Yashasvi Jaiswal: యశస్వి జైస్వాల్ ప్రస్తుతం జరుగుతున్న భారత్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ లో 2 డబుల్ సెంచరీలు సాధించాడు. ఈ సిరీస్ లో పరుగుల వరద పారిస్తూ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో యశస్వి జైస్వాల్ కెరీర్ బెస్టు కు చేరాడు.
ICC Test Rankings - Jaiswal : ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో టీమిండియా యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ దూకుడు కొనసాగుతోంది. ప్రస్తుతం పరుగుల వరద పారిస్తూ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో యశస్వి జైస్వాల్ 14 స్థానాలు ఎగబాకి 15వ స్థానానికి ఎగబాకాడు. తన కెరీర్ లోనే బెస్ట్ టెస్టు ర్యాంకింగ్స్ లోకి చేరాడు. ప్రస్తుతం జరుగుతున్న భారత్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ లో వరుసగా రెండు డబుల్ సెంచరీలు సాధించడంతో తన ర్యాంకును మెరుగుపడింది. 22 ఏళ్ల ఎడమచేతి వాటం ఆటగాడు జైస్వాల్ ఈ ఘనత సాధించిన ఎనిమిదో క్రికెటర్ గా, మూడో భారతీయుడిగా నిలిచాడు.
విశాఖపట్నంలో జరిగిన రెండో టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్ లో జైస్వాల్ 209 పరుగులు చేశాడు. ఆ తర్వాత రాజ్ కోట్ లో జరిగిన రెండో ఇన్నింగ్స్ లో 214 పరుగులతో అజేయంగా నిలిచి ఇంగ్లండ్ పై భారత్ 434 పరుగుల తేడాతో ఘన విజయం సాధించడంలో కీలకంగా ఉన్నారు. దీంతో ఈ సిరీస్ లో భారత్ 2-1 ఆధిక్యంలో నిలిచింది. అలాగే, రాజ్ కోట్ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికైన రవీంద్ర జడేజా బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లోనూ పురోగతి సాధించాడు. తొలి ఇన్నింగ్స్ లో చేసిన సెంచరీతో 41వ స్థానం నుంచి 34వ స్థానానికి చేరుకున్నాడు. జడేజా ఆల్ రౌండ్ ప్రదర్శనతో పాటు ఏడు వికెట్లు పడగొట్టి బౌలింగ్ ర్యాంకింగ్స్ లో ఆరో స్థానానికి చేరాడు.
undefined
విరాట్ కోహ్లీ కొడుకు పేరు 'అకాయ్' అంటే అర్థమేంటో తెలుసా?
రాజ్ కోట్ లో 500 టెస్టు వికెట్ల మైలురాయిని అందుకున్న వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ర్యాంకింగ్స్ లో పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తర్వాత రెండో స్థానానికి చేరుకున్నాడు. టెస్టు ఆల్ రౌండర్ల ర్యాంకింగ్స్ లో జడేజా, అశ్విన్ లు తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. జడేజా 469 పాయింట్లతో కెరీర్ బెస్ట్ రేటింగ్ సాధించి ఆల్ రౌండర్లలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.రాజ్ కోట్ లో జరిగిన తొలి ఇన్నింగ్స్ లో 131 పరుగులు చేసిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ జాబితాలో కాస్త మెరుగుపడి 12వ స్థానానికి చేరుకున్నాడు.
అలాగే, శుభ్ మన్ గిల్ రెండో ఇన్నింగ్స్ లో 91 పరుగులు చేయడంతో మూడు స్థానాలు ఎగబాకి 35వ స్థానంలో నిలిచాడు. అరంగేట్ర ఆటగాళ్లు సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ వరుసగా 75, 100వ స్థానాల్లో ఉన్నారు. వ్యక్తిగత కారణాల వల్ల విరాట్ కోహ్లీ ఈ సిరీస్ లో ఆడకపోయినప్పటికీ టాప్-10 బ్యాట్స్ మన్ ర్యాంకింగ్స్ లో 7వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇంగ్లాండ్ ఓపెనర్ బెన్ డకెట్ 12 స్థానాలు ఎగబాకి 13వ స్థానానికి చేరుకున్నాడు. దక్షిణాఫ్రికాపై మరో సెంచరీ సాధించిన న్యూజిలాండ్ ఆటగాడు కేన్ విలియమ్సన్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు. తొలి రెండు స్థానాల్లో కేన్ మామ, స్టీవ్ స్మిత్ లు ఉన్నారు.
ఐపీఎల్ ఆల్ టైమ్ గ్రేటెస్ట్ టీమ్ లో రోహిత్ కు దక్కని చోటు.. ! కెప్టెన్ ఎవరంటే..?
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ బ్యాటింగ్:
1. కేన్ విలియమ్సన్
2. స్టీవ్ స్మిత్
3. డారిల్ మిచెల్
4. బాబర్ ఆజం
5. జో రూట్
6. ఉస్మాన్ ఖవాజా
7. విరాట్ కోహ్లీ
8. దిముత్ కరుణరత్నే
9. హ్యారీ బ్రూక్
10. మార్నస్ లాబుస్చాగ్నే
మ్యాచ్ మధ్యలో గ్రౌండ్ లోకి వచ్చి ఆటగాళ్లను వెంబడించిన ఎద్దు.. వీడియో వైరల్