కొడుకు పుట్టిన తర్వాత విరాట్ కోహ్లీ.. సోషల్ మీడియాలో ఫోటో వైరల్ !

By Mahesh Rajamoni  |  First Published Feb 21, 2024, 12:59 PM IST

Virat Kohli son Akaay: భార‌త స్టార్ క‌పుల్ విరాట్ కోహ్లీ - అనుష్క దంప‌తులు మ‌రో పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చారు. జూనియర్ విరాట్ కోహ్లీ అకాయ్ జన్మించిన తర్వాత లండన్ లో విరాట్ కోహ్లీ దిగిన ఫోటో వైరల్ గా మారింది.
 


meaning of Virat Kohli's sonAkaay: విరాట్ కోహ్లీ, నటి అనుష్క దంపతులు మరో బిడ్డకు జన్మనిచ్చారు. ఫిబ్రవరి 15న విరాట్-అనుష్క దంప‌తులు మ‌గ‌బిడ్డ‌కు స్వాగ‌తం ప‌లికారు. ఈ జంట సోషల్ మీడియా ద్వారా ఈ విష‌యాన్ని పంచుకున్నారు. పుట్టిన బిడ్డకు అకాయ్ అని పేరు కూడా పెట్టారు. ఈ స్టార్ క‌పుల్ ఈ విష‌యం చెప్పిన వెంట‌నే సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఇదే క్ర‌మంలో టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ అయిన విరాట్ కోమ్లీకి సంబంధించిన ఒక ఫోటో వైర‌ల్ గా మారింది.

విరాట్-అనుష్క తమ కొడుకు పుట్టిన వార్తను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. దీని తరువాత, ఇప్పుడు విరాట్ కోహ్లీ ఫోటో వైరల్‌గా మారింది. అనుష్క శర్మ తన రెండవ బిడ్డకు లండన్ ఆసుపత్రిలో జన్మనివ్వబోతోందని గతంలో పుకార్లు వచ్చాయి. ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ విరాట్ ఫోటో కూడా లండన్ కి చెందినదే అని అంటున్నారు. ఈ చిత్రంలో, విరాట్ సాయంత్రం లండన్ వీధుల్లో తిరుగుతున్న‌ట్టుగా క‌నిపిస్తోంది. విరాట్ కోహ్లీ అభిమాని ఈ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

Latest Videos

విరాట్ కోహ్లీ కొడుకు పేరు 'అకాయ్' అంటే అర్థమేంటో తెలుసా?

 

Latest Picture Virat Kohli in London 😍 pic.twitter.com/JOQoq13EQQ

— Virat Kohli Fan Club (@Trend_VKohli)

 

జూనియ‌ర్ విరాట్ కోహ్లీకి 'అకాయ్' అని పేరు.. ! 

ఇప్ప‌టికే విరాట్ కోహ్లీ-అనుష్క శ‌ర్మ దంప‌తుల‌కు వామిక అనే కూతురు ఉంది. ఇప్పుడు రెండో బిడ్డ‌కు స్వాగ‌తం ప‌లికారు. మ‌గ‌బిడ్డ‌కు అకాయ్ అని పేరు పెట్టిన‌ట్టు విరుష్క దంప‌తులు ప్ర‌క‌టించారు. తమ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. ఫిబ్రవరి 15న తాము మ‌రో బిడ్డ‌కు స్వాగ‌తం ప‌లికామ‌నీ, అవామిక సోద‌రుడు వ‌చ్చాడ‌ని చెప్ప‌డం సంతోషంగా ఉంద‌ని తెలిపారు. త‌మ జీవితంలోని ఈ అందమైన క్షణాలలో అంద‌రి ఆశీస్సులు, శుభాకాంక్షలు కూడా కోరుకుంటున్నామ‌ని తెలిపారు.

ఇంగ్లండ్ సిరీస్ కు దూరంగా విరాట్ కోహ్లీ.. ! 

ప్ర‌స్తుతం భార‌త్-ఇంగ్లాండ్ మ‌ధ్య ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ జ‌రుగుతోంది. ఇప్ప‌టికే మూడు టెస్టులు జర‌గ్గా, తొలి టెస్టులో ఓడిన భార‌త్.. ఆ త‌ర్వాత రెండు మ్యాచ్ ల‌లో ఇంగ్లాండ్ ను చిత్తుచేసింది. ఈ సిరీస్ ప్రారంభానికి ముందు విరాట్ కోహ్లీ తొలి రెండు టెస్టుల‌కు త‌ప్పుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించింది బీసీసీఐ. ఆ త‌ర్వాత మొత్తం సిరీస్ కు దూర‌మైన‌ట్టు పేర్కొంది. దీనికి వ్య‌క్తిగ‌త కార‌ణాల‌ని పేర్కొంది. అయితే రెండో బిడ్డకు స్వాగ‌తం ప‌లికేందుకే విరాట్ కోహ్లీ టెస్టు సిరీస్ నుంచి త‌ప్పుకున్నార‌ని ఇప్పుడు స్పష్టమైంది.

IPL 2024: రిషబ్ పంత్ వ‌చ్చేస్తున్నాడు.. ఢిల్లీ క్యాపిట‌ల్స్ కెప్టెన్ గా గ్రౌండ్ లోకి రీఎంట్రీ.. !

 

click me!