World Cup 2023: భార‌త్ గ్రాండ్ విక్ట‌రీ.. మ‌హ్మ‌ద్ ష‌మీపై ప్ర‌ధాని మోడీ ప్ర‌శంస‌ల జ‌ల్లు

India vs New Zealand: ఐసీసీ క్రికెట్ వ‌రల్డ్ క‌ప్ 2023 సెమీ-ఫైనల్‌లో విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ లు సెంచరీలు సాధించగా, స్పీడ్‌స్టర్ మహ్మద్ షమీ ఏడు వికెట్లు సాధించి భారత్ కు గ్రాండ్ విక్ట‌రీ అందించారు.
 

Google News Follow Us

ICC Cricket World Cup 2023: ఐసీసీ క్రికెట్ వ‌ర‌ల్డ్ క‌ప్ 2023లో తిరుగులేని విజ‌యాల‌తో భార‌త్ ఫైనల్ చేరుకుంది. బుధ‌వారం ముంబ‌యిలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఐసీసీ క్రికెట్ వ‌ర‌ల్డ్ కప్ 2023 సెమీ ఫైనల్లో భారత్ 70 పరుగుల తేడాతో న్యూజిలాండ్ పై గ్రాండ్ వీక్ట‌రీతో ఫైన‌ల్లోకి దూసుకెళ్లింది. భారత్ వర్సెస్ న్యూజిలాండ్ క్రికెట్ వరల్డ్ కప్ సెమీఫైనల్‌లో మహమ్మద్ షమీ ప్రదర్శనను ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. మహ్మద్ షమీ ఆటతీరును రాబోయే తరాలు గుర్తుంచుకుంటాయని కొనియాడారు.

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఐసీసీ క్రికెట్ వ‌ర‌ల్డ్ క‌ప్ 2023 సెమీ ఫైన‌ల్ లో భార‌త్ గ్రాండ్ వీక్ట‌రీపై స్పందించారు. ఈ మేర‌కు ఎక్స్ లో చేసిన పోస్టులో భార‌త జ‌ట్టు పై ప్ర‌శంస‌లు కురిపించారు. ముఖ్యంగా ఏడు వికెట్లు తీసి భార‌త్ గెలుపులో కీల‌క పాత్ర పోషించిన మ‌హ్మ‌ద్ ష‌మీ ప్ర‌ద‌ర్శ‌న‌ను ప్ర‌ధాని మోడీ కొనియాడారు. ఎక్స్ పోస్టులో ప్ర‌ధాని మోడీ.. "టీమ్ ఇండియాకు అభినందనలు! భారత్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి, విశేషమైన శైలిలో ఫైనల్స్‌లోకి ప్రవేశించింది. అద్భుతమైన బ్యాటింగ్, మంచి బౌలింగ్ మా జట్టుకు మ్యాచ్‌ని కట్టబెట్టింది. ఫైనల్స్‌కు బెస్ట్ విషెస్శు! " పేర్కొన్నారు. 

మ‌రో పోస్టులో.. మ‌హ్మ‌ద్ ష‌మీ ఆట‌తీరుపై ప్ర‌ధాని మోడీ ప్ర‌శంస‌లు కురిపించారు.  "నేటి సెమీ ఫైనల్ కూడా అద్భుతమైన వ్యక్తిగత ప్రదర్శనలకు ధన్యవాదాలు. ఈ ప్ర‌పంచ క‌ప్ గేమ్‌లో మ‌హ్మ‌ద్ ష‌మీ బౌలింగ్‌ను క్రికెట్ ప్రేమికులు.. రాబోయే తరాలు గుర్తించుకుంటాయి. షమీ బాగా ఆడాడు!" అని పేర్కొన్నారు. 

Read more Articles on