WPL 2024: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌కు స‌ర్వం సిద్ధం.. తొలి మ్యాచ్ ఆ రెండు జ‌ట్ల మ‌ధ్య‌నే.. !

By Mahesh Rajamoni  |  First Published Feb 22, 2024, 4:31 PM IST

WPL 2024: బెంగళూరులో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండో ఎడిషన్ ప్రారంభోత్సవంలో బాలీవుడ్ స్టార్స్ షారుఖ్ ఖాన్, సిద్ధార్థ్ మల్హోత్రా, కార్తీక్ ఆర్యన్ ప్రదర్శన ఇవ్వనున్నారు. డ‌బ్ల్యూపీఎల్ ప్రారంభోత్స‌వ వేడుక ఫిబ్రవరి 23 సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభం కానుంది.
 


Women's Premier League 2024: మహిళల ప్రీమియర్ లీగ్ రెండో ఎడిషన్ కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఫిబ్రవరి 23, శుక్రవారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగే మెగా లీగ్ ప్రారంభోత్సవానికి బాలీవుడ్ ఫ్లేవర్ ఉండ‌నుంది. ఈ ప్రారంభోత్సవానికి బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్, సిద్ధార్థ్ మల్హోత్రా, కార్తీక్ ఆర్యన్ ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇవ్వ‌నున్నారు. డబ్ల్యూపీఎల్ 2024 సీజన్ ను అంగరంగ వైభవంగా ప్రారంభిస్తారనీ, సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభ వేడుకలు ప్రారంభమవుతాయని డ‌బ్ల్యూపీఎల్ వ‌ర్గాలు తెలిపాయి. బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియంలో డ‌బ్ల్యూపీఎల్ రెండో ఎడిషన్ తొలి మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

తొలి మ్యాచ్ లో విజ‌యం ఎవ‌రినీ వ‌రిస్తుందో.. !

Latest Videos

undefined

బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియంలో డ‌బ్ల్యూపీఎల్ రెండో ఎడిషన్ ప్రారంభ వెడుక‌లు ఘ‌నంగా జ‌ర‌గ‌నున్నాయి. ఇది పూర్తియిన త‌ర్వాత తొలి మ్యాచ్ డబ్ల్యూపీఎల్ తొలి ఎడిషన్ లో హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ ఫైనల్లో మెగ్ లానింగ్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ ను ఓడించి ఫైనల్ ఛాంపియన్ గా నిలిచింది. డ‌బ్ల్యూపీఎల్ నిబంధ‌న‌ల ప్ర‌కారం విన్న‌ర్, ర‌న్న‌ర‌ఫ్ ల మ‌ధ్య తొలి మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. శుక్రవారం జరిగే తొలి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్-ఢిల్లీ క్యాపిటల్స్ త‌ల‌ప‌డ‌నున్నాయి. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది.

IPL 2024: గుజరాత్ టైటాన్స్ కు బిగ్ షాక్.. ఐపీఎల్ నుంచి మహ్మద్ షమీ ఔట్ !

తొలి మ్యాచ్ టీమ్స్ స్క్వాడ్:

 

5️⃣ Captains. 1️⃣ Goal 🏆

The stage is set for 2024 🏟️ pic.twitter.com/XkhMWXMXmd

— Women's Premier League (WPL) (@wplt20)

ముంబై ఇండియన్స్: 

హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), అమంజోత్ కౌర్, అమేలియా కెర్, క్లో ట్రయాన్, హేలీ మాథ్యూస్, హుమైరా కాజీ, ఇస్సీ వాంగ్, జింతిమణి కలిత, నాట్ స్కివర్-బ్రంట్, పూజ వస్త్రాకర్, ప్రియాంక బాలా, సైకా ఇషాక్, యాస్తికా భాటియా, షబ్నిమ్ ఇస్మాయిల్, ఎస్ సజన, అమన్‌దీప్ కౌర్, ఫాతిమా జాఫర్, కీర్తన బాలకృష్ణన్.

ఢిల్లీ క్యాపిటల్స్:

మెగ్ లాన్నింగ్ (కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, లారా హారిస్, షఫాలీ వర్మ, అలిస్ క్యాప్సే, అన్నాబెల్ సదర్లాండ్, అరుంధతి రెడ్డి, అశ్వనీ కుమారి, జెస్ జొనాస్సెన్, మారిజానే కాప్, స్నేహ దీప్తి, మిన్ను మణి, రాధా యాదవ్, శిఖా పాండే, శిఖా పాండే , తానియా భాటియా, పూనమ్ యాదవ్, టిటాస్ సాధు.

ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లు బాదిన టాప్-10 క్రికెట‌ర్లు ఎవ‌రో తెలుసా ?

click me!