కాశ్మీర్ వీధుల్లో బ్యాట్ తో అదరగొట్టిన సచిన్ టెండూల్కర్.. ! వీడియో

By Mahesh Rajamoni  |  First Published Feb 22, 2024, 2:12 PM IST

Sachin Tendulkar: ఇదివ‌ర‌కు విమానంలో ప్ర‌యాణిస్తున్న స‌మ‌యంలో.. 'సచిన్ స‌చిన్... అంటూ అభిమానులు కేరింతలు కొడుతున్న దృశ్యాలు వైరల్ కాగా, ప్ర‌స్తుతం మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ సచిన్ టెండూల్కర్ కాశ్మీర్ వీధుల్లో క్రికెట్ ఆడుతున్న దృశ్యాలు నెట్టింట వైర‌ల్ మారాయి.
 


Tendulkar playing cricket on Kashmir street: భారత క్రికెట్ లెజెండ్, మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ సచిన్ టెండూల్కర్ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన త‌న ప్ర‌భావం మాత్రం ఏమాత్ర త‌గ్గ‌లేదు. తాను ఎక్క‌డ క‌నిపించినా క్రికెట్ ప్రియుల సంద‌డి మాములుగా ఉండ‌దు.. ! స‌చిన్ టెండూల్క‌ర్ ప్ర‌జ‌ల్లోకి వ‌చ్చిన ప్ర‌తిసారి సంబంధిత దృశ్యాలు సోష‌ల్ మీడియాను షేక్ చేస్తాయి. ఇప్పుడు కూడా మ‌రో వీడియో నెట్టింట వైర‌ల్ గా మ‌రింది. ప్ర‌స్తుతం టెండూల్క‌ర్ ఉత్తరాది రాష్ట్రమైన జ‌మ్మూకాశ్మీర్ పర్యటనను ఆస్వాదిస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే ఇప్ప‌టివ‌రు క్రికెట్ గ్రౌండ్ త‌న‌దైన ఆట‌తో అభిమానుల‌ను అల‌రించిన స‌చిన్ టెండూల్క‌ర్ ఇప్పుడు భూత‌ల స్వ‌ర్గం జ‌మ్మూకాశ్మీర్ లో వీధుల్లో త‌మ అభిమానుల‌తో క్రికెట్ ఆడుతూ క‌నిపించాడు. దీనికి సంబంధించిన వీడియోను ఎక్స్ వేదిక‌గా మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ పంచుకున్నారు. తాను పంచుకున్న వీడియోలో.. సచిన్ టెండూల్క‌ర్ కాశ్మీర్ లోని ఒక వీధిలోని రోడ్డుపై క్రికెట్ ఆడుతున్నారు. మొద‌ట అక్క‌డ క్రికెట్ ఆడుతున్న వారి వ‌ద్ద‌కు వెళ్లిన స‌చిన్.. "హమ్ ఖేలీన్? (నేనూ ఆడనా?) అంటూ బ్యాట్ ప‌ట్టి త‌న అభిమానుల‌తో క్రికెట్ ఆడారు. 'క్రికెట్ అండ్ కాశ్మీర్: స్వర్గంలో మ్యాచ్' అనే క్యాప్షన్ తో పోస్ట్ చేసిన వీడియోలో తన అద్భుతమైన టైమింగ్ తో బంతిని కొడుతూ క‌నిపించారు.

Latest Videos

ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లు బాదిన టాప్-10 క్రికెట‌ర్లు ఎవ‌రో తెలుసా ?

 

Cricket & Kashmir: A MATCH in HEAVEN! pic.twitter.com/rAG9z5tkJV

— Sachin Tendulkar (@sachin_rt)

కొద్ది స‌మ‌యం అభిమానుల‌తో క్రికెట్ ఆడిన త‌ర్వాత స‌చిన్ టెండూల్క‌ర్ తో అక్క‌డి వారు సెల్ఫీల‌తో ముంచెత్తారు. ప్ర‌స్తుతం ఈ వీడియో వైర‌ల్ గా మారింది. అంత‌కుముందు త‌న ప‌ర్య‌ట‌న‌లో కాశ్మీర్ లోని క్రికెట్ బ్యాట్ తయారీ కర్మాగారాన్ని సందర్శించిన వీడియోను కూడా పోస్ట్ చేశాడు. ముఖ్యంగా కాశ్మీర్ విల్లో బ్యాట్లు క్రికెటర్లతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. తన సోదరి తనకు కాశ్మీర్ విల్లో బ్యాట్ ను బహుమతిగా ఇచ్చిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. భారత దిగ్గజ క్రికెటర్ తన భార్య అంజలి టెండూల్కర్, కుమార్తె సారా టెండూల్కర్ తో కలిసి జ‌మ్మూ కాశ్మీర్ లో పర్యటిస్తున్నారు.

6 బంతుల్లో 6 సిక్సర్లు.. ఆంధ్ర క్రికెట‌ర్ వంశీకృష్ణ సంచ‌ల‌న బ్యాటింగ్.. వీడియో !

Sachin Tendulkar playing cricket on the streets of Kashmir. pic.twitter.com/b27dkGf0KM

— mahe (@mahe950)

మోడల్ తానియా సింగ్ ఆత్మహత్య.. చిక్కుల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్

click me!