యువీ గ్యాస్ ప్రాబ్లంకు సొల్యూషన్ దొరికిందోచ్...: హర్భజన్ ఫన్నీ కామెంట్స్

Published : Aug 19, 2019, 04:28 PM ISTUpdated : Aug 19, 2019, 04:29 PM IST
యువీ గ్యాస్ ప్రాబ్లంకు సొల్యూషన్  దొరికిందోచ్...: హర్భజన్ ఫన్నీ కామెంట్స్

సారాంశం

టీమిండియా క్రికెటర్లు హర్బజన్ సింగ్, యువరాజ్ సింగ్ లు మంచి స్నేహితులు. వీరిద్దరు మైదానంలోనే కాదు బయట కూడా చాలా సరదాగా వుంటారు. ఇలా సోషల్ మీడియాలో వీరిద్దరి మధ్య ఓ విషయంపై సాగిన చర్చ అభిమానులను నవ్వుల్లో ముంచెత్తుతోంది.  

టీమిండియా క్రికెటర్లు యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్ లు మంచి స్నేహితులన్న విషయం అందరికీ తెలిసిందే. వీరిద్దరు కేవలం క్రికెటర్లుగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా మంచి స్నేహితులు. వీరిద్దరు ఒక్కచోట చేరారంటే చాలు అక్కడ సందడి మొదలవుతుంది. ఎలాంటి మొహమాటాలు లేకుండా ఒకరిపై ఒకరు బహిరంగానే సెటైర్లు వేసి నవ్వులు పూయిస్తుంటారు. తాజాగా సోషల్ మీడియాలో వీరిద్దరి  మధ్య సాగిన సంబాషణ అభిమానులను నవ్వుల్లో ముంచెత్తుతోంది. 

ఆన్ లైన్ ద్వారా మెడిసిన్స్ ను సరఫరా చేసే ఓ సంస్థ ఓ విచిత్రమైన మెడిసిన్ గురించి ఓ ప్రకటన విడుదల చేసింది. ''  గ్యాస్ ప్రాబ్లంతో బాధపడేవారికి ఓ సింపుల్ సొల్యూషన్. మా వద్ద లభించే పిల్స్ ను వాడటం ద్వారా మీరు గ్యాస్ వదిలినా ఎవరూ పసిగట్టలేరు.  అంతేకాకుండా ఆ వాసన  రోజాపూలు, చాక్లెట్ సువాససను వెదజల్లుతుంది.'' అంటూ ట్వీట్ చేసింది. దీనిపై టీమిండియా క్రికెటర్ హర్భజన్ సింగ్ సరదా కామెంట్ తో రీట్వీట్ చేశాడు. 

''నిజంగానా!!! అయితే యవరాజ్ కోసం కొన్ని ఆర్డర్ చేయాల్సిందే...'' అంటూ సదరు ట్వీట్ పై స్పందించాడు.  అంతేకాకుండా తన ట్వీట్ ను యువరాజ్ కు ట్యాగ్ చేశాడు. భజ్జీ కామెంట్ పై యువరాజ్ కూడా సరదాగా  రియాక్ట్ అయ్యాడు. '' అవునా... అయితే నా కోసం కొన్ని(ఫిల్స్)కొనుగోలు చేయి. ఆ తర్వాత వాటిని మనిద్దరం పంచుకుందాం '' అంటూ కామెంట్  చేశాడు.  ఇలా వీరిద్దరి మధ్య సాగిన సరదా సంబాషణ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.  సామాన్యులు సైతం మాట్లాడుకోడానికి ఇష్టపడని గ్యాస్ ప్రాబ్లం గురించి ఇలా సెలబ్రేటీలు బహిరంగంగా చర్చించుకోవడం...ఒకరిపై  ఒకరు సెటైర్లు వేసుకోవడం విశేషం. వీరిద్దరి ట్వీట్స్  పై అభిమానులు కూడా పలు రకాలుగా స్పందిస్తున్నారు. 


 

PREV
click me!

Recommended Stories

IPL Mini Auction 2026: మినీ వేలంలో జాక్‌పాట్ కొట్టే ప్లేయ‌ర్స్ వీళ్లే... ఏకంగా రూ. 30 కోట్ల పైమాటే..
IPL 2026 Auction: చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కెచ్.. రూ. 43 కోట్లతో ఆ ఆటగాళ్లపై కన్నేసిన సీఎస్కే !