై ఫిర్యాదు చేసిన యువ‌తి ప్రస్తుతం ఎయిర్ లైన్స్ ఉద్యోగిగా పనిచేస్తోంది. 2018లో అర్జున అవార్డు గ్రహీత వరుణ్ కుమార్ తో పరిచయం ఏర్పడినప్పుడు తన వయసు 17 ఏళ్లని బాధితురాలు ఎఫ్ఐఆర్ లో పేర్కొంది. ఈ సమయంలో వరుణ్ బెంగళూరులోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)లో శిక్షణ పొందుతున్నాడు. ఇన్ స్టాగ్రామ్ ద్వారా వ‌రుణ్ కుమార్ తనను సంప్రదించాడనీ, తనను కలవాలని పట్టుబట్టాడని బాధితురాలు ఎఫ్ఐఆర్ లో పేర్కొంది. ప‌దేప‌దే త‌న‌కు మెసెజ్ ల‌ను పంపుతూనే ఉన్నాడ‌నీ, తాను స్పందించ‌క‌పోవ‌డంతో చివ‌ర‌కు త‌న స్నేహితులతో త‌న‌న‌కు క‌లిసి త‌న ఇష్టాన్ని వ్యక్తప‌ర్చ‌డని పేర్కొంది.

Latest Videos

SACHIN ARJUN TENDULKAR: తండ్రి సూప‌ర్ హిట్.. కొడుకు అట్టర్ ఫ్లాప్ !

ఆ సమయంలో యువతి మైనర్ అని తెలిసినా, భవిష్యత్తు గురించి మాట్లాడతాననే నెపంతో 2019 జూలైలో వరుణ్ ఆమెను బెంగళూరులోని జయనగర్ లోని ఓ హోటల్ కు పిలిచాడు. అయితే, బాధితురాలు ప్రతిఘటించడంతో వారి సంబంధాన్ని మరో అడుగు ముందుకేసి పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు. ఇలా పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఐదేళ్ల పాటు తనతో పలుమార్లు త‌న‌పై లైంగిక‌దాడికి వ‌రుణ్ కుమార్ పాల్ప‌డ్డాడ‌ని బాధితురాలు త‌న ఫిర్యాదులో పేర్కొంది. తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తే ఆమె వ్య‌క్తిగ‌త ఫొటోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తానని వరుణ్ కుమార్ బెదిరించిన‌ట్టు బాధితురాలు పేర్కొంది. వరుణ్ కుమార్ త‌న‌ను మోసం చేశాడని ఆరోపించింది. యువ‌తి నుంచి అందిన ఫిర్యాదు మేరకు హాకీ క్రీడాకారుడు వ‌రుణ్ కుమార్ పై లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం(పోక్సో) సంబంధిత సెక్షన్ల కింద సోమవారం కేసు నమోదు చేశారు.

కేన్ మామ సెంచ‌రీల మోత‌.. ఇలాగైతే, స‌చిన్ టెండూల్క‌ర్ రికార్డులు బ‌ద్ద‌లే !

click me!