భారత్-వెస్టిండిస్ టెస్ట్ సీరిస్: యువ బౌలర్ సైనీకి అరుదైన అవకాశం

Published : Aug 19, 2019, 05:25 PM ISTUpdated : Aug 19, 2019, 05:36 PM IST
భారత్-వెస్టిండిస్ టెస్ట్ సీరిస్: యువ బౌలర్ సైనీకి అరుదైన అవకాశం

సారాంశం

వెస్టిండిస్ తో జరగనున్న టెస్ట్ సీరిస్ కు ఎంపికవకున్నా భారత జట్టుతో పాటే కలిసి వుండే అవకాశాన్ని యువ బౌలర్ నవదీప్ సైనీ పొందాడు, అతడి  సేవలను టెస్టుల్లో కూడా ఉపయోగించుకోవాలని టీమిండియా మేనేజ్ మెంట్ భావిస్తోంది.  

వెస్టిండిస్ పర్యటనలో భారత జట్టు అదరగొడుతోంది. ఇప్పటికే టీ20, వన్డే సీరిసులను క్లీన్ స్వీప్ చేసిన కోహ్లీ సేన టెస్ట్ సీరిస్ కోసం సిద్దమవుతోంది. అయితే టీ20 సీరిస్ లో అసాధారణ బౌలింగ్ తో అదరగొట్టిన యువ బౌలర్ నవదీప్ సైనీ సేవలను టెస్ట్ సీరిస్ లో  కూడా వినియోగించుకోవాలని టీమిండియా మేనేజ్ మెంట్ భావిస్తోంది. దీంతో టెస్ట్ సీరిస్ కోసం సెలెక్టర్లు అతన్ని ఎంపిక చేయకున్నా ఈ రెండు టెస్టులు ముగిసేవరకు అతడు భారత జట్టుతోనే ప్రయాణించనున్నాడు. 

ఆరంగేట్రం టీ20లోనే యువ బౌలర్ నవదీప్ సైనీ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మొదటి అంతర్జాతీయ మ్యాచ్ మొదటి ఓవర్లోనే సైనీ నిప్పులు చెరుగుతూ రెండు వికెట్లు పడగొట్టి హ్యాట్రిక్ అవకాశాన్ని కొద్దిలో మిస్సయ్యాడు. అలాగే చివరి ఓవర్ ను మెయిడెన్ గా పూర్తిచేయడమే కాకుండా విండీస్ హయ్యెస్ట్ స్కోరర్  పొలార్డ్(49 పరుగులు) వికెట్ పడగొట్టి హాఫ్ సెంచరీని అడ్డుకున్నాడు. దీంతో ఆరంగేట్ర మ్యాచ్ లోనే అతడి ఖాతాలోకి మూడు వికెట్లు చేరడమే కాదు అత్యుత్తమ గణాంకాలు చేరాయి. ఈ ప్రదర్శనతో సైనీ టీమిండియా మేనేజ్ మెంట్ దృష్టిలో పడ్డాడు. 

దీంతో అతడి బౌలింగ్ సేవలు టెస్ట్ సీరిస్ లో కూడా ఉపయోగించుకోవాలని భావించింది. ఆటగాళ్లు నెట్ ప్రాక్టీస్ చేసే సమయంలో సైనీతో బౌలింగ్ చేయించాలని మేనేజ్ మెంట్ నిర్ణయించింది. దీంతో టీ20, వన్డే  సీరిస్ తర్వాత స్వదేశానికి తిరిగిరావాల్సిన సైనీ భారత జట్టుతో పాటే  ప్రయాణించనున్నాడు. ఈ మేరకు భారత జట్టు మేనేజ్ మెంట్  ఓ ప్రకటన వెలువరించింది.  

ఇలా టీ20 సీరిస్ లో ప్రత్యక్షంగా టీమిండియాకు సేవలు చేసిన సైనీ టైస్టుల్లో పరోక్షంగా తన సేవలు అందించనున్నాడన్న మాట. అయితే అతన్ని టెస్ట్ బౌలర్ గా తీర్చిదిద్దడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బిసిసిఐ అధికారి  ఒకరు తెలిపారు. నిపుణులైన భారత కోచింగ్ సిబ్బంది పర్యవేక్షణలో అతడు నెట్ ప్రాక్టీస్ లోపాల్గొనున్నాడు  కాబట్టి చాలా విషయాలను నేర్చుకుంటాడు.  ఇలా క్రమక్రమంగా సైనీని టెస్ట్ బౌలర్ గా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్నట్లు సదరు అధికారి వెల్లడించారు.

మరిన్ని వార్తలు

అంపైర్ల ఫిర్యాదు... నవదీప్ సైనీకి షాకిచ్చిన ఐసిసి

ఆరంగేట్ర మ్యాచ్ లోనే సైనీ అదుర్స్... విండీస్ పై టీమిండియా ఘన విజయం

వెస్టీండీస్ టూర్‌కు భారత జట్టు ఇదే: ధోనికి రెస్ట్

PREV
click me!

Recommended Stories

IPL 2026 Auction: చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కెచ్.. రూ. 43 కోట్లతో ఆ ఆటగాళ్లపై కన్నేసిన సీఎస్కే !
IPL Mini Auction చరిత్రలో అత్యంత ఖరీదైన 6 ఆటగాళ్లు వీరే.. రికార్డులు బద్దలవుతాయా?