IND vs ZIM: జింబాబ్వే చేతిలో ఓడిన ప్రపంచ ఛాంపియన్.. టీమిండియా చెత్త రికార్డు

By Mahesh RajamoniFirst Published Jul 6, 2024, 9:25 PM IST
Highlights

IND vs ZIM 1st T20 Highlights : శుభ్‌మన్ గిల్ సారథ్యంలో జింబాబ్వేతో టీ20 సిరీస్ ఆడేందుకు వెళ్లిన టీమిండియా.. తొలి మ్యాచ్‌లో ఘోర పరాజయాన్ని చవిచూసింది. 116 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భార‌త జ‌ట్టు 102 పరుగులకే ఆలౌటైంది.
 

IND vs ZIM 1st T20 Highlights : ప్రపంచ ఛాంపియ‌న్ టీమిండియాకు బిగ్ షాక్ త‌గిలింది. టీ20 ప్రపంచ కప్ విశ్వవిజేత జట్టు చిన్న టీమ్ ముందు లొంగిపోయింది. 116 ప‌రుగులు ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో 102 ప‌రుగుల‌కే ఆలౌట్ తో ఓట‌మి పాలైంది. శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో జింబాబ్వేతో టీ20 సిరీస్ ఆడేందుకు వెళ్లిన టీమిండిమా మొదటి మ్యాచ్‌లో అవమానకరమైన ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. 116 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత స్టార్ ప్లేయ‌ర్లు అంద‌రూ 102 పరుగులకే పెవిలియ‌న్ కు చేరారు. ఇటీవల టీ20 ప్రపంచకప్‌ గెలిచి స్వదేశానికి చేరుకుంది భార‌త్. దేశవ్యాప్తంగా భారీ సంబరాలు జరిగాయి. అయితే జింబాబ్వే చేతిలో ఈ ఓటమి అభిమానులను షాక్‌కి గురి చేసింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో జింబాబ్వే 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.

బ్యాటింగ్, బౌలింగ్ లో అద‌ర‌గొట్టిన జింబాబ్వే..

Latest Videos

ఇటీవల బార్బడోస్‌లో జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుంది భార‌త్. జింబాబ్వే చేతిలో ఓడిపోవడం అంటే సింహాసనం మీద నుంచి నేలపై పడిపోవడం లాంటిద‌ని నెట్టింట కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. అయితే, ఈ మ్యాచ్ లో జింబాబ్వే ఆట తీరును మెచ్చుకోవాల్సిందే.. టీమిండియా బౌలింగ్ ముందు ఆలౌట్ కాకుండా ప‌రుగులు చేయ‌డం బ్యాటింగ్ లో స‌క్సెస్ అయింది. ఇక బౌలింగ్, ఫీల్డింగ్ లో అద‌ర‌గొట్టింది. వ‌రుస వికెట్లు తీసుకుని ఇండియాకు బిగ్ షాకిచ్చింది. జింబాబ్వే తో టీ20 సిరీస్ కు భార‌త‌ జ‌ట్టులో యువ ఆటగాళ్లకు సెలక్టర్లు అవకాశం ఇచ్చినా తొలి మ్యాచ్‌లోనే స‌ద్వినియోగం చేసుకోలేక‌పోయారు. అరంగేట్రం మ్యాచ్‌లు ఆడుతున్న అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్ వంటి ఐపీఎల్ స్టార్లు ఫ్లాప్ షో చూపించారు.

సులువుగానే టార్గెట్ క‌నిపించినా.. 

జింబాబ్వేను 115 పరుగులకే పరిమితం చేసిన భారత్‌కు విజయం సులువుగానే కనిపించింది. ఎందుకంటే ఐపీఎల్ లో అద‌ర‌గొట్టిన స్టార్ యంగ్ ప్లేయ‌ర్ల‌తో టీమిండియా టైన‌ప్ బలంగా ఉంది. కానీ జింబాబ్వేతో జ‌రిగిన తొలి టీ20 మ్య‌చ్ లో భార‌త‌ బ్యాటింగ్‌ లైనప్‌ ఫ్లాప్‌ అయింది. శుభమన్ గిల్ (31 పరుగులు), వాషింగ్టన్ సుందర్ (27 పరుగులు) తప్ప మరెవరూ ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. 47 పరుగుల‌కే ఆరు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. వంద ప‌రుగులు కూడా చేయ‌కుండానే ఔట్ అవుతుంద‌ని అనిపించింది. చివరి ఓవర్లో భారత్ విజయానికి అవ‌స‌ర‌మైన‌ 16 పరుగులు చేయ‌లేక‌పోయింది.

గిల్ 31, వాషింగ్టన్ సుందర్ 27 పరుగులు చేశారు. అభిషేక్ శర్మ, రింకూ సింగ్, ముఖేష్ కుమార్ లు ఒక్క పరుగు కూడా చేయకుండానే పెవిలియన్ కు చేరారు. రుతురాజ్ గైక్వాడ్ 7, రియాన్ పరాగ్ 2, ధ్రువ్ జురేల్ 6, రవి బిష్ణోయ్ 9, అవేష్ ఖాన్ 16 పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో టెండై చతర 3, సికందర్ రజా 3 వికెట్లు తీసుకున్నారు. ఇక రవి బిష్ణోయ్, సుందర్ స్పిన్ ధాటికి జింబాబ్వే జట్టు 115 పరుగులకే ఆలౌటైంది. బిష్ణోయ్ 4 వికెట్లు తీయగా, సుందర్‌కు రెండు వికెట్లు దక్కాయి.

అనంత్ అంబానీ-రాధిక సంగీత్‌లో ధోనీ-సాక్షి... షేర్వానీ లుక్‌తో అద‌ర‌గొట్టారుగా.. ! వీడియో

click me!