Mohammed Shami: టీమిండిమా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024) రాబోయే సీజన్ కు ముందు కాలుకు సర్జరీ చేయించుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంతో వైరల్ గా మారాయి.
Mohammed Shami health update: భారత స్టార్ బౌలర్ మహ్మద్ షమీకి సర్జరీ అయింది. అతని కాలికి జరిగిన శస్త్రచికిత్స కు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. అలాగే, తన హెల్త్ అప్‌డేట్ వివరాలు అందించాడు. త్వరలోనే మళ్లీ గ్రౌండ్ లో అడుగుపెడతానని పేర్కొన్నాడు. వైద్యుల పర్యవేక్షణలో ఉన్నానని చెప్పాడు. అసలు షమీకి సర్జరీ ఎందుకు చేశారు? షమీకి ఏమైంది?
కాలుకు సర్జరీ..
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023 సమయంలో కాలు గాయం అయింది. దీని కారణంగా షమీ ఇటీవల భారత్ ఆడిన పలు సిరీస్ లకు దూరం అయ్యాడు. ఇటీవల భారత్-ఇంగ్లాండ్ సిరీస్ కు కూడా ఎంపికయ్యాడు కానీ, గాయం తీవ్ర తగ్గకపోవడంతో జట్టులోకి రాలేకపోయాడు. ఈ క్రమంలో గాయంతో మరింత ఇబ్బంది పడిన మహ్మద్ షమీ చివరకు శస్త్రచికిత్స చేయించుకోవలసి వచ్చింది. సోమవారం మడమకు ఆపరేషన్ చేశారు. సర్జరీ తర్వాత షమీ తన ఆరోగ్య వివరాలు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఫొటోలు షేర్ చేశాడు. త్వరగా మళ్లీ గ్రౌండ్ లోకి తిరిగి రావాలని ఆశిస్తున్నట్టు చెప్పాడు. కాలుకు జరిగిన సర్జరీ కారణంగా మహ్మద్ షమీ రాబోయే ఐపీఎల్ సీజన్, టీ20 ప్రపంచ కప్ 2024కి అందుబాటులో వుంటే అవకాశాలు తక్కువ. దీంతో టీమిండియాకు, గుజరాత్ టైటాన్స్‌కు ఇది గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పాలి.
IPL 2024: ఆర్సీబీకి బిగ్ షాక్.. విరాట్ కోహ్లీ ఐపీఎల్ కు దూరం కానున్నాడా?
మహ్మద్ షమీ ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది?
భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ ఇటీవల తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తన ఆరోగ్యం గురించి కొన్ని చిత్రాలను పంచుకున్నాడు. ఇందులోఆసుపత్రి బెడ్‌పై పడుకుని కనిపించాడు. ఇప్పుడు పూర్తిగా క్షేమంగా ఉన్నాడనే సంకేతాలు ఇచ్చారు. తన ఫొటోలను పంచుకుంటూ.. "నాకు ఇప్పుడే నా కాలుకు విజయవంతమైన ఆపరేషన్ జరిగింది. కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది, కానీ నేను త్వరగా తిరిగి రావాలని ఆశిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు.. ప్రేమతో షమీ.." అని పేర్కొన్నాడు. షమీ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 6 లక్షల మందికి పైగా దీన్ని లైక్ చేసారు.
వన్డే ప్రపంచకప్ 2023లో అత్యధిక వికెట్లు..
భారత క్రికెటర్ మహ్మద్ షమీ 2023 ప్రపంచకప్‌లో 7 మ్యాచ్‌లలో 24 వికెట్లు పడగొట్టాడు. ప్రపంచ కప్ సమయంలో కాలికి గాయం కావడంతో కొంతకాలం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. కానీ షమీ పరిస్థితిలో ప్రయోజనం లేకపోయింది. దీంతో బ్రిటన్ నుండి ప్రత్యేక ఇంజెక్షన్లు కూడా తీసుకున్నాడు. అది కూడా పెద్దగా ఫలితం ఇవ్వకపోవడంతో ఇప్పుడు సర్జరీ చేయాల్సి వచ్చింది. షమీ గాయం నుంచి కోలుకోవడానికి దాదాపు 6 నెలల సమయం పట్టే అవకాశముంది. దీంతో ఐపీఎల్ 2024, టీ20 ప్రపంచ కప్, శ్రీలంకతో భారత్ సిరీస్ కు షమీ దూరం అయ్యాడు.
Yashasvi Jaiswal: 92 ఏళ్లలో ఇదే తొలిసారి..! యశస్వి జైస్వాల్ సరికొత్త చరిత్ర !