నువ్వు ఇంతకు మించి ఏమి పీకలేవురా.. : హ‌నుమ విహారిపై ఆంధ్ర ప్లేయ‌ర్ హాట్ కామెంట్స్.. !

By Mahesh Rajamoni  |  First Published Feb 27, 2024, 3:08 PM IST

Hanuma Vihari: క్రికెట‌ర్ హనుమ విహారి ఆంధ్రప్రదేశ్ తరపున ఎప్పుడూ ఆడనంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఒక రాజ‌కీయ నాయ‌కుడి కార‌ణంగా త‌న‌ను కెప్టెన్సీ నుంచి త‌ప్పించార‌ని ఆరోప‌ణ‌ల‌పై మ‌రో యంగ్ ప్లేయ‌ర్ పృధ్వీ రాజ్ స్పందిస్తూ హాట్ కామెంట్స్ చేశాడు. 
 


Hanuma Vihari - K N Prudhvi Raj: ఆంధ్ర క్రికెట్ లో రాజ‌కీయ ర‌చ్చ మొద‌లైంది. క్రీడల్లో జోక్య‌మేంట‌ని ప్ర‌భుత్వం పై ప్ర‌తిప‌క్ష పార్టీలు విమ‌ర్శ‌ల దాడిని మొద‌లుపెట్టాయి. ఇప్పుడు ఏపీలో అధికార‌-ప్ర‌తిప‌క్ష పార్టీల మ‌ధ్య పోరుకు ఆంధ్ర క్రికెట్ వేదిక‌గా మారింది. ఈ అగ్గిని రాజేసింది భార‌త క్రికెట‌ర్ హ‌నుమ విహారి. ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోషియేష‌న్ పై త‌న ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తూ ఇక‌పై తాను ఆంధ్ర టీమ్ త‌ర‌ఫును ఆడ‌న‌ని పేర్కొన్నాడు. త‌న‌ను అన్యాయంగా ఒక రాజ‌కీయ నాయ‌కుడి హ‌స్తంతో కెప్టెన్సీ నుంచి తప్పించార‌ని పేర్కొన్నాడు.

టీవ‌ల జ‌రిగిన ఒక మ్యాచ్‌లో విహారి తనపై అరుస్తున్నాడని ఓ యువ ఆటగాడు తన తండ్రికి ఫిర్యాదు చేయడంతో.. అతను పొలిటికల్ పవర్ తో తనను జట్టు కెప్టెన్సీ నుంచి తొలగించినట్లు విహారి వెల్లడించాడు. అయితే, క్రీడ‌పై, టీమ్ పై ఉన్న గౌర‌వంతో జ‌ట్టులో ఇప్పటివ‌ర‌కు కొన‌సాగాన‌ని తెలిపాడు. "బెంగాల్‌తో జరిగిన మొదటి గేమ్‌లో నేను కెప్టెన్‌గా ఉన్నాను, ఆ గేమ్‌లో నేను 17వ ఆటగాడిపై అరిచాను. అత‌ను త‌న తండ్రికి (రాజకీయ నాయకుడు) ఫిర్యాదు చేసాడు. ఆ రాజ‌కీయ నాయ‌కుడి హ‌స్తంతో త‌న‌ను కెప్టెన్సీ నుంచి త‌ప్పించార‌ని పేర్కొన్నాడు. గత ఏడాది ఫైనల్‌కు చేరిన బెంగాల్‌పై మేము 410 పరుగులను ఛేజ్ చేశాము, త‌న తప్పు లేకుండా కెప్టెన్సీకి రాజీనామా చేయమని త‌న‌ను అడిగార‌ని విహారి పేర్కొన్నాడు.

Latest Videos

ఆంధ్రా క్రికెట్ వివాదంలో అశ్విన్.. ఎప్పుడు కలుద్దామంటూ పోస్ట్.. హనుమ విహారీ రియాక్ష‌న్.. !

ఈ క్ర‌మంలోనే ఆంధ్రా బ్యాటర్ పృధ్వీ రాజ్ హాట్ కామెంట్స్ చేశాడు. విహారి పేర్కొంటున్న ఆ ప్లేయ‌ర్ తానేన‌ని వెల్ల‌డిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక కథనాన్ని ఉంచాడు. అయితే, కొద్ది స‌మ‌యం త‌ర్వాత దానిని తొల‌గించాడు. అప్ప‌టికే సోషల్ మీడియాలో వైర‌ల్ అయింది. ఆ పోస్టులో “అందరికీ హలో నేను ఆ కామెంట్ బాక్స్‌లో (హ‌నుమ విహారి పోస్టు) మీరు వెతుకుతున్న వ్యక్తిని. మీరు ఏది విన్నా అది పూర్తిగా అబద్ధం, ఆట కంటే ఎవ్వరూ ఉన్నతంగా లేరు.. నా ఆత్మగౌరవం అన్నింటికంటే చాలా పెద్దది. ఏ రకమైన మానవ వేదికపైనా వ్యక్తిగత దాడులు, అసభ్య పదజాలం ఆమోదయోగ్యం కాదు. ఆ రోజు ఏం జరిగిందో టీమ్‌లోని ప్రతి ఒక్కరికీ తెలుసు' అని హనుమ విహారి ఆరోపణలు చేసిన ఆటగాడు అతనేనని  పృధ్వీ రాజ్ అంగీకరించాడు.

ఈ అలాగే, హనుమ విహారిపై చేసిన కామెంట్స్ మ‌రింత రచ్చ‌ను సృష్టించాయి. త‌న పోస్టులు పృధ్వీ రాజ్.. విహారిని టార్గెట్ చేస్తూ.. నువ్వు ఇంత‌కు మించి ఏం పీక‌లేవురా సో కాల్డ్ ఛాంపియ‌న్.. నీకు కావాల్సిన సానుభూతి గేమ్స్ ఆడుకో'అని పృథ్వీ రాజ్ స్పందించడం క్రీడా వ‌ర్గాల నుంచి ఇప్పుడు పొలిటిక‌ల్ ట‌ర్న్ తీసుకుంది. కాగా, విహారి అంతర్జాతీయ వేదికపై 16 టెస్టు మ్యాచ్‌ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్‌లో మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర 5 పరుగుల తేడాతో ఓడిపోయిన తర్వాత అతని ప్రకటన వెలువడింది. విహారి హైదరాబాద్‌కు ఒక సీజన్‌తో పాటు ఆంధ్రా తరపున 37 ఫస్ట్ క్లాస్ గేమ్‌లు ఆడాడు.

Mohammed Shami: ఆస్ప‌త్రి బెడ్ పై ష‌మీ.. కాలుకు స‌ర్జ‌రీ.. ఏం జ‌రిగింది?

 

Response by Prudhvi Raj to Hanuma Vihari.

Andhra Cricket is turning into a box office. pic.twitter.com/F0TZMIKfbi

— Mufaddal Vohra (@mufaddal_vohra)

IPL 2024: ఆర్సీబీకి బిగ్ షాక్.. విరాట్ కోహ్లీ ఐపీఎల్ కు దూరం కానున్నాడా? 

click me!