ఆంధ్రా క్రికెట్ వివాదంలో అశ్విన్.. ఎప్పుడు కలుద్దామంటూ పోస్ట్.. హనుమ విహారీ రియాక్ష‌న్.. !

By Mahesh Rajamoni  |  First Published Feb 27, 2024, 12:46 PM IST

Hanuma Vihari: ఆంధ్రా క్రికెట్ వివాదం నేపథ్యంలో హనుమ విహారిని యూట్యూబ్ టాక్ షో కుట్టి క‌థ‌ల‌కు టీమిండియా స్టార్ బౌల‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ ఆహ్వానించాడు. అంత‌కుందు హ‌నుమ విహారీ ఇక నుంచి ఆంధ్ర క్రికెట్ టీమ్ కు ఆడ‌బోయేది లేద‌ని ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. 
 


Hanuma Vihari - Ravichandran Ashwin : ఆంధ్రా క్రికెట్ రాజ‌కీయ రంగుపులుముకుంది. దానికార‌ణంగానే త‌న‌ను కెప్టెన్సీ నుంచి త‌ప్పించార‌నీ, ఒక ప్లేయ‌ర్ కోసం ప‌లుకుబ‌డితో త‌న‌ను అన్యాయంగా కెప్టెన్సీ త‌ప్పించార‌నీ హనుమ విహారి పేర్కొన్నాడు. ఇక నుంచి తాను ఆంధ్ర టీమ్ కు ఆడ‌బోయేది లేదంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. ఆ త‌ర్వాత ప‌లువురు ఆంధ్ర ప్లేయ‌ర్లు సైతం హ‌నుమ విహారికి త‌మ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాడు. అత‌నే కెప్టెన్ గా ఉండాలని పేర్కొంటూ త‌మ సంత‌కాల‌తో ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. దీంతో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఇలాంటి త‌రుణంలో ఆంధ్రా క్రికెట్ వివాదంలోకి టీమిండియా స్టార్ బౌల‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ దూరాడు.

అశ్విన్ తన యూట్యూబ్ టాక్ షో 'కుట్టి స్టోరీస్'లోకి హనుమ విహారిని ఆహ్వానించాడు. విహారీ గారు మీరు రెడీగా ఉన్నారా? కుట్టి స్టోరీస్ లో మాట్లాడుకుందాం అంటూ అశ్విన్ పేర్కొన‌గా, దానిని తాను రెడీ ఉన్నాన‌నీ, ఇప్పుడు కూడా రెడీగా ఉన్నాన‌ని హ‌నుమ విహారి పేర్కొన్నాడు. దీనికి సంబంధించి పోస్టు వైర‌ల్ గా మారింది.

Latest Videos

undefined

IPL 2024: ఆర్సీబీకి బిగ్ షాక్.. విరాట్ కోహ్లీ ఐపీఎల్ కు దూరం కానున్నాడా?

 

Meru Epudu ante apudu https://t.co/AQFP44g4ta

— Hanuma vihari (@Hanumavihari)

అంతకుముందు, విహారి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో సుదీర్ఘ పోస్ట్ లో.. ఆంధ్ర టీమ్ నుంచి త‌న కెప్టెన్సీ తొల‌గించ‌డం గురించి ప్ర‌స్తావించాడు. త‌న‌ను ఒక ఆటగాడి కార‌ణంగా కెప్టెన్సీ నుంచి తొల‌గించార‌నీ, అతని తండ్రి ఒక రాజ‌కీయ నాయ‌కుడ‌నీ, ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అందుకే త‌న‌ను కెప్టెన్సీ నుంచి త‌ప్పించింద‌ని హ‌నుమ విహారి పేర్కొన్నాడు. ఇదే క్ర‌మంలో విహారి తన సహచరుల నుండి తనకు మద్దతును  ప్ర‌క‌టించిన లేఖ‌ను కూడా పంచుకున్నాడు. "బెంగాల్‌తో జరిగిన మొదటి గేమ్‌లో నేను కెప్టెన్‌గా ఉన్నాను, ఆ గేమ్‌లో నేను 17వ ఆటగాడిపై అరిచాను. అతను తన తండ్రికి (రాజకీయ నాయకుడు) ఫిర్యాదు చేసాడు, అతని తండ్రి నాపై చర్య తీసుకోవాలని అసోసియేషన్‌ను కోరాడు. అందుకే త‌న‌ను కెప్టెన్సీ నుంచి త‌ప్పించార‌ని" పేర్కొన్నాడు. 

"మేము గత ఏడాది ఫైనలిస్టులు బెంగాల్‌పై 410 పరుగులతో ఛేజ్ చేసాము, నా తప్పు లేకుండా కెప్టెన్సీకి రాజీనామా చేయమని నన్ను అడిగారు. నేను ప్లేయర్‌తో వ్యక్తిగత గమనికపై ఎప్పుడూ ఏమీ చెప్పలేదు, కానీ అతనిని ఇచ్చిన వ్యక్తి కంటే ఆటగాడే చాలా ముఖ్యం అని అసోసియేషన్ భావించిందన్నారు. నేను ఇబ్బందిపడ్డాను, కానీ నేను ఈ సీజన్‌లో ఆడటం కొనసాగించడానికి కారణం నేను ఆట, నా జట్టును గౌరవించడమేన‌ని" విహారి పేర్కొన్నాడు. ఆటగాళ్ళు తాము ఏది చెప్పినా వినాలని అసోసియేషన్ భావిస్తుందని కూడా విమ‌ర్శ‌లు గుప్పించాడు. 

 

Ranji Trophy 2023/24 pic.twitter.com/PXHNG487BQ

— Hanuma vihari (@Hanumavihari)

 

MOHAMMED SHAMI: ఆస్ప‌త్రి బెడ్ పై ష‌మీ.. కాలుకు స‌ర్జ‌రీ.. ఏం జ‌రిగింది?

click me!