అనంత్ అంబానీ-రాధిక సంగీత్‌లో ధోనీ-సాక్షి... షేర్వానీ లుక్‌తో అద‌ర‌గొట్టారుగా.. ! వీడియో

By Mahesh RajamoniFirst Published Jul 6, 2024, 7:19 PM IST
Highlights

Anant Ambani Radhika Merchant Sangeet ceremony : అనంత్ అంబానీ తన స్నేహితురాలు రాధికా మర్చంట్‌ను జూలై 12న ముంబైలో వివాహం చేసుకోబోతున్నారు. ఈ క్ర‌మంలోనే నిర్వ‌హించిన సంగీత్ వేడుక‌లో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని, ఆయ‌న భార్య సాక్షిలు భాగ‌మ‌య్యారు. ధోని కొత్త లుక్ వైర‌ల్ గా మారింది.
 

Anant Ambani Radhika Merchant Sangeet ceremony : రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్, ఎండీ ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ తన స్నేహితురాలు రాధికా మర్చంట్‌ను జూలై 12న ముంబైలో వివాహం చేసుకోబోతున్నారు. ఈ క్ర‌మంలోనే నిర్వ‌హించిన సంగీత్ వేడుక‌లో పలువురు బాలీవుడ్ తారలు, క్రికెటర్లు, క్రీడాకారులు స‌హా అనేక మంది ప్రముఖులు జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వ‌హించిన వేడుక‌ల్లో క‌నిపించారు. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని, ఆయ‌న భార్య సాక్షి కూడా విచ్చేశారు. ఐపీఎల్ త‌ర్వాత 2024 తర్వాత ధోనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు కొన్నిసార్లు సాక్షి సోషల్ మీడియాలో పంచుకున్నారు.

అయితే, వీటికి భిన్నంగా అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ సంగీత్ వేడుక‌లో ధోని కొత్త లుక్ మెరిశారు. ధోనీ, సాక్షిల వీడియో కొద్దిసేపటికే నెట్టింట‌ వైరల్‌గా మారింది. అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకకు సంబంధించిన ధోనీ ఫోటోలు కూడా సోష‌ల్ మీడియాలో సంచలనం సృష్టించాయి.

Latest Videos

సాక్షితో ధోనీ పోజులు..

ఐపీఎల్ 2024లో ధోని పాత స్టైల్‌లోనే కనిపించాడు. అత‌ని వింటేజ్ హెయిర్ స్టైల్ ను చాలా ఇష్టపడ్డారు. అయితే ఇప్పుడు ధోనీ హెయిర్ స్టైల్ మార్చేశాడు. అనంత్, రాధికల సంగీత్ వేడుకకు ధోనీ తెల్లటి షేర్వాణీలో వచ్చాడు. సాక్షి కూడా తెల్లటి దుస్తుల్లో కనిపిస్తుంది. ఇద్దరూ కలిసి చాలా ఫోటోషూట్‌లు చేశారు. సోషల్ మీడియాలో వీడియోలు వైర‌ల్ గా మారాయి.

 

| Cricketer Mahendra Singh Dhoni along with his wife Sakshi arrives at Jio World Centre in Mumbai to attend Anant Ambani and Radhika Merchant's 'Sangeet ceremony' pic.twitter.com/xC0aGdiIIG

— ANI (@ANI)

 

శ్రేయాస్ అయ్యర్ కూడా.. 

ఈ సంగీత్ వేడుకకు టీమిండియా స్టార్ క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్ కూడా వ‌చ్చారు. అలాగే, బాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్స్ కూడా సంగీత్ వేడుకలో పాల్గొన్నారు. అయితే, ఇప్పటి వరకు టీ20 ప్రపంచకప్ ట్రోఫీతో తిరిగొచ్చిన క్రికెటర్లు ఎవరూ కనిపించలేదు. జూలై 4న తిరిగి వచ్చిన ప్రపంచ ఛాంపియన్స్ ప్రస్తుతం బిజీ షెడ్యూల్‌లో ఉన్నారు.

జూలై 12న అనంత్-రాధిక‌ల‌ పెళ్లి.. 

కొన్ని నెలల క్రితం అనంత్ అంబానీ, రాధిక మ‌ర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు వారం రోజుల పాటు జరిగాయి. ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన తారలు ఈ వేడుకలో కనిపించారు. ఇప్పుడు అనంత్ అంబానీ-రాధిక వివాహం జూలై 12న  జ‌ర‌గ‌నుంది.

విరాట్ కోహ్లీ-అనుష్క శాశ్వతంగా లండన్ కు వెళ్ళిపోతున్నారా?

click me!